Know about Cheese: చీజ్ తింటే మంచిది కాదా? భయపడుతూ తినాల్సిందేనా?
Know about Cheese: చీజ్ అంటే ఇష్టపడని వారు తక్కువే. అయితే ఇష్టంతో పాటూ ఆరోగ్యానికి హాని జరుగుతుందోననే భయం. నిజానికి చీజ్ ప్రభావం ఆరోగ్యంపై ఎలా ఉంటుందో చూడండి.
మనం పీజాలు, బర్గర్లు, చీజ్ శాండ్‌విచ్‌లు.. లాంటి వాటిలో ఎక్కువగా చీజ్ ఉన్న వాటిని తింటుంటాం. అలాగే మరి కొన్ని బేక్డ్ పదార్థాల్లోనూ ఎక్కువగా దీన్ని వాడుతుంటారు. మరి చీజ్ తినడం వల్ల మనకు అసలు మంచిదేనా? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? లాంటి విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. చీజ్‌లో బోలెడు పోషకాలు ఉంటాయి. ప్రొటీన్‌లు, కాల్షియం, మంచి కొవ్వులు, విటమిన్ బీ12, పాస్ఫరస్, జింక్, రైబో ఫ్లావిన్ లాంటి ఎన్నో రకాల విటమిన్‌లు, మినరల్‌లు దీనిలో దొరుకుతాయి. ఇది మన శరీరం మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి సహకరిస్తుంది.
చీజ్ వల్ల లాభాలు:
కండ పుష్టి :
చీజ్‌లో నాణ్యమైన ప్రొటీన్‌లు అందుబాటులో ఉంటాయి. అందువల్ల ఇది తినే వారిలో కండరాలు బలంగా తయారవుతాయి. కండ పుష్టి కలుగుతుంది. ఇది బలహీనంగా ఉన్న కండరాల్ని రిపేర్ చేస్తుంది. తిరిగి మన శరీర అవసరాలకు అనుగుణంగా అవి పని చేసేలా చేస్తుంది.
ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి:
ముఖ్యంగా శాకాహారం మాత్రమే తినేవారు దీన్ని వారి ఆహారంలో భాగం చేసుకోవాలి. అందువల్ల ప్రొటీన్ ఒకటే కాకుండా బీ 12 కూడా లభిస్తుంది. మొక్కలకు సంబంధించిన ఆహారాల్లో బీ12 లభ్యం కాదు. కాబట్టి శాకాహారులు చీజ్ ని క్రమం తప్పకుండా తింటూ ఉండాలి. దీని వల్ల డీఎన్‌ఏ సింథసిస్ జరుగుతుంది. ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి సహకరిస్తుంది.
దృఢమైన ఎముకలు:
కాల్షియం సమృద్ధిగా దొరికే ఆహారాల్లో చీజ్ ఒకటి. ఇది తగినంతగా తినే వారిలో బోలు ఎముకల వ్యాధుల్లాంటివి దరి చేరవు. ఎముకలు, పళ్లు దృఢంగా ఉంటాయి. పళ్లు బలంగా ఉండి గలక పళ్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 2015లో పిల్లలపై జరిగిన ఓ సర్వేలో ప్రతి రోజూ పాల ఉత్పత్తులు తినే వారిలో మిగిలిన వారితో పోలిస్తే పళ్లు దృఢంగా ఉండటాన్ని పరిశోధకులు గమనించారు.
రక్త స్రావాన్ని ఆపడంలో :
కేవలం గడ్డి మాత్రమే తిని పాలిచ్చే ఆవులు, గేదెల నుంచి తీసిన చీజ్‌లో సమృద్ధిగా విటమిన్ కే2, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. దెబ్బలు తగిలినప్పుడు రక్త స్రావం ఆగడానికి ఈ కే2 విటమిన్ ఉపయోగపడుతుంది.
రక్తపోటును తగ్గిస్తుంది:
మార్కెట్లో ఉప్పు కలిపిన సాల్టెడ్ చీజ్‌లను ఎక్కువగా అమ్ముతుంటారు. అవి కాకుండా సోడియం లేని సాధారణ చీజ్‌ని తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటున్నట్లు కొన్ని అధ్యయనాల్లో వెల్లడయ్యింది.
టాపిక్