Male Fertility । వయాగ్రాను అందరూ తీసుకోవద్దు.. ముఖ్యంగా ఆ సమస్యలు ఉన్నవారు!
Male Fertility: అంగస్తంభన సమస్య ఉన్న ప్రతీవారు వయాగ్రాను వాడకూడదు. వయాగ్రా లైంగిక సామర్థ్యంపై ఎలా ప్రభావం చూపుతుంది ఇక్కడ తెలుసుకోండి.
Male Fertility: బంగారాన్ని మించిన విలువైన సంపద శృంగారం అని చెప్తారు. శృంగారం అనేది ఆడ, మగ ఇద్దరిలో సహజంగా జరిగే ప్రాకృతిక చర్యగా ఉండాలి. కలయిక దంపతుల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. రెండు తనువులు ఏకమైతే, మనసులు వికసిస్తాయి. ప్రతి వ్యక్తి ఒక నిర్దిష్ట వయస్సు వచ్చిన తర్వాత శృంగారంలో పాల్గొనడానికి ఆసక్తి చూపడం చాలా సహజం.
రతిక్రీడ శారీరక ఆనందంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అయితే శృంగార కోరికలు ఉన్నప్పటికీ కొంతమంది పురుషులు సంభోగం చేయలేరు. ఇందుకు ఒక కారణం వారిలో అంగస్తంభన సమస్య ఉండవచ్చు. అంగం స్తంభించని సందర్భంలో సంభోగం సాధ్యపడదు, పిల్లలు కావాలని కోరుకునే వారికి ఇది పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. ఇలాంటి సందర్భంలో వారికి వైద్యులు వయాగ్రాను సిఫారసు చేసే అవకాశం ఉంటుంది.
What is Viagra- వయాగ్రా అంటే ఏమిటి?
వయాగ్రా పేరు మీరందరూ వినే ఉంటారు. వయాగ్రా అనేది నీలిరంగులో, డైమండ్ ఆకారంలో ఉండే ఒక ఔషధం. ఇది ఒక ఉత్ప్రేరకం లాంటిది. ఫార్మసీలలో వయాగ్రా టాబ్లెట్ రూపంలో అందుబాటులో ఉంటుంది. దీనిని సెక్స్ టాబ్లెట్ అని కూడా పిలుస్తారు. వయాగ్రాను మొదట్లో అధిక రక్తపోటు, ఆంజినా పెక్టోరిస్ చికిత్సకు ఉపయోగించడం జరిగేది. వయాగ్రాలో సిల్డెనాఫిల్ అనే సమ్మేళనం ఉంటుంది. రక్త ప్రసరణను పెంచడం ద్వారా జననేంద్రియ ప్రాంతంలో ఉత్తేజాన్ని పెంచుతుంది.
How to Use Viagra- వయాగ్రా ఎలా ఉపయోగించాలి?
సాధారణంగా వయాగ్రాను భోజనానికి అరగంట ముందు లేదా 2 గంటల తర్వాత తీసుకోవాల్సిందిగా సిఫారసు చేస్తారు. దీని ప్రభావం దాదాపు 4-5 గంటల పాటు ఉంటుంది. వయాగ్రాను పురుషులు మాత్రమే ఉపయోగించాలి. స్త్రీలకు అంగస్తంభన సమస్యలు ఉండవు, వారికి ఇది ఉపయోగం లేదు. వయాగ్రా తీసుకునేటప్పుడు నీళ్లు మాత్రమే తాగాలని సూచిస్తారు. మద్యం తాగినపుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వయాగ్రా తీసుకోవద్దు. మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ ఔషధాన్ని వైద్యుల సలహా మేరకు మాత్రమే ఉపయోగించాలి. స్వంత వైద్యంతో దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంటుంది.
Who Shouldn't Take Viagra- వయాగ్రా ఎవరు తీసుకోకూడదు?
వయాగ్రాతో మగవారిలో అంగస్తంభన సమస్య పరిష్కారం అవుతుంది. అయితే వయాగ్రాను తీసుకోవడం అందరికీ మంచిది కాదు. దీని వల్ల కొన్ని అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదివరకు చెప్పినట్లుగా, వయాగ్రాలో సిల్డెనాఫిల్ సమ్మేళనం ఉంటుంది. సిల్డెనాఫిల్ లేదా ఇతర ఔషధాలకు అలెర్జీ ఉన్న వ్యక్తులు వయాగ్రాను తీసుకోకూడదు.
అలాగే ఛాతీ నొప్పికి నైట్రేట్ మందులు వాడే వారు కూడా వయాగ్రా తీసుకోకూడదు. గుండె, కాలేయ సంబంధ సమస్యలు ఉన్నవారు, అదేవిధంగా స్ట్రోక్, గుండెపోటు వంటివి ఎదుర్కొన్నవారు వయాగ్రా జోలికి అస్సలు వెళ్లకూడదు. తక్కువ రక్తపోటు ఉన్న రోగులకు కూడా ఇది మంచిది కాదు. అరుదైన జన్యుపరమైన కంటి వ్యాధులు, లుకేమియా, మల్టిపుల్ మైలోమా వంటి రక్త క్యాన్సర్‌లు ఉన్న రోగులు వయాగ్రాను తీసుకోకూడదు. అలాగే, జననేంద్రియ వైకల్యాలున్న వ్యక్తులు, కడుపు పూతలతో బాధపడుతున్న పురుషులు కూడా వయాగ్రాను తీసుకోవడం మంచిది కాదు. రక్తస్రావం సమస్యలతో బాధపడే పురుషులు కూడా వయాగ్రా తీసుకోకూడదు. వయాగ్రాను కోరుకునేటపుడు మీ వైద్యుడికి మీ అనారోగ్య విషయాలను బహిర్గతం చేయాలి.
వయాగ్రా తీసుకున్న తర్వాత కొంతమంది పురుషులు తలనొప్పి, వికారం, అజీర్ణం, చలి, తల తిరగడం వంటివి అనుభవిస్తారు. సమస్య పెరుగుతున్నట్లు అనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
కాగా, సెక్స్ లైఫ్ ఆనందాన్ని పెంచే వయాగ్రాను ఉపయోగించడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఇది అల్జీమర్స్ వ్యాధికి కూడా మెరుగైన ప్రభావాలను కనబరుస్తున్నట్లు ఇటీవలి అధ్యయనాలు పేర్కొన్నాయి. ఏదేమైనా వైద్యుల సిఫారసు మేరకు మాత్రమే దీనిని వాడాలి.
సంబంధిత కథనం
టాపిక్