Telugu News  /  Lifestyle  /  If Your Husband Battling Infertility, Here Is What A Wife Should Do
Fertility Issues
Fertility Issues (Unsplash)

Relationship Tips | భర్త శృంగారంలో వెనకబడితే భార్య అనుసరించాల్సిన విధానాలు

21 April 2022, 22:47 ISTHT Telugu Desk
21 April 2022, 22:47 IST

ఇటీవల కాలంలో మగవారిలో వారి శృంగారం సామర్థ్యాలపై ఆందోళన, దిగులు పెరుగుతుంది. కొంతమంది శోభనం అంటే భయపడి ఆత్మహత్య చేసుకుంటున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిపుణులు అందిస్తున్న సలహాలు, సూచనలు

పురుషుల్లో లైంగిక సామర్థ్యం సన్నగిల్లడం, సంతానలేమికి సంబంధించిన కేసులు ఇటీవల కాలంలో చాలా పెరిగిపోయాయి. ఎన్నో ఆశలతో కొత్తగా పెళ్లి చేసుకొన్న వారి జీవితాలను ఈ సమస్య కుదిపేస్తుంది. కొంతమంది మగవారు శోభనం గురించి ఆందోళన చెంది, సమాజంలో నవ్వులపాలు అవుతామేమోనని భయపడి ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాం.

ట్రెండింగ్ వార్తలు

అయితే పురుషుల్లో లైంగిక సామర్థ్యం లేకపోయినా ఇప్పుడు అనేక వైద్య విధానాలతో సంతాన సాఫల్యతను పొందే అవకాశం ఉంది.

కాబట్టి కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు ఆందోళ చెందకండి. మీ భర్త ఒకవేళ శృంగారకార్యంలో వెనకబడితే, అతడికి సామర్థ్యం లేదని మీరు భావిస్తే వెంటనే తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకండి. కొన్నిసార్లు ఒత్తిడి, ఆందోళన కారణంగా కూడా మగవారు శృంగార సమయంలో ఒక రకమైన భయానికి లోనవుతారు... కాబట్టి భార్యలు తమ భర్తలపై ఓపికగా ఉండాలి.

భర్తకు సహకరించేలా భార్య అనుసరించాల్సిన విధానాలు

 

మీ భర్తతో ఓపికగా ఉండండి: 

వాస్తవాన్ని అంగీకరించడం వారికి కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి, మీ భర్తకు కోపం వచ్చినా, మీపై అరిచినా మీరు ఓపికపట్టాలి. సాధారణ స్థితికి రావడానికి అతనికి కొంత సమయం ఇవ్వండి. అతనితో గొడవ పడే బదులు సహకరిస్తూ, అవగాహనతో ఉండండి.

 బిడ్డను కనాలని తహతహలాడకండి: 

మీ భర్తను పదేపదే డాక్టరును కలవమని చెప్పడం మానుకోండి. ఒక మహిళగా, మీరు బిడ్డను కనాలని తొందరపడవచ్చు, కానీ కొంత సమయం వరకు తేలికగా తీసుకోండి. మీ భర్త లోపాన్ని ఎత్తిచూపుతూ అతడి వెంటపడకండి. ఈ విధమైన చర్యలు అతణ్ని మానసికంగా కుంగదీసాతి. అతడు పైకి గంభీరంగా కనిపించవచ్చు కానీ లోలోపల చాలా విచారంగా ఉంటాడు, ఒంటరిగా ఫీలవుతాడు. సరిద్దిదుకోవాలంటూ బలవంతపు ప్రయత్నాలు చేయకండి.

మీ భర్తపై కఠినంగా ప్రవర్తించకండి: 

మీ భర్త అతడి భావాలను వ్యక్తపరచనపుడు నిదానంగా వ్యవహరించండి. ఏ మగాడు తనకు ఉన్న లోపాల గురించి బయటపెట్టాలనుకోరు. కొన్నిసార్లు కోపంలో తనకు సంబంధించినవి మొత్తం బయటపెట్టవచ్చు. అయితే అతడితో వాదించకుండా సున్నితంగా ఉండేందుకు ప్రయత్నించండి. పరుష పదజాలంతో కఠినంగా వ్యవహరించకండి.

 మీ సమస్యను ఇతరులతో పంచుకోకండి:

మీరు మీ బాధల గురించి మీ కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు చెప్పాలనుకోవచ్చు. కానీ, ఇది మీ భర్తకు నచ్చకపోవచ్చు. దీనివల్ల అతడు అసౌకర్యంగా ఉంటాడు. మీ భర్త లైంగిక సామర్థ్యాల గురించి ఇతరులతో చర్చించడం లేదా సంతానలేమి గురించి మాట్లాడటం కొన్నిసార్లు తీవ్రమైన అనర్థాలకు దారి తీస్తుంది. మీ ఇద్దరికి ఉపయోగపడేలా వైద్యులతో చర్చించండి వారు సరైన సలహాలు ఇస్తారు.

స్పెర్మ్ దాతల గురించి చర్చించేటప్పుడు సున్నితంగా ఉండండి: 

మగవారిలో వంధ్యత్వం నిర్ధారణ అయినపుడు స్పెర్మ్ డోనర్ IVF ద్వారా గర్భాధారణ పొందడం మంచి ఎంపికే. అయినప్పటికీ ఈ విషయంపై మీ భర్తతో చర్చించే ముందు సున్నితంగా వ్యవహరించండి. స్పెర్ డోనార్ పట్ల మంచి భావన కలిగేలా ప్రేరేపించాలి. అవసరమైతే వైద్యుల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించాలి.

టాపిక్