Natural Mosquito Repellents । దోమలు కుట్టకుండా ఈ నూనెలు రాసుకోండి, ఇవి సహజమైనవి!
Natural Mosquito Repellents- మీ రక్తం పీల్చి, మిమల్ని రోగాల బారినపడేసే దోమలను మీ నుంచి దూరంగా తరిమికొటండి. అందుకు కొన్ని సహజ ఉత్పత్తులు కూడా ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.
సాయంత్రం అయ్యిందంటే దోమలకు విందుకు వేళయినట్లే. తలులు, కిటికీలు మూసి ఉంచినా కూడా ఎక్కడో ఒక మూలన నక్కిన దోమలు బయటకు వస్తాయి. వాటికి కావాల్సిందల్లా రుచికరమైన మీ ఎర్రటి రక్తమే. గుయ్ మంటూ మీ చెవిలో వాటి సంగీతం వాయిస్తూనే, చురుక్కుమని కుట్టి రక్తం పీల్చేస్తాయి. తెల్లార్లు నిద్రలేకుండా కూడా చేస్తాయి. ఈ రక్తం పీల్చడం ఒకెత్తయితే.. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి తీవ్రమైన వ్యాధులకు కారకమయ్యి, మిమ్మల్ని ఆసుపత్రి మంచం ఎక్కిస్తాయి. అక్కడకు కూడా వచ్చి మీకు ఎక్కడా సుఖం లేకుండా చేస్తాయి. కాబట్టి ఈ దోమల రక్త దోపిడీకి చరమగీతం పాడాలంటే, వాటిని తరిమికొట్టే సాధనాలు మీ వద్ద ఉండాలి.
దోమలను మీ ఇంటి నుంచి బయటకు తరిమికొట్టేందుకు ఇప్పుడు మార్కెట్లో మస్కిటో కాయిల్స్, లిక్విడ్స్ సహా అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. కానీ అవన్నీ మరోరకంగా ఆరోగ్యాన్ని పాడుచేసేవే. వాటి నుంచి విడుదలయ్యే ఉద్గారాలు మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి.
అయితే ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా దోమల నుండి మీకు రక్షణ కల్పించే కొన్ని సహజమైన ఉత్పత్తులు కూడా ఉన్నాయి అవి సహజమైన దోమల వికర్షకాలుగా పనిచేస్తాయి.
Natural Mosquito Repellents- సహజమైన దోమల వికర్షకాలు
కొన్ని సహజమైన నూనెలు మీ శరీరానికి పూసుకోవడం ద్వారా కేవలం దోమల నుంచి మాత్రమే కాకుండా ఇతర కీటకాల కాటు నుంచి కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఆ నూనెలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
తులసి నూనె:
దోమలను తరిమికొట్టడానికి తులసి నూనె చాలా ఎఫెక్టివ్ రెమెడీ. ఇది కీటక-వికర్షక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని వాసనకు దోమలు మీ నుండి దూరంగా ఉంటాయి.
లెమన్‌గ్రాస్ ఆయిల్:
దోమల నుంచి రక్షణ కోసం లెమన్‌గ్రాస్ ఆయిల్‌ను చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ఈ నూనెను రాసుకుంటే కొన్ని గంటలపాటు దోమలు మీకు దూరంగా ఉంటాయి.
లావెండర్ ఆయిల్:
మీ చర్మంపై లావెండర్ ఆయిల్‌ను అప్లై చేసి ఆరుబయట రిలాక్స్‌గా నడవవచ్చు, హాయిగా నిద్రపోవచ్చు. ఏ దోమలు మిమ్మల్ని కుట్టవు, అలాగే దీని సువాసన కూడా మీ మనసును ప్రశాంతపరుస్తుంది.
పెప్పర్‌మింట్ స్ప్రే:
దోమల నివారణకు కొబ్బరినూనెలో పిప్పరమెంటు బిళ్లను కలిపి స్ప్రే బాటిల్‌లో నింపాలి. ఈ పిప్పరమింట్ ఆయిల్ దోమలను తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
యూకలిప్టస్ ఆయిల్:
దోమలను తరిమికొట్టడానికి నిమ్మకాయ, యూకలిప్టస్ నూనెను సమాన పరిమాణంలో కలపండి. ఇది కాకుండా, ఈ నూనెలో ఆలివ్, కొబ్బరి, అవకాడో నూనె వేసి స్ప్రే బాటిల్‌లో ఉంచండి. ఈ లిక్విడ్ మీ మీద స్ప్రే చేసుకోండి, తద్వారా దోమలు మీకు దూరంగా ఉంటాయి.
సంబంధిత కథనం