Strawberry Milk Toast । మధురమైన రుచి.. ఒక్కసారి తిన్నారంటే మైమరిచిపోతారు!
Strawberry Milk Toast Recipe: రెండు బ్రెడ్ ముక్కలు, ఒక కప్పు పాలతో ఇలా స్ట్రా బెర్రీ మిల్క్ టోస్ట్ చేసుకోండి, చేయడం సింపుల్ గా ఉంటుంది, రుచిలో వండర్ ఫుల్ గా ఉంటుంది.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా, సాయంత్రం టీ టైమ్‌లో అయినా పాలతో తయారు చేసే రుచికరమైన టోస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఈ మిల్క్ టోస్ట్ రెసిపీ చాలా సింపుల్, మీరు కేవలం ఐదే ఐదు నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు. వెన్నపాలలో కరిగిన తియ్యని బ్రెడ్ ముక్కపై కొంచెం తేనే లేదా చక్కెర చల్లుకొని ఒక స్పూన్‌తో చుంచుకొని తింటుంటే నోట్లో కరిగిపోతుంది.
ఈ మిల్క్ టోస్ట్ రెసిపీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. పండగ సమయాల్లో ఇన్ స్టంట్ గా చేసుకునే స్వీట్ డెజర్ట్‌గా కూడా దీనిని తినిపించవచ్చు. దీనిని మీరు స్ట్రాబెర్రీలను కూడా చేసుకోవచ్చు. మరి రసాలూరే రుచికరమైన స్ట్రాబెర్రీ మిల్క్ టోస్ట్ కోసం కావలసిన పదార్థాలు ఏమిటి, ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. స్ట్రాబెర్రీ మిల్క్ టోస్ట్ రెసిపీని ఈ కింద చూడండి.
Strawberry Milk Toast Recipe కోసం కావలసినవి
- వెన్న - 1 టేబుల్ స్పూన్
- బ్రెడ్ స్లైసులు - 2
- పాలు - 1 కప్పు
- చక్కెర - 2 టేబుల్ స్పూన్లు
- కస్టర్డ్ పౌడర్ - 1 tsp
- స్ట్రాబెర్రీ - 4
- తేనె రుచి కోసం
స్ట్రాబెర్రీ మిల్క్ టోస్ట్ తయారీ విధానం
1. ముందుగా ఒక పాన్‌లో వెన్న కరిగించి, బ్రెడ్ ముక్కలను బంగారు గోధుమ రంగు వచ్చేవరకు, క్రిస్పీగా కాల్చండి.
2. ఆ తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ పైన స్ట్రాబెర్రీ ముక్కలు వేసి, దాని పైన మరొక బ్రెడ్ స్లైస్‌తో కప్పేయండి.
3. ఇప్పుడు బ్రెడ్ స్లైస్‌లు ఉన్న పాన్‌లోనే పక్క నుంచి అర కప్పు పాలు పోసి మరిగించాలి. ఈ పాలను బ్రెడ్ స్లైస్‌లు పీల్చుకుంటాయి.
4. పైనుంచి పంచదార చల్లి కరిగిపోయేలా చూడండి. ఆపై బ్రెడ్ ముక్కను తిప్పండి.
5. ఇప్పుడు మిగిలిన కప్పు పాలలో కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసి పాన్ లో పోయాలి. పాలల్లో బాగా నానిన బ్రెడ్ ముక్క మెత్తగా మారుతుంది.
6. దీనిని ఒక ప్లేట్ కు బదిలీ చేసి, తేనెతో చల్లితే స్ట్రాబెర్రీ మిల్క్ టోస్ట్ రెడీ.
వేడివేడిగా సర్వ్ చేసుకొని దీని రుచిని ఆస్వాదించండి.
సంబంధిత కథనం
టాపిక్