Gongura Chicken Recipe : గోంగూర చికెన్ కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ.. మళ్లీ కావాలనిపిస్తుంది
Gongura Chicken Recipe : ఎప్పుడూ చికెన్ కర్రీని ఒకేలాగా తింటే బోర్ కొడుతుంది కదా. అందుకే అప్పుడప్పుడు కాస్త కొత్తగా ట్రై చేయాలి. అందులో భాగంగా గోంగూర చికెన్ కర్రీని చేయండి. చాలా సింపుల్.
గోంగూర టేస్ట్ బాగుంటుంది. చాలామంది చికెన్ కర్రీ వండుకున్నప్పుడు గోంగూర చట్నీ వేసుకుని కలిపి తింటారు. తినేందుకు చాలా టేస్టీగా అనిపిస్తుంది. అయితే ఇలా కాకుండా నేరుగా గోంగూర చికెన్ వండితే ఇంకా సూపర్ ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ మామూలుగా ఉండదు. మళ్లీ మళ్లీ తినాలి అనిపిస్తుంది. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు.
ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. చికెన్ ఎప్పుడు తిన్నా.. మిమ్మల్ని గుర్తుచేసుకుంటారు. అయితే గోంగూర చికెన్ వండేందుకు చాలా సమయం పడుతుందని అందరూ అనుకుంటారు. కానీ తక్కువ సమయంలోనే అయిపోతుంది. ఈజీగా చేయెుచ్చు.. అదిరిపోయే టేస్ట్ కూడా దొరుకుతుంది. ఈ వంటకం ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు..
చికెన్ 500 గ్రాములు(కడికి, ముక్కులుగా కట్ చేసి పెట్టుకోవాలి.), అర టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు తగినంత, 10 వెల్లుల్లి రెబ్బలు, అర అంగులం అల్లం, మూడు టేబుల్ స్పూన్ల నూనె, ఐదు లవంగాలు, ఐదు యాలకులు, పెద్ద దాల్చిన చెక్క ఒక్కటి, 200 గ్రాముల గోంగూర ఆకులు, తరిగిన ఉల్లిపాయ పెద్దది, కొన్ని కరివేపాకులు, పచ్చి మిర్చి నాలుగు.
గోంగూర చికెన్ ఎలా తయారు చేయాలంటే..
ముందుగా అల్లం, వెల్లుల్లి పేస్ట్ ను చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి ముందుగా ఉల్లిపాయ వేసుకోవాలి. తర్వాత పసుపు, వెల్లుల్లి రెబ్బలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క విరిచి వేయాలి. కాసేపు వీటిని వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కలపాలి. ఇవన్నీ పింక్ కలర్ వచ్చేవరకూ వేయించండి. తర్వాత కరివేపాకు వేసి కలపాలి. ఇప్పుడు గోంగూర ఆకులు వేసుకోవాలి. ఉప్పు ఇతర మసాలాలు ఏవైనా ఉంటే పాన్ లో వేసి కాసేపు వేయించుకోవాలి.
ఇక ఇప్పుడు అందులో చికెన్ వేసుకోవాలి. కాసేపు వేయించాలి. ఇలా అయితే ముక్కలకు మసాలా, గోంగూర అంటుకుంటుంది. తర్వాత నీరు పోసి చికెన్ ఉడికించాలి. కర్రీ పేస్టులో అయ్యేవరకూ ఉంచాలి. చివరగా కొత్తిమీర, పుదీనా ఆకులు వేసుకోవాలి. గోంగూరను మిక్సీలో పట్టుకుని కూడా వేసుకోవచ్చు.