Palakayalu: బియ్యంపిండితో టేస్టీ పాలకాయలు ఇలా చేసేయండి, మంచి టీ టైం స్నాక్ రెసిపీ ఇది-how to make palakayalu tea time snack recipe in simple way ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Palakayalu: బియ్యంపిండితో టేస్టీ పాలకాయలు ఇలా చేసేయండి, మంచి టీ టైం స్నాక్ రెసిపీ ఇది

Palakayalu: బియ్యంపిండితో టేస్టీ పాలకాయలు ఇలా చేసేయండి, మంచి టీ టైం స్నాక్ రెసిపీ ఇది

Koutik Pranaya Sree HT Telugu
Sep 04, 2024 03:30 PM IST

Palakayalu: బియ్యంపిండితో చేసే సింపుల్ స్నాక్ పాలకాయల రెసిపీ. దీని తయారీ మీరు ఊహించనంత సులభం. పది నిమిషాల్లో డబ్బా నిండా చేసుకోవచ్చు. తయారీ చూసేయండి.

పాలకాయల రెసిపీ
పాలకాయల రెసిపీ

టీ టైం స్నాక్ కోసం పాలకాయల రెసిపీ ట్రై చేయండి. పిల్లలు బిస్కట్ల లాగా తినేస్తారివి. ఇది సాంప్రదాయ తెలుగు వంటకమే అయినా చాలా మందికి తెలీదు. బియ్యం పిండి ఉంటే చాలు పది నిమిషాల్లో ఇవి రెడీ అవుతాయి. టిప్స్ పాటించి చేశారంటే కరకరలాడుతూ రుచి బాగుంటాయి.

పాలకాయల తయారీకి కావాల్సిన పదార్థాలు:

2 కప్పుల బియ్యం పిండి

2 కప్పుల నీళ్లు

2 చెంచాల నువ్వులు

2 చెంచాల నువ్వుల నూనె

1 చెంచా కారం పొడి

పావు చెంచా ఇంగువ

అర చెంచా ఉప్పు

డీప్ ఫ్రై కి సరిపడా నూనె

పాలకాయల తయారీ విధానం:

  1. ముందుగా బియ్యం పిండిలో ఉండలు లేకుండా జల్లించుకుని పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఒక పెద్ద పాత్రలో నీళ్లు పోసుకుని వేడి చేసుకోవాలి.
  3. మంట సిమ్ లో పెట్టుకుని అందులో నువ్వులు, నువ్వుల నూనె, కారం, ఉప్పు, ఇంగువ వేసుకొని కలుపుకోవాలి.
  4. ఒక ఉడుకు రానిచ్చి వెంటనే స్టవ్ కట్టేయాలి.
  5. వెెంటనే అందులో బియ్యం పిండి వేసుకుని నీళ్లు చల్లారక ముందే ముద్దలాగా కలిపేసుకోవలాి.
  6. ముద్దను మరో పల్లెంలోకి తీసుకుని చల్లారనివ్వాలి.
  7. కాస్త చల్లారాక చేతికి నూనె రాసుకుని పిండిని ముద్దలాగా చపాతీ పిండి కలిపినట్టు బాగా కలపాలి. పిండిలోకి మరిన్ని నీళ్లు అవసరం అనిపిస్తే మరిన్ని వేడి నీళ్లు చేసుకుని కలపండి. చల్లటి నీళ్లు వాడకండి.
  8. ఇప్పుడు పాలకాయలు చేసుకోవడం కోసం చేతికి నూనె రాసుకుని చిన్న ఉండలు చేసి మధ్యలో ఒక నొక్కు నొక్కాలి ఇలా చేస్తే బిస్కట్ల ఆకారం వస్తుంది.
  9. లేదంటే చేతి మధ్యలో పెట్టుకుని తాల్చినట్లు చేస్తే పొడవుగా ఆకారం వస్తుంది.
  10. ఇలా చేసుకున్న పాలకాయల మీద తడి వస్త్రం వేసి కప్పేయాలి. లేదంటే అవి పొడిగా అయిపోతాయి. ఫ్రై చేసేటప్పుడు పగిలిపోతాయి.
  11. వీటిని ఫ్రై చేసుకోవడం కోసం కడాయి పెట్టుకుని అందులో నూనె పోసుకోవాలి. వేడెక్కాక కొన్ని కొన్ని పాలకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి.
  12. గ్యాస్ మీడియం మంట మీద ఉండాలి. పెద్ద మంట మీద పెడితే బయట రంగు మారినా లోపల ఉడకవు.
  13. వీటి రంగు కాస్త బ్రౌన్ రంగులోకి వచ్చాక జాలి గంటెతో బయటకు తీసుకుంటే చాలు.
  14. చల్లారాక గాలి చొరవని డబ్బాలో పెట్టుకుంటే అలాగే కరకరలాడుతూ ఉంటాయి.

టాపిక్