Black Mucus: తుమ్మినా, దగ్గినా శ్లేష్మం నలుపు రంగులో వస్తే ప్రమాద హెచ్చరిక.. దానికి కారణాలేంటి?-know serious signs and reasons of black mucus while sneezing and cough ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Black Mucus: తుమ్మినా, దగ్గినా శ్లేష్మం నలుపు రంగులో వస్తే ప్రమాద హెచ్చరిక.. దానికి కారణాలేంటి?

Black Mucus: తుమ్మినా, దగ్గినా శ్లేష్మం నలుపు రంగులో వస్తే ప్రమాద హెచ్చరిక.. దానికి కారణాలేంటి?

Koutik Pranaya Sree HT Telugu
Aug 07, 2024 09:30 AM IST

Black Mucus: వృత్తిపరమైన ప్రమాదాల నుండి తీవ్రమైన ఇన్ఫెక్షన్ల వరకు, నల్ల శ్లేష్మానికి కారణాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెల్సుకోండి

నలుపు రంగు శ్లేష్మానికి కారణాలు
నలుపు రంగు శ్లేష్మానికి కారణాలు (Unsplash)

నలుపు రంగు శ్లేష్మం లేదా నలుపు రంగు కఫంతో కూడిన దగ్గు అంతర్లీన అనారోగ్యానికి తీవ్రమైన సంకేతం. ఫరీదాబాద్ లోని అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మెడికల్ ఆంకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విదిత్ కపూర్ హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నలుపు రంగు శ్లేష్మం వివిధ పర్యావరణ కారకాలు, అంటువ్యాధులు లేదా ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి మరింత తీవ్రమైన పరిస్థితుల లక్షణం కావచ్చు. ఎక్కువసార్లు కనిపిస్తే నల్ల శ్లేష్మం క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. తగిన చికిత్సను ప్రారంభించడానికి అత్యవసర వైద్యుల్ని తొందరగా కలవాలి. ఊపిరితిత్తుల క్యాన్సర్ ముందుగానే గుర్తించడం వల్ల రోగ చికిత్స ఫలితాలు గణనీయంగా మెరుగుపడతాయని పేర్కొన్నారు.

నల్ల శ్లేష్మానికి కారణమేమిటి?

ధూమపానం: పొగాకు వాడకం.. భారతదేశంలో ధూమపానం చేసేవారి సంఖ్య గణనీయంగా ఉంది. ఇందులో బీడీలు, సిగరెట్ల వాడకం ఎక్కువ. ఈ పొగలోని హానికరమైన పదార్ధాల వల్ల నల్ల శ్లేష్మం రావచ్చు.

బొగ్గు గనులు: బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులకు బొగ్గు ధూళి పీల్చడం వల్ల న్యుమోకోనియోసిస్ (బ్లాక్ లంగ్ డిసీజ్) వచ్చే ప్రమాదం ఉంది.

నిర్మాణ రంగం: దుమ్ము, పారిశ్రామిక కాలుష్య కారకాలకు గురయ్యే కార్మికులకు శ్వాసకోశ సమస్యలు ఏర్పడి నల్ల శ్లేష్మం ఏర్పడుతుంది.

రోడ్డు పక్కన కాలుష్యం: భారీగా వాహనాలు రవాణా అయ్యే రహదారులకు దగ్గరగా ఉండటం వల్ల వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు, దుమ్ము ధూళికి గురికావడం కూడా దీనికి కారణం.

పంట కాల్చడం: పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో కొన్ని కాలాల్లో పంట దహనం వల్ల పెద్ద మొత్తంలో ధూళి కణాలను గాలిలోకి విడుదల చేస్తుంది. ఇది శ్వాసకోశ ఇబ్బంది, నల్ల శ్లేష్మానికి దోహదం చేస్తుంది.

క్షయవ్యాధి: భారతదేశంలో క్షయవ్యాధి ఎక్కువగా ఉంది, ఇది రక్తంతో కూడిన లేదా ముదురు రంగు శ్లేష్మానికి దారితీస్తుంది.

ఫంగల్ ఇన్ఫెక్షన్లు: తేమ, అపరిశుభ్ర వాతావరణంలో ఎక్కువగా కనిపించే ఆస్పెర్గిలోసిస్ వంటి పరిస్థితులు నల్ల శ్లేష్మానికి దారితీస్తాయి.

నల్ల శ్లేష్మం లంగ్ క్యాన్సర్ సంకేతమా?:

కణితి పెరుగుదల: ఊపిరితిత్తుల క్యాన్సర్ నెక్రోసిస్ (కణజాలం మరణం) మరియు ఊపిరితిత్తుల లోపల రక్తస్రావం కలిగిస్తుంది. రక్తం మరియు ఊపిరితిత్తుల కణజాలం విచ్ఛిన్నం వల్ల ముదురు లేదా నలుపు రంగు శ్లేష్మానికి దారితీస్తుంది.

ఇన్ఫెక్షన్: కణతులు వాయుమార్గాలకు ఆటంకం కలిగిస్తాయి. ఇది నలుపు శ్లేష్మాన్ని ఉత్పత్తి చేసే అంటువ్యాధులకు, ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.

లంగ్ క్యాన్సర్ దీర్ఘకాలిక లక్షణాలు:

నిరంతర దగ్గు: నల్ల శ్లేష్మం ఉత్పత్తి చేసే నిరంతర దగ్గు అంతర్లీన క్యాన్సర్‌ను సూచిస్తుంది. ఇది తరచుగా ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి ఇతర లక్షణాలు కలిగి ఉంటుంది.

బరువు తగ్గడం, అలసట: ఉన్నట్లుండి ఎక్కువగా బరువు తగ్గడం, అలసట, నల్ల శ్లేష్మంతో కూడిన నిరంతర దగ్గు ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధించిన హెచ్చరిక సంకేతాలు.

హిమోప్టిసిస్: శ్లేష్మంలో రక్తం ఉండటం, దాంతో ముదురు లేదా నలుపు రంగులోకి మారడం.. వంటి సంకేతాలు రక్త నాళాలలోకి కణితి ఏర్పడటం వల్ల సంభవిస్తుంది.

ముందస్తుగా గుర్తించడం మరియు రోగ నిర్ధారణ:

ఎక్కువ రోజులు నల్ల శ్లేష్మం రావడం అంతర్లీన కారణాన్ని గుర్తించడానికి, దాగి ఉన్న క్యాన్సర్ గుర్తించడానికి ఇమేజింగ్ (ఎక్స్-కిరణాలు, సిటి స్కాన్లు మొదలైనవి) అవసరం.

బయాప్సీ: ఊపిరితిత్తుల క్యాన్సర్ అని అనుమానించినట్లయితే, రోగ నిర్ధారణను నిర్ధారించడానికి, క్యాన్సర్ రకాన్ని నిర్ధారించడానికి బయాప్సీ చేయవచ్చు.

 

Whats_app_banner