ఇలాంటి మగాళ్లను అమ్మాయిలు పిచ్చిగా ఇష్టపడతారంట!-know what women love in men ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Know What Women Love In Men

ఇలాంటి మగాళ్లను అమ్మాయిలు పిచ్చిగా ఇష్టపడతారంట!

Couple
Couple (Pixabay)

ప్రతి పురుషుడిలో అమ్మాయిలను ఆకర్షించే ఏదో ఒక గుణం ఉంటుందట. అయితే చాలా మంది మగవాళ్లు ఈ విషయాన్ని గ్రహించరు. ఇక్కడ అందం ప్రధానం కాదు. కొందరి మగాళ్ల మాటలు, చేష్టలు వారి వ్యక్తిత్వం ఇలా కొన్ని అంశాలు ఆడవాళ్లని విపరీతంగా ఆకర్షిస్తాయని అధ్యయనాలు తెలిపాయి.

కొన్నిసార్లు అబ్బాయిలు తమకు తెలియకుండా చేసేపనులు, వారి హీరోయిజం లేదా వారి సెన్స్ ఆఫ్ హ్యూమర్, వారు వాడే పెర్ఫ్యూమ్, పెంచుకునే కుక్కలు ఇలా ఎన్నో అంశాలను మగాళ్లు అంతగా పట్టించుకోరు. కానీ అమ్మాయిలు ప్రత్యేకించి ఇలా వారి ప్రతీ అంశాన్ని కింద నుంచి పైదాకా మొత్తం గమనిస్తారంట. అమ్మాయిల కలల్లో అలాంటి మగాళ్లు వారికి సెక్సీగా కనిపించి, వారిని పిచ్చిపిచ్చిగా ఇష్టపడతారంట. అమ్మాయిల దృష్టిలో ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఏమిటో ఇక్కడ గమనించండి.

ట్రెండింగ్ వార్తలు

చాలా మంది పురుషులు ఏదో ఒక ప్రధాన ఆకర్షణను గ్రహిస్తారు, వారు దానిని గుర్తించనప్పటికీ. వాస్తవానికి, ప్రత్యేకించి వారు దానిని గ్రహించనప్పుడు.

చేతిలో చేయి వేసి ఆమె బొటనవేలును పట్టుకోవడం

ఇద్దరు కలిసి పక్కపక్కన నడుస్తున్నపుడు అమ్మాయి ఏదైనా చెబుతూ ఉన్నపుడు అబ్బాయిలు ఆమె చెప్పేది ఆసక్తికరంగా వింటూ ఆమె చేతిలో చేయేసి బొటన వేలును పట్టుకుని నడిస్తే అది వారికి మీపై ఒక రొమాంటిక్ ఫీల్ కలిగిస్తుందట.

ఉదారత చూపడం

వ్యక్తులతో మర్యాదగా మాట్లాడటం, తమ కంటే స్థాయి తక్కువ ఉన్నవారితో కూడా ఎంతో గౌరవంగా మాట్లాడటం. ఏదైనా టిప్ లాంటిది ఇస్తూ ఉదారత చూపించడం లాంటివి అమ్మాయిలకు నచ్చుతుంది.

ఆమెపై ఆసక్తి కనబరచడం

ఏ అమ్మాయికైనా మీపై ఆసక్తి కలగాలంటే ముందు అబ్బాయి ఆమెపై ఆసక్తి చూపుతున్నట్లు ఆమెకు తెలియాలి. అది మగవారి చూపుల్లో, మాటాల్లో కనిపించాలి. అక్కడ ఎంతో మంది అమ్మాయిలు ఉన్నాఆమెకు ప్రాధాన్యం ఇస్తుంటే..వారితో మాటల్లో మధమధ్యలో ఆ అమ్మాయి పేరు చెబుతుంటే ఇక అబ్బాయిలకు ఎప్పుడో ఒకసారి గ్రీన్ సిగ్నల్ తప్పకుండా వస్తుంది.

నవ్వించడం

ఇక్కడ నవ్వించడం అంటే ఏదో ఒక చీమ ఏనుగు జోక్ చెప్పి నవ్వించడం కాదు. ఆమె మొఖంలో నవ్వు వచ్చేలా చేయడం. కొనిసార్లు అబ్బాయిలు తెలివితక్కువగా ఏదైనా పొరపాటు చేసినా, లేదా అమాయకంగా అనిపించినా వారు నవ్వగలిగితే, ఇక అమ్మాయి మీతో గడపాలని కోరుకుంటుంది.

నడుముపై చేయి వేసి నడిపించడం

కావాలని నడుముపై చేయి వేసి కరువు ప్రాంతంలో నుంచి వచ్చినట్లుగా ప్రవర్తించకుండా. రోడ్ దాటుతున్నప్పుడు ఒక కేర్ తీసుకుంటున్నట్లుగా ఆమె వీపు భాగం నుంచి నడుమును పట్టుకొని నడిపిస్తే.. ఇలాంటి సందర్భాలలో అబ్బాయిలు నచ్చుతారు.

చిన్నపిల్లలను ముద్దు చేస్తున్నపుడు

ఎవరైనా మగాళ్లు చిన్న పిల్లలను ముద్దు చేస్తూ వారిని ఆడిస్తూ, వారితో ఆడుకుంటూ ఉంటే అలాంటి అబ్బాయిలంటే అమ్మాయిలకు ఎంతో ముద్దొస్తారంట.

ముద్దుపెట్టడం

అనుకూలమైన టైం వచ్చినపుడు చటుక్కున ఒక ముద్దుపెట్టడం.. ఆ తర్వాత తనకు నచ్చితే ఆమె మెడ, నుదురు, చెంపలు, పెదాలపై ముద్దులు పెట్టి అంతటితో ఆపేయాలి. ఇది తర్వాతి కాలంలో బంధం మరింత బలపడే అవకాశం ఉంటుంది.

చివరగా ఒక ముఖ్య గమనిక.. అమ్మాయి ఎవరినీ ఇష్టపడినపుడు.. మీపై ఎంతో కొంత ఇష్టపడితే.. ఇద్దరి అభిప్రాయాలు, ఆసక్తుల మేరకు

పైన చెప్పిన కొన్ని చర్యలు మీపై ఆసక్తిని పెంచుతాయి. కొంచెం తేడా వచ్చినా.. అంతే సంగతి. మరీ మీ లక్ ట్రై చేసుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్