HT India's Most Stylish: మెరిసిన జాన్వీ కపూర్, రకుల్ ప్రీత్.. హిందుస్థాన్ టైమ్స్ అవార్డ్స్-ht indias most stylish award function details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ht India's Most Stylish: మెరిసిన జాన్వీ కపూర్, రకుల్ ప్రీత్.. హిందుస్థాన్ టైమ్స్ అవార్డ్స్

HT India's Most Stylish: మెరిసిన జాన్వీ కపూర్, రకుల్ ప్రీత్.. హిందుస్థాన్ టైమ్స్ అవార్డ్స్

Koutik Pranaya Sree HT Telugu
May 08, 2023 01:04 PM IST

HT India's Most Stylish: క్రితి సనన్, సుస్మితా సేన్, జాన్వి కపూర్, సోనమ్ బాజ్వా.. ఇంకెందరో హిందుస్థాన్ టైమ్స్ మోస్ట్ స్టైలిష్ 2023 అవార్డులకు హాజరయ్యారు. ఎవరు ఎలాంటి దుస్తుల్లో మెరిసిపోయారో చూద్దాం.

Kriti Sanon, Sushmita Sen, Janhvi Kapoor and Sonam Bajwa stun at HT India's Most Stylish 2023.
Kriti Sanon, Sushmita Sen, Janhvi Kapoor and Sonam Bajwa stun at HT India's Most Stylish 2023.

హిందుస్థాన్ టైమ్స్ ఇండియా మోస్ట్ స్టైలిష్ 2023 అవార్డులు నిన్న రాత్రి ముంబయిలో జరిగాయి. చాలామంది బాలీవుడ్ సెలెబ్రిటీలు ఆకట్టుకునే దుస్తుల్లో అలరించారు. క్రితిసనన్, సుస్మితాసేన్, జాన్వీ కపూర్, అనన్యాపాండే, శిల్పాశెట్టి, రవీనా టండన్, అక్షయ్ కుమర్, అదితీ రావ్ హైదరీ, కపిల్ శర్మ ఇలా చాలా మంది ప్రముఖ తారలు రెడ్ కార్పెట్ మీద అలరించారు. ఎవరు ఏ దుస్తుల్లో మెరిసిపోయారో చూడండి.

క్రితి సనన్:

బెస్ట్ అవుట్‌ఫిట్ వేసుకున్న తారల జాబితాలో ఉన్నారు క్రితి సనన్. నలుపు రంగు సెమీ షీర్ గౌన్‌లో మెరిసిపోయారు. హై నెక్‌లైన్ డ్రెస్‌లో, పొడవాటి చేతులతో కనిపించారు. చేతులు, నెక్‌లైన్, కాళ్ల దగ్గర పారదర్శకంగా ఉన్న నలుపు రంగు డ్రెస్ వేసుకున్నారు. తక్కువ మేకప్ లో , బోల్డ్ స్మోకీ ఐషాడో, వింగ్డ్ ఐ లైనర్, నలుపు రంగు హీల్స్, చక్కని బ్రేస్‌లెట్ తో దృష్టిని ఆకర్షించారు.

జాన్వీ కపూర్:

జాన్వీ కపూర్ స్ట్రాప్‌లెస్ గౌనులో శరీరాన్ని హత్తుకునే టైట్ ఫిట్టింగ్ గౌనులో మెరిసిపోయారు. లాంగ్ టెయిల్ తో ఉన్న ఈ డ్రెస్సు మొత్తం మెటాలిక్ మెరుపులతో డిటేయిలింగ్ ఇచ్చారు. సిల్వర్ బ్రేస్‌లెట్, ఉంగరాలు, బ్లాక్ హీల్స్, మధ్యలో పాపిట తీసిన పోనీటెయిల్, గులాబీ రంగు పెదాలు, సింపుల్ మేకప్ తో జాన్వీ తన మార్క్ చూయించారు.

రకుల్ ప్రీత్ సింగ్:

రకుల్ ప్రీత్ సింగ్ నలుపు, సిల్వర్ రంగుల మేళవింపుతో ఉన్న గౌనులో వచ్చారు. శరీరానికి హత్తుకుపోయే స్కర్ట్, అసిమెట్రికల్ హెమ్ లైన్ డిజైన్ ఉన్న క్రాప్డ్ బ్లవుజు, బ్లాక్ హీల్స్, మినిమల్ మేకప్ లుక్‌తో మెరిసిపోయారు.

అనన్యాపాండే:

అనన్యాపాండే హాట్ పింక్ దుస్తుల్లో భిన్నంగా కనిపించారు. అసిమెట్రికల్ బ్లేజర్ డ్రెస్‌లో, వీ ఆకారంలో నెక్‌లైన్, ప్యాడెడ్ షోల్డర్ , పొడవాటి చేతులతో ఉంది అనన్యా వేసుకున్న డ్రెస్. హై హీల్స్, బంగారు రంగు బ్యాగు, బంగారు గొలుసు బ్రేస్‌లెట్, సింపుల్ మేకప్ ని ఈ లుక్ కోసం ఎంచుకున్నారు.

Whats_app_banner