Joint Pains Fitness: కీళ్ల నొప్పులు ఉన్న వారు స్విమ్మింగ్ చేయడం మంచిదేనా?-is people with joint pains and arthritis can do swimming ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Joint Pains Fitness: కీళ్ల నొప్పులు ఉన్న వారు స్విమ్మింగ్ చేయడం మంచిదేనా?

Joint Pains Fitness: కీళ్ల నొప్పులు ఉన్న వారు స్విమ్మింగ్ చేయడం మంచిదేనా?

Fitness - Swimming: కీళ్ల నొప్పులు ఉన్న వారు వ్యాయామాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కీళ్లపై మరీ ఒత్తిడి పడితే నొప్పి వేధిస్తుంది. అయితే, కీళ్ల నొప్పులు ఉన్న వారు స్విమ్మింగ్ చేయవచ్చా అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది.

Fitness: కీళ్ల నొప్పులు ఉన్నా వారు స్విమ్మింగ్ చేయవచ్చా?

కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ ఉన్న వారు కూడా రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. అయితే, ఈ సమస్యలు ఉన్న వారు వారికి సూటయ్యే వర్కౌట్లు చేయాలి. కీళ్లపై మరి ఎక్కువగా ఒత్తిడి పడకుండా ఉండాలి. ఒత్తిడి పడితే వ్యాయామం చేసే సమయంలో నొప్పి వస్తుంది. అయితే, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ ఉన్న వారు రెగ్యులర్‌గా స్విమ్మింగ్ చేయవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఆ విషయాలు ఇక్కడ తెలుసుకోండి.

కీళ్ల నొప్పులు ఉన్న వారు చేయొచ్చా?

కీళ్ల నొప్పులు ఉన్న వారు స్విమ్మింగ్ చేయవచ్చు. వర్కౌట్లలో భాగంగా రెగ్యులర్‌గా ఈత కొట్టొచ్చు. స్విమ్మింగ్ వల్ల కీళ్ల నొప్పిపై ప్రభావం పడకుండానే పూర్తి శరీరం ఫిట్‍నెస్ మెరుగుపడుతుంది. స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు శరీర బరువు అత్యధికంగా నీటిపైనే ఉంటుంది. అందుకే శరీర భారం ఎక్కువగా కీళ్లపై ఉండదు. అందుకే కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ ఉన్న వారు స్విమ్మింగ్ చేయవచ్చు.

నొప్పుల నుంచి ఉపశమనం

స్విమ్మింగ్ చేయడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. స్విమ్మింగ్ వల్ల కండరాలు, కీళ్లకు ఆక్సిజన్, పోషకాలు, రక్తం సరఫరా మెరుగ్గా ఉంటుంది. దీనివల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రిలాక్స్ అయినట్టుగా అనిపిస్తుంది.

పూర్తి శరీరానికి..

స్విమ్మింగ్ చేయడం వల్ల పూర్తి శరీర ఫిట్‍నెస్ మెరుగుపడుతుంది. కండరాల దృఢత్వం, పెరుగుదలకు సహకరిస్తుంది. చేతులు, నడుము, కాళ్లు సహా అన్ని భాగాలకు స్విమ్మింగ్ మేలు చేస్తుంది. అవయవాల బలానికి తోడ్పడుతుంది.

గుండె, ఊపిరితిత్తులకు మేలు

స్విమ్మింగ్ చేయడం వల్ల గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. దీనివల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ అవుతుంది. రక్త ప్రకరణ బాగా ఉంటుంది. దీనివల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఊపిరితిత్తులకు కూడా స్విమ్మింగ్ మేలు చేస్తుంది.

బరువు తగ్గేందుకు..

బరువు తగ్గాలనుకునే వారు ప్రతీ రోజు స్విమ్మింగ్ చేయడం చాలా మంచిది. ఈత కొట్టడం వల్ల క్యాలరీలు అధికంగా బర్న్ అవుతాయి. ఫిట్‍నెస్ కూడా మెరుగవుతుంది. అందుకే వెయిట్ లాస్ కోసం ప్రయత్నించే వారు తమ వర్కౌట్ రొటీన్లలో స్విమ్మింగ్‍ను చేర్చుకోవాలి.

నిద్ర మెరుగు

స్విమ్మింగ్ చేయడం వల్ల రాత్రివేళ నిద్ర కూడా మెరుగ్గా పడుతుంది. నిద్రలేమి సమస్య ఉన్న వారికి ఇది సహకరిస్తుంది. నిద్ర నాణ్యతను పెంచుతుంది.

ఒత్తిడి కూడా తగ్గుతుంది

స్విమ్మింగ్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మూడ్‍ను మెరుగుపరుస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయగలదు.