ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. అలాంటి ఒక పథకం అటల్ పెన్షన్ పథకం. ఈ పథకంలో మీరు మీ ఎంపిక ప్రకారం పెన్షన్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఈ పథకంలో ప్రతి నెలా రూ.210 పెట్టుబడి పెడితే, పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా రూ.5 వేలు పెన్షన్ పొందుతారు. దేశంలోని ప్రతి వర్గానికి ప్రభుత్వం ఇలాంటి పథకాలు అందిస్తుంది. అటల్ పెన్షన్ యోజన అటువంటి పథకం. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు మీ వృద్ధాప్యంలో ప్రతి నెలా రూ.5,000 వరకు పెన్షన్ పొందుతారు.
అటల్ పెన్షన్ యోజన 2015-16 సంవత్సరంలో ప్రారంభించారు. పదవీ విరమణ తర్వాత వ్యక్తులకు సాధారణ ఆదాయాన్ని అందించాలనే లక్ష్యంతో దీనిని మెుదలుపెట్టారు. అటల్ పెన్షన్ యోజనను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నిర్వహిస్తుంది.
18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల పౌరులందరూ ఈ పథకంలో భాగం కావచ్చు.పథకం కింద చందాదారుడికి 60 ఏళ్లు నిండిన తర్వాత అతని పెట్టుబడి ఆధారంగా నెలవారీ పెన్షన్ రూ.1,000 నుండి రూ.5,000 వరకు హామీ ఇస్తారు. చందాదారుడు మరణించినప్పుడు, ఇదే పెన్షన్ మొత్తం అతని జీవిత భాగస్వామికి ఇవ్వబడుతుంది.
అటల్ పెన్షన్ యోజన కింద, మీరు ప్రతి నెలా మీకు నచ్చిన కొద్ది మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు. పదవీ విరమణ తర్వాత రూ. 1000 పొందవచ్చు. లేదు ఎక్కువగా కావాలి అంటే నెలకు రూ.210 పెట్టుబడి పెట్టవచ్చు. అటల్ పెన్షన్ యోజన ద్వారా ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక భద్రత ప్రయోజనాలను అందిస్తుంది. 60 ఏళ్ల తర్వాత మీరు ప్రతి నెలా స్థిర ఆదాయాన్ని పొందుతారు.
అటల్ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా వృద్ధాప్యంలో ప్రభుత్వం ఆదాయానికి హామీ ఇస్తుంది. ఈ పథకంలో మీరు మీ పెట్టుబడిని బట్టి రూ.1,000 నుండి రూ.5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందాలంటే, మీరు కనీసం 20 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి.
ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులో అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, అతను రోజుకు కేవలం రూ.7 పెట్టుబడి పెట్టవచ్చు. అంటే నెలకు రూ.210 పెట్టుబడి పెట్టాలి. ఇలా 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే 60 ఏళ్ల తర్వాత రూ.5,000 పెన్షన్ వస్తుంది. నెలకు రూ.42 మాత్రమే పెట్టుబడి పెట్టడం ద్వారా మీకు నెలకు రూ.1,000 పెన్షన్ లభిస్తుంది.
ఈ పథకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే భార్యాభర్తలిద్దరూ ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. ఇద్దరి పెట్టుబడితో కలిపి ప్రతి నెలా 10,000 రూపాయల పెన్షన్ ప్రయోజనం దక్కుతుంది. భార్యాభర్తలలో ఒకరు మరణిస్తే మరొకరు పెన్షన్ ప్రయోజనం పొందుతారు. ఇద్దరూ చనిపోయిన తర్వాత నామినీకి మొత్తం డబ్బు వస్తుంది.
2015-16 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు మీరు తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి. దీనితో పాటు మొబైల్ నంబర్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. అటల్ పెన్షన్ పథకంలో ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో చేరవచ్చు. దేశవ్యాప్తంగా 5 కోట్ల మందికి పైగా ఇందులో చేరారు.