Summer Care Tips for Kids । వేసవిలో పిల్లల ఆరోగ్యం చెడిపోకుండా ఈ చిట్కాలు పాటించండి!
Summer Care Tips for Kids- వేసవిలో పిల్లలు ఎండలో తిరిగి అనారోగ్యానికి గురవుతారు. ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోవాలో చూడండి.
Summer Care Tips for Kids: మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? అయితే వేసవిలో వారి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. వేసవి కాలంలో పిల్లలు స్కూళ్లకు వెళ్ళడం ఉండదు. వేసవి సెలవులను ఆనందిస్తూ ఎక్కువగా బయట తిరుగుతారు. ఎండను ఏమాత్రం లెక్కచేయకుండా ఆటలు ఆడుతూ ఉంటారు. ఈ ఎండలు, వేడి వాతావరణం పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా వారికి చర్మ సమస్యలను కలిగిస్తుంది.
గాలిలో ఉండే హానికరమైన కాలుష్య కారకాలు, సూర్యుడి నుంచి వచ్చే కఠినమైన UV కిరణాలు, వేడివలన కలిగే చెమట మొదలైన కారణాల వలన పిల్లలకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ ఎండాకాలంలో మీ పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Summer Health Problems in Kids- పిల్లలకు వేసవిలో అనారోగ్య సమస్యలు
మదర్‌హుడ్ హాస్పిటల్‌లో పీడియాట్రిషియన్ డాక్టర్ తుషార్ ఈ వేసవిలో పిల్లలకు తలెత్తే ఆరోగ్య సమస్యలపై వివరించారు.
జీర్ణకోశ సమస్యలు:
కలుషిత ఆహారం తినడం లేదా కలుషిత పానీయాలు తాగడం ద్వారా అనేక రకాల జీర్ణకోశ సమస్యలు కలుగుతాయి. కడుపునొప్పి, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. నాణ్యత, శుభ్రత లేని కలుషిత ఆహారం తీసుకుంటే, వాటిలోని హానికర వైరస్‌లు, ఇతర టాక్సిన్‌ల వలన పిల్లలకు ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం ఉంటుంది.
డీహైడ్రేషన్:
పిల్లలు నీరు త్రాగటం మరచిపోతారు, ఎండలో తిరగటం వలన డీహైడ్రేషన్‌కు గురవుతారు. కాబట్టి ఈ వేసవిలో వారి వద్ద ఎల్లప్పుడూ ఒక వాటర్ బాటిల్ ఉంచండి. పుచ్చకాయలు తినిపించడం, పండ్ల రసాలు ఇవ్వడం, రీహైడ్రేషన్ డ్రింక్స్ అందిస్తూ ఉండాలి.
చర్మ సమస్యలు:
వేడి, తేమతో కూడిన వాతావరణం వలన చెమట ఎక్కువ పడుతుంది. దీనివల్ల చర్మ సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా తామర సమస్య ఉంటే అది తీవ్రమవుతుంది. ఎక్కువగా చెమట పట్టడం శరీరం అంతటా దురద దద్దుర్లు ఏర్పడతాయి. చర్మంపై చెమటకాయలు రావడం, చర్మం కమిలిపోవడం జరగవచ్చు. కాబట్టి పిల్లలకు ఎక్కువ చెమట పట్టినపుడు శుభ్రమైన గుడ్డతో తుడవడానికి ప్రయత్నించండి. తేలికపాటి కాటన్ దుస్తులు ధరింపజేయండి. వారి చర్మానికి డాక్టర్ సిఫార్సు చేసిన మాయిశ్చరైజర్‌ని ఉపయోగించండి. UV కిరణాల నుంచి రక్షణ కోసం సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి.
వేసవి ఫ్లూ:
5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఏడాది పొడవునా ఈ సమస్యలు తరచుగా వస్తాయి. కాబట్టి వారిని ఎండలో తిరగనీయకుండా ఉంచాలి. సాయంత్రం వేళ, లేదా ఉదయం పూట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఆడుకోవడానికి అనుమతివ్వండి. వారికి సరైన పౌష్టికాహారం ఇవ్వడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచవచ్చు.
కీటకాలు కాటు: