Asian Tiger Mosquito । ఈ దోమ చాలా డేంజర్.. కుడితే కోమాలోకే!-asian tiger mosquito can be very dangerous deadly illnesses you get from its bite ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Asian Tiger Mosquito Can Be Very Dangerous Deadly Illnesses You Get From Its Bite

Asian Tiger Mosquito । ఈ దోమ చాలా డేంజర్.. కుడితే కోమాలోకే!

HT Telugu Desk HT Telugu
Dec 06, 2022 06:33 PM IST

Asian Tiger Mosquito: అన్ని దోమలు వేరు ఈ Asian Tiger Mosquito దోమ వేరు. ఇది కుడితే ఒక వ్యక్తి కోమాలోకే పోయాడు, 30 సర్జరీలు జరిగాయి, మరణాల రేటు పెరుగుతోంది.

Asian Tiger Mosquito
Asian Tiger Mosquito (Pixabay)

దోమలు మనల్ని కుట్టి మన రక్తాన్ని పీల్చడమే కాకుండా మనకు అనేక వ్యాధులను వ్యాపింపజేస్తాయి. దోమలు చాలా రకాలు ఉంటాయి, ఇందులో ఆసియన్ టైగర్ దోమ (Asian Tiger Mosquito) లేదా ఏడెస్ ఆల్బోపిక్టస్ (Aedes albopictus) అనే దోమ చాలా ప్రమాదకరమైనది. ఇది ముఖ్యంగా మనుషులకు అప్పుడప్పుడు ఇతర క్షీరదాలకు కాటు వేసి రక్తాన్ని పీలుస్తుంది. ఇది కుట్టినపుడు ఆ భాగంలో వాపు, ఆ తర్వాత గడ్డలాగా తయారవుతుంది. దీనిని తొలగించడానికి కొన్నిసార్లు సర్జరీ లేదా చర్మాన్ని తొలగించడం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దీని కాటు ద్వారా ప్రాణాంతకమైన బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించగలదు. అది ఇన్ఫెక్షన్ కలిగించడానికి కారణమవుతుంది.

యూకే మీడియా డైలీ స్టార్ నివేదిక ప్రకారం, ఆసియా టైగర్ దోమ కాటుకు గురైన జర్మనీకి చెందిన ఓ 27 ఏళ్ల యువకుడు కోమాలోకి వెళ్లాడు. ఈ దోమ కాటుతో ఇన్ఫెక్షన్ అయి అతడికి 30 సర్జరీలు చేయాల్సి వచ్చింది. వైద్యులు రెండు కాలివేళ్లు కత్తిరించారు, అంతేకాదు తొడలో మాంసం మొత్తం తొలగించాల్సి వచ్చింది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ప్రమాదకరమైన దోమ అని.

ఆసియా టైగర్ దోమలను ఎలా గుర్తించవచ్చు?

ఈ ఆసియా టైగర్ దోమలు అనేవి అడవి దోమలు. ఇవి పట్టణ వాతావరణంలోనూ వృద్ధి చెందుతాయి. ఇవి వాస్తవానికి ఆగ్నేయాసియా ప్రాంతానికి చెందినవి. కానీ ఇప్పుడు అంతర్జాతీయ ప్రయాణాలు పెరగటం, సరుకు రవాణా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ దోమలు వ్యాపించాయి. ఈ దోమలు వాటి తల, వెనక భాగంలో తెలుపు, నలుపు గీతలు లేదా చుక్కలను కలిగి ఉంటాయి. పులికి ఇలాగే ఉంటాయి కాబట్టి దాని ఆధారంగా వీటికి టైగర్ దోమలు అనే పేరు వచ్చింది. ఇవి సాధారణంగా పగటివేళలో కాటు వేస్తాయి. కాబట్టి ఇటువంటి దోమల విషయంలో జాగ్రత్తగా ఉండండి. శరీరానికి దోమల వికర్షకాలు పూసుకోవడం, దోమల నివారణ చర్యలు తీసుకోవడం చేయండి.

ఆసియా టైగర్ దోమ కాటు వలన సంక్రమించే వ్యాధులు

ఆసియా టైగర్ దోమ కాటు ప్రాణాంతకమైన జ్వరాలు, వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. ఎలాంటి అనారోగ్యాలు కలుగుతాయో ఇప్పుడు చూడండి.

1. డెంగ్యూ- Dengue

ఏడెస్ ఈజిప్టి తరువాత, భారతదేశంలో డెంగ్యూ జ్వరాన్ని వ్యాప్తి చేసే ముఖ్యమైన వాహకాలలో ఆసియా టైగర్ దోమ ఒకటి. ఇది డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వంటి డెంగ్యూ జ్వరంను కలుగజేస్తుంది. బ్లీడింగ్, మెటబాలిక్ అసిడోసిస్ వంటి లక్షణాలు ఉంటాయి. సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే మరణం కూడా సంభవిస్తుంది.

2. చికున్‌గున్యా- Chikungunya

చికున్‌గున్యా వైరస్ ప్రధానంగా ఈడిస్ ఈజిప్టి, ఏడెస్ ఆల్బోపిక్టస్ అనే దోమల కాటు ద్వారా ప్రజలకు వ్యాపిస్తుంది. ఈ చికున్‌గున్యా జ్వరం కూడా డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుంది. తీవ్రమైన కీళ్ల నొప్పులు, బలహీనత ఉంటయి. అయితే ఈ జ్వరం ప్రాణాంతకం కాదు.

3. వెస్ట్ నైలు జ్వరం- West Nile fever

వెస్ట్ నైలు జ్వరాన్ని WNV వ్యాధిగా నిర్వచించవచ్చు. ఇది జ్వరంతో పాటు తలనొప్పి, కండరాల నొప్పులు, దద్దుర్లు, మెడ దృఢత్వం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. ఈ జ్వరం తీవ్రమైనపుడు మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. దీంతో మానసిక స్థితి మార్పులు, గందరగోళం, బద్ధకం, మూర్ఛ వంటి నాడీ రుగ్మతలకు కారణమవుతుంది. 9% న్యూరోఇన్వాసివ్ వ్యాధి కేసులు మరణానికి దారితీస్తాయి.

4. ఈస్టర్న్ ఎక్విన్ ఎన్సెఫాలిటిస్- Eastern Equine Encephalitis

ఈస్టర్న్ ఎక్వైన్ ఎన్సెఫాలిటిస్ (EEE) అనేది ఆర్థ్రోపోడ్ ద్వారా సంక్రమించే ఆల్ఫావైరస్ వల్ల వస్తుంది. మానవులకు అసాధారణంగా సంక్రమిస్తుంది. ప్రారంభ లక్షణాలలో జ్వరం, తలనొప్పి, అతిసారం, పొత్తికడుపులో నొప్పి ఉంటాయి కానీ తరచుగా గందరగోళం, మగత లేదా కోమాకు కూడా వేగంగా పురోగమిస్తాయి.

5. జికా వైరస్- Zika virus

Zika వైరస్ సంక్రమణ సాధారణంగా తేలికపాటి అనారోగ్యానికి కారణమవుతుంది, అయితే Zika వైరస్ లైంగిక సంక్రమణకు సంభావ్యతను పెంచుతుంది. గర్భిణీ స్త్రీలకు మొదటి త్రైమాసికంలో సోకినపుడు పుట్టబోయేవారికి పుట్టుకతో వచ్చే మెదడు అసాధారణతలతో సంబంధం కలిగి ఉంటుంది. ఈడెస్ ఈజిప్టి , ఏడెస్ ఆల్బోపిక్టస్, ఈ రెండూ జికా వైరస్ వ్యాప్తికి వెక్టర్‌లుగా గుర్తింపుపొందాయి.

WhatsApp channel

సంబంధిత కథనం