Pepper Chicken Recipe : పెప్పర్ చికెన్ రెసిపీ.. తింటే అదిరిపోతుంది..
Pepper Chicken Recipe : రెస్టారెంట్ వెళ్తే మెనూలో పెప్పర్ చికెన్ కనిపిస్తుంది. తింటే మాత్రం అదిరిపోతుంది. స్పైసీగా, టేస్టీగా ఉంటుంది. అయితే దీనిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
కొంతమందికి కారంగా తినాలి అనిపిస్తుంది. అలాంటి సమయంలో చికెన్‍తో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. తినేందుకు బాగుంటుంది. ఇంట్లో వాళ్లు కూడా ఎంజాయ్ చేస్తారు. అందులో భాగంగా పెప్పర్ చికెన్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు
చికెన్-500 గ్రాములు, వెల్లుల్లి 10, అల్లం, నిమ్మకాయ రసం, పసుపు పొడి హాఫ్ టేబుల్ స్పూన్, ఉప్పు రచికి, 2 ఉల్లిపాయలు, 4 లవంగాలు , 4 పచ్చిమిర్చి పొడుగుగా కట్ చేయాలి, కరివేపాకు కొద్దిగా, మిరియాల పొడి రెండున్నర టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు.
ముందుగా అల్లం, వెల్లుల్లి, లవంగాలు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు పొడి, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి 30 నిమిషాలు ఫ్రిజ్‍లో పెట్టాలి. ఇప్పుడు ఫ్రై చేసేందుకు ఓ గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టాలి.
అందులో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడి అయ్యాక.. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి. ఉల్లిపాయ గోధుమ రంగులోకి వచ్చాక.. నానబెట్టిన చికెన్ వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత ధనియాల పొడి, మిరియాల పొడి, రుచితి ఉప్పు వేసి తక్కువ వేడి మీద కలుపుతూ ఉండాలి. తర్వాత కొద్దిగా నీరు పోసి ఉడికించాలి.
చికెన్‍లో ఇంకిపోయేదాగా ఉడకనివ్వాలి. తర్వాత అందులో మిరియాల పొడి, ఒక టీస్పూన్ నిమ్మరసం, కొత్తిమీర, కరివేపాకు చల్లాలి. అంతే వేడివేడిగా పెప్పర్ చికెన్ రెసిపీ రెడీ అయిపోయినట్టే.