Lunch box ideas: సోమ నుంచి శనివారం దాకా పిల్లల లంచ్ బాక్స్ ఐడియాలు.. వంటకాల జాబితాతో సహా
Lunch box ideas: పిల్లలకు లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలనే ఆలోచన రోజూ ఉంటోందా? అయితే వారానికి సరిపడా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి.
పిల్లలకు ప్రతి రోజూ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసివ్వడమంటే పెద్ద టాస్కే. అది వాళ్లకు నచ్చేలా ఉండాలి. పోషకాలూ అందాలి. కొత్తగానూ ఉండాలి. ప్రతి రోజూ పప్పన్నం పెట్టిస్తే సరిగ్గా తినలేరు. అలాగే కొందరు పిల్లలు చేత్తో పట్టుకుని తినేలా శ్యాండ్ విచ్, చపాతీ రోల్స్ లాంటివి ఇష్టపడతారు. మరికొంత మంది పిల్లలకు నమలుతూ ఎక్కువ సేపు తినడం ఇష్టం ఉండదు. దాంతో లంచ్ బాక్స్ లోకి అన్నాన్నే ఇష్టపడతారు. అందుకే లంచ్ బాక్స్ లోకీ వారానికి సరిపడా ఎలాంటి వంటకాలు చేసి పెట్టొచ్చో చూసేయండి. చివర్లో ఇచ్చిన వారానికి సరపడా లంచ్ బాక్స్ ఐడియాలూ చూసేయండి.
లంచ్ బాక్స్ రెసిపీలు:
రోటీ లేదా పరాటాలు:
లంచ్ బాక్స్ లోకి చపాతీలు లేదా పరాటాలు చేయాలనుకుంటే మీకున్న సులభమైన ఆప్షన్స్ చూడండి.
పాలక్ పరాటా
మేతీ పరాటా
ఆలూ పరాటా
ఆలూ రోల్
వెజిటేబుల్ రోల్
సొరకాయ పరాటా
పన్నీర్ పరాటా
చిలగడదుంపలతో పరాటా
మీల్ మేకర్ పరాటా
రైస్ రెసిపీలు:
లంచ్ బాక్స్ లోకి అన్నం, కర్రీ వేరుగా పెట్టిస్తే పిల్లలు కలుపుకుని తినడానికి అంత ఇష్టపడరు. వాళ్లు బాక్స్ ఖాళీ చేయాలంటే రకరకాల వెరైటీ రైస్ రెసిపీలు ప్రయత్నించాల్సిందే. అలాగనీ వీటి తయారీకి టైమ్ కూడా పట్టదు. కూర తాలింపు వేసే సమయంలో వీటి తయారీ అయిపోతుంది. అలాంటి ఆప్షన్లు చూడండి.
పల్లీల అన్నం
నువ్వుల అన్నం
పుదీనా రైస్
కొత్తిమీర రైస్
మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్
స్వీట్ కార్న్ పులావ్
పాలక్ రైస్
ఆలూ రైస్
క్యారట్ రైస్
బీట్‌రూట్ రైస్
జీరా రైస్
మష్రూమ్ రైస్
క్యాబేజీ రైస్
పన్నీర్ పులావ్
టమాటా రైస్
పులిహోర
లెమన్ రైస్
కొబ్బరి పాలతో పులావ్
పైనాపిల్ రైస్
మిక్స్డ్ వెజిటేబుల్ రైస్
క్యాప్సికం రైస్
ఇప్పుడు వారానికి సరిపడా లంచ్ బాక్సెస్ ఎలా సర్దాలో చూద్దాం:
సోమవారం రోజు:
పాలక్ లేదా మేతీ పరాటా లేదా ఏదైనా ఆకుకూరతో చేసిన పరాటా
టమాటా పచ్చడి/ నువ్వుల పచ్చడి/ పల్లీల పచ్చడి
క్యారట్ ముక్కలు
మంగళవారం రోజు:
స్వీట్ కార్న్ రైస్/ మీల్ మేకర్ రైస్/ క్యాలీఫ్లవర్ రైస్/ క్యారట్ రైస్/ క్యాబేజీ రైస్
సింపుల్ మసాలా గ్రేవీ
వెజిటేబుల్ సలాడ్
బుధవారం రోజు:
వెజిటేబుల్ రోల్/ ఆలూ రోల్/ మసాలా ఫ్రాంకీ/ స్వీట్ పొటాటో రోల్/ పన్నీర్ రోల్
ఫ్రూట్ సలాడ్
ఫ్లేవర్డ్ యోగర్ట్
గురువారం రోజు:
జీరా రైస్/ పుదీనా రైస్/ కొత్తిమీర రైస్/ లెమన్ రైస్/ పులిహోర
పన్నీర్ బటర్ మసాలా/ పాలక్ పన్నీర్/ పన్నీర్ బుర్జి
కీరదోస ముక్కలు
శుక్రవారం:
వెజిటేబుల్ బిర్యానీ / వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ /వెజిటేబుల్ పులావ్
కీరదోస, క్యారట్ రైతా
శనివారం:
శ్యాండ్ విచ్/ పాస్తా / పావ్ బాజీ/ నూడుల్స్ / వెజ్ బర్గర్ / కట్లెట్ / కబాబ్స్
యోగర్ట్ డిప్ లేదా ఫ్లేవర్డ్ డిప్, లేదంటే ఏదైనా చట్నీ