Emotional maturity: మీ పార్ట్‌నర్‌కు ఎమోషనల్ మెచ్యూరిటీ లేదా? 6 సంకేతాలు చూడండి
Emotional maturity: మీ పార్ట్‌నర్‌కు ఎమోషనల్ మెచ్యూరిటీ లేనట్టయితే మీ బంధం నిలబడదు. ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ 6 సంకేతాలు చెక్ చేయండి.
ఒకరినొకరు తెలుసుకుంటూ, ఒకరి ప్రేమలో మరొకరు మునిగి తేలుతూ, కష్టసుఖాల్లో పాలుపంచుకునే రెండు మనసుల ప్రయాణమే బంధం. ప్రారంభంలో దీపావళి బాణాసంచాలా అంతా హాపీగా ఉంటుంది. అయితే ఇది కొనసాగాలంటే ఇరువైపులా ప్రయత్నాలు, అర్థం చేసుకునే మనస్తత్వం, ఇద్దరి మధ్యా కమ్యూనికేషన్ ఉండాలి. ప్రతి విషయం గురించి చర్చించుకునే చొరవ ఉండాలి. వారి సహజ స్వభావం గురించి అయినా, వారి అభద్రతాభావాల గురించైనా లేక వారు ఎదుర్కొన్న గాయాల గురించైనా చర్చించుకునే చొరవ ఉండాలి.
ప్రతి ఒక్కరూ తమ తమ మానసిక గాయాలను తమతోనే మోస్తూ ఉంటారు. జీవితంలో ఏదో ఒక సమయంలో అవి భారమై కూర్చుంటాయి. ప్రస్తుత బంధంపై ప్రభావం చూపుతుంటాయి. కాలక్రమంలో మన సంబంధాలపై ఆ గాయం తాలూకు ప్రభావం పడకుండా దాని నుంచి బయటపడి మనం ఎదుగుతూ ఉండాలి. లేదంటే అవి బంధంపై ప్రభావం చూపి మీ పార్ట్‌నర్ ఇక చేతులెత్తేసి గుడ్ బై చెప్పొచ్చు. ఇది మీ మానసిక గాయాన్ని క్యారీఫార్వార్డ్ చేస్తూనే ఉంటుంది.
భావోద్వేగ పరిణతి బంధాన్ని ఆరోగ్యవంతంగా, సురక్షితంగా ఉంచుతుంది. భావోద్వేగ పరిణతి లేని వారు బంధం తెచ్చిపెట్టే కష్టాలను ఎదుర్కోలేరు. థెరపిస్ట్ ఎమిలీ హెచ్ సాండర్స్ భావోద్వేగ పరిణతికి సంబంధించి కొన్ని సంకేతాలను వివరించారు. మనతో ఉండాలనుకున్న వారి విషయంలో చూడాల్సిన ఆ సంకేతాలేంటో ఒకసారి మీరూ చూడండి.
ఉత్సుకత (క్యూరియాసిటి): ఉత్సుకత అనేది పరిస్థితి గురించి మరింత తెలుసుకోవాలనుకునే భావం. బంధాల్లో భాగస్వామి మనల్ని అంచనా వేయడం (జడ్జ్ చేయడం) కంటే ఆయా సంఘటనలు, సందర్భాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉండాలని కోరుకోవాలి.
బాధ్యత: బంధంలో వారి వారి తప్పులకు, చర్యలకు బాధ్యత వహించే వ్యక్తితో ఉండాలనుకుంటాం. కానీ మనమందరం ఆ తప్పులను వివరించడానికి, భాగస్వామిపై నెట్టడానికి సాకులు వెతుకుతాం.
సరిహద్దులు: ఏ రకమైన సంబంధంలోనైనా సరిహద్దులు కలిగి ఉండటం, ఇతరుల సరిహద్దులను గౌరవించడం ఆరోగ్యకరమైన సంబంధానికి సంకేతం. భాగస్వామికి తగినంత స్పేస్ ఇవ్వడం మంచిది.
కన్‌క్లూజన్: మానసికంగా పరిణతి చెందిన వ్యక్తులు వెంటనే ఓ కన్‌క్లూజన్‌కు రారు. బదులుగా వారు సంఘటనలను విశ్లేషించి, ఓ నిర్ణయానికి వచ్చేందుకు నిదానంగా ఆలోచిస్తారు.
జడ్జ్‌మెంట్: ఆరోగ్యకరమైన సంబంధంలో ఆమోదయోగ్యమైన చర్చలు చేయొచ్చు. సమ్మతించే చర్యలూ తీసుకోవచ్చు. అయితే కొన్ని ప్రైవేట్‌గా ఉంచడానికి ఉద్దేశించిన ఆలోచనలు ఉండడాన్ని భావోద్వేగ పరిణతిగా చూడాలి.
సపోర్ట్: ఆరోగ్యకరమైన, సురక్షితమైన సంబంధం ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడంపై దృష్టి పెడుతుంది. అదే మానసిక పరిణతి.