Hyundai Creta | వెన్నెల్లోనూ జిగేల్‌మని మెరిసే హ్యుందాయ్ క్రెటా Knight Edition! -hyundai creta knight edition suv launched ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hyundai Creta | వెన్నెల్లోనూ జిగేల్‌మని మెరిసే హ్యుందాయ్ క్రెటా Knight Edition!

Hyundai Creta | వెన్నెల్లోనూ జిగేల్‌మని మెరిసే హ్యుందాయ్ క్రెటా Knight Edition!

HT Telugu Desk HT Telugu

పాపులర్ ఆటోమొబైల్ మేకర్ హ్యుందాయ్ తమ బ్రాండ్ నుంచి కలర్ బ్లాక్ థీమ్‌తో క్రెటా నైట్ ఎడిషన్ కారును లాంచ్ చేసింది. ఈ SUV ధరలు రూ. 13.51 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి..

Hyndai Creta Knight Edition

కొరియన్ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ తమ బ్రాండ్ నుంచి SUV సెగ్మెంట్లో పాపులర్ మోడల్ అయిన క్రెటాలో కొత్త వేరియంట్‌ను తీసుకువచ్చింది. ‘క్రెటా నైట్ ఎడిషన్‌’ (Hyndai Creta Knight Edition) ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కస్టమర్ల ఆకాంక్షలకు తగినట్లుగా ఈ కార్ బయటి డిజైన్ తో పాటు, లోపల ఇంటీరియర్ డిజైన్ కారుమబ్బు రంగులో బ్లాక్-అవుట్ ఎలిమెంట్‌లను పొందుతుంది.

క్రెటా నైట్ ఎడిషన్ క్యాబిన్‌లో పెద్దగా మార్పులేమి ఉండవు. అయితే AC వెంట్‌లు, లెథెరెట్ సీట్లు ఇంకా స్టీరింగ్ వీల్‌పై స్టిచ్చింగ్ పూర్తిగా బ్లాక్ థీమ్‌లో ఉంటుంది. వాహనం వెనుక భాగంలో టెయిల్ గేట్‌కు 'నైట్ ఎడిషన్' చిహ్నం ఉంటుంది. టెయిల్ ల్యాంప్స్ కూడా డిజైన్‌లో కలిసిపోయేలా స్మోక్ టచ్ ఇచ్చారు. 

బోల్డ్‌గా స్పోర్టీ డిజైన్‌తో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న క్రెటా నైట్ ఎడిషన్‌లో S+ అలాగే SX(O) అనే రెండు వేరియంట్‌లలో లభ్యమవుతోంది. ఇందులో S+ బేసిక్ వేరియంట్ కాగా, SX(O) అనేది టాప్ ఎండ్ వేరియంట్.అయితే ఈ రెండు వేరియంట్‌లలోనూ క్రెటా నైట్ ఎడిషన్ పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ లేదా 1.5-లీటర్ డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో ఇది మీకు లభిస్తుంది.

బేసిక్ వేరియంట్లో ఇంజన్ 113bhp శక్తి వద్ద 144Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుండగా, టాప్ వేరియంట్ డీజిల్ వాహనం 113bhp వద్ద 250Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బేసిక్ వేరియంట్‌లో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను ఇచ్చారు. అయితే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ టాప్-స్పెక్ అయిన SX(O) వేరియంట్‌కు మాత్రమే పరిమితం చేశారు.

ధరలు ఈ విధంగా ఉన్నాయి

హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ 1.5 పెట్రోల్ S+ 6MT: రూ. 13.51 లక్షలు

హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ 1.5 పెట్రోల్ SX(O) IVT: రూ. 17.22 లక్షలు

హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ 1.5 డీజిల్ S+ 6MT: రూ. 14.47 లక్షలు

హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ 1.5 డీజిల్ SX(O) 6AT: రూ. 18.18 లక్షలు

పైన పేర్కొన్నవి దిల్లీ ఎక్స్-షోరూం ధరలు. ఆయా ప్రాంతాన్ని బట్టి వాహనం ఆన్-రోడ్ ధరల్లో మార్పు ఉంటుంది.

సంబంధిత కథనం