Cucumber In Night : రాత్రిపూట దోసకాయ ఎందుకు తినకూడదు.. తెలుసుకోండి
Cucumber In Night : వేసవిలో దోసకాయ తినడం ఆరోగ్యానికి మంచి చేస్తుంది. అయితే దీనిని రాత్రిపూట తింటే సమస్యలు వస్తాయి. ఎందుకు తినకూడదో తెలుసుకోండి.
చాలా మంది వేసవిలో దోసకాయను ఆహారంలో చేర్చుకుంటారు. ఇది చాలా మంచి పోషక విలువలను కలిగి ఉంది. దోసకాయ వేసవి కాలంలో యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది. ఇందులో చాలా విటమిన్లు ఉంటాయి. దోసకాయలో కేలరీలు తక్కువ. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దోసకాయను రెగ్యులర్ గా తింటే ఏమవుతుందో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అయితే రాత్రిపూట మాత్రం తినకూడదు. 96 శాతం నీరు, పోషకాలు సమృద్ధిగా ఉన్న దోసకాయను వేసవిలో తీసుకోవడం మంచిది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల దోసకాయ నుండి శరీరానికి తగినంత నీరు అందుతుంది. దీనివల్ల నష్టం కూడా ఉంది.
జీర్ణ సమస్యలు
చాలా మంది దోసకాయలో నీరు మాత్రమే ఉంటుందని, సులభంగా జీర్ణం అవుతుందని అనుకుంటారు. కానీ దోసకాయలో 95 శాతం నీరు ఉన్న మాట వాస్తవమే కానీ అది అంత తేలికగా జీర్ణం కాదన్నది నిపుణుల అభిప్రాయం. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని రాత్రిపూట తీసుకోవాలి. అందుకే నిద్రవేళకు 2-3 గంటల ముందు ఆహారం తీసుకోవడం మంచిది. మీరు రాత్రిపూట దోసకాయను ఎక్కువగా తింటే, నిద్ర లేకపోవడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను చూస్తారు.
రాత్రిపూట తినకూడదు
రాత్రిపూట దోసకాయలను ఎక్కువగా తింటే గ్యాస్ సమస్యలు వస్తాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో, మీకు కడుపు సమస్యలు ఉంటే, దోసకాయ మరింత హాని కలిగిస్తుంది. క్యాలీఫ్లవర్, బ్రోకోలీతో దోసకాయ తింటే గ్యాస్, అజీర్ణం సమస్యలు వస్తాయి. దోసకాయల్లో ఉండే కుకుర్బిటాసిన్ ఈ సమస్యలకు కారణం. ఇది దోసకాయలలో చేదును కలిగిస్తుంది.
దోసకాయలో నీరు ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి. దోసకాయ తిన్న వెంటనే ఎక్కువ నీరు తాగవద్దు. దోసకాయ తొక్కలో కుకుర్బిటాసిన్ ఎక్కువగా ఉంటుంది. దోసకాయను బాగా కడిగి, తొక్క తీసి చివర తొలగించి తినండి.
దోసకాయ ప్రయోజనాలు
హీట్ స్ట్రోక్ పేషెంట్లకు వారి శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఇంటి నివారణగా ఉపయోగించబడుతుంది. హీట్ స్ట్రోక్‌తో బాధపడేవారికి ఉపశమనం కోసం దోసకాయ ముక్కలను తలపై ఉంచుతారు.
దోసకాయలో తక్కువ కేలరీలు, ఫైబర్ పుష్కలంగా ఉన్నందున వేసవి సీజన్‌కు అద్భుతమైనది. ఇది వివిధ యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లతో శరీరాన్ని పోషించడంలో సహాయపడుతుంది.
మీ కళ్ళు వేడితో అలసిపోయినా లేదా వాచిపోయినా, దోసకాయ ముక్కను 10-15 నిమిషాలు ఉంచడం వల్ల అలసట నుండి ఉపశమనం పొందవచ్చు. మీ కళ్ళు తాజాగా ఉంటాయి.
దోసకాయలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
దోసకాయ రసాన్ని అప్లై చేయడం వల్ల మీ చర్మం యవ్వనంగా, మృదువుగా కనిపిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మీ చర్మాన్ని కాంతివంతం చేస్తాయి, టానింగ్‌ను తగ్గిస్తాయి. ఇది ముడతలు, ఫైన్ లైన్లను కూడా తగ్గిస్తుంది.