Know About Uric Acid: ఈ లక్షణాలు కనిపిస్తే అది యూరిక్‌ యాసిడ్‌ సమస్య అవ్వచ్చు..-know about uric acid and its symptoms precautions ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Know About Uric Acid: ఈ లక్షణాలు కనిపిస్తే అది యూరిక్‌ యాసిడ్‌ సమస్య అవ్వచ్చు..

Know About Uric Acid: ఈ లక్షణాలు కనిపిస్తే అది యూరిక్‌ యాసిడ్‌ సమస్య అవ్వచ్చు..

HT Telugu Desk HT Telugu
Oct 26, 2023 05:51 PM IST

Know About Uric Acid: శరీరంలో కొన్ని లక్షణాల వల్ల యూరిక్ యాసిడ్ పెరిగిందని గుర్తొంచొచ్చు. అవేంటో, ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో తెలుసుకోండి.

యూరిక్ యాసిడ్ లక్షణాలు
యూరిక్ యాసిడ్ లక్షణాలు

చాలా మందికి కాళ్ల నొప్పులు ఇబ్బంది పెడుతుంటాయి. పాదాలు, పాదాల వేళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల్లాంటివి కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ మన శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ పెరుగుదలను లక్షణాలు కావచ్చు.

యూరిక్‌ యాసిడ్‌ మన శరీరం సహజంగా విసర్జించే వ్యర్థ పదార్థాల్లో ఒకటి. మనం తీసుకునే ఆహార పదార్థాల్లోని ప్యూరిన్‌ అనే రసాయనం విచ్ఛిన్నం చెందినప్పుడు యూరిక్‌ యాసిడ్‌ ఏర్పడుతుంది. ఇది ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. అయితే విసర్జన సరిగా జరగకపోయినప్పుడు యూరిక్‌ యాసిడ్‌ రక్తంలోనే నిలిచిపోతుంది. క్రమంగా ఇది స్ఫటికాలుగా మారి కీళ్లు, వాటి చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతుంది. దీని వల్ల కీళ్ల నొప్పులు, గౌట్ వ్యాధులు వస్తాయి.

ప్యూరిన్లు అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. అలాగే రక్తంలో అధిక చక్కెర స్థాయిలు, హైబీపీ, మెటబాలిక్‌ సిండ్రోమ్‌, అధికంగా మద్యం తాగడం, పేగుల ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, ఎక్కువ కదలికలు లేని జీవన విధానంలో ఉండటం, వేళకాని వేళ తినడం పడుకోవడం, తగినంత నీటిని తాగకపోవడం.. లాంటి వాటి వల్ల రక్తంలో ఈ యూరిక్‌ యాసిడ్‌ పెరిగిపోతుంది. మనలో ఈ లక్షణాలు గనుక కనిపించినట్లయితే దాన్ని యూరిక్‌ యాసిడ్‌గా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

యూరిక్‌ యాసిడ్‌ లక్షణాలు :

  • చేతి వేళ్లు, కాలి వేళ్లలో ఎక్కువ నొప్పి ఉంటుంది. కొన్ని సార్లు ఈ నొప్పులు భరించలేనంత ఎక్కువగా ఉంటాయి. వేళ్ల కీళ్ల దగ్గర వాపులు వచ్చి కనిపిస్తుంటాయి.
  • కొందరిలో పాదాలు, కాలి వేళ్లు, కీళ్ల దగ్గర ఎరుపుదనం కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. శరీర అంతర్గతంగా ఆ స్థానాల్లో వాపులు వచ్చినట్లు మనం అర్థం చేసుకోవాలి.
  • నొప్పి ఉన్న కీళ్ల దగ్గర వాపు రావడం, బొబ్బలు రావడం లాంటివి ఉంటాయి.
  • బాగా అలసటగా అనిపించడం, ఏం చేయాలన్నా ఓపిక లేనట్లుగా అనిపించడం లాంటివీ దీన్ని సూచిస్తాయి.
  • శరీరంలో ఎక్కువ యూరిక్‌ యాసిడ్‌ నిల్వల వల్ల ఇన్‌ఫెక్షన్‌ ఉంటుంది. దీని వల్ల జ్వరం రావడమూ జరగవచ్చు. ఈ లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తుంటే వారు వైద్యుల్ని సంప్రదించి తగిన చికిత్సలు చేయించుకోవాల్సి ఉంటుంది.

యూరిక్‌ యాసిడ్‌ తగ్గాలంటే :

  • యూరిక్‌ యాసిడ్‌ని తగ్గించుకోవాలంటే తప్పకుండా కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. మద్యాన్ని మానివేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
  • విందులు, వినోదాల్లో హెవీగా భోజనం చేయకూడదు. చక్కెరలు ఎక్కువగా ఉండే పానీయాలు, ఆహారాలు తినకూడదు.
  • ఆహారాల్లో ఉండే ప్యూరిన్ల వల్ల మనలో ఈ సమస్య వస్తుంది కాబట్టి ప్యూరిన్లు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.