Protein rich foods: ఇవి తింటే శాకాహారుల్లో కూడా.. ప్రొటీన్ లోపం ఉండదు..
Protein rich foods: శనగపిండి నుంచి పన్నీర్ వరకు వెజిటేరియన్ ఆహారం తింటూ ప్రొటీన్ పొందే శరీరానికి కావాల్సిన ప్రొటీన్ పొందే మార్గాలు చాలానే ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
శరీరం పనితీరులో ప్రొటీన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. తినే ఆహారంలో ప్రొటీన్ ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ప్రొటీన్ పాత్ర కీలకం. అయితే వెజిటేరియన్లలో ప్రొటీన్ లోపం కాస్త ఎక్కువగా కనిపించే సమస్య. ఈ సమస్య అధిగమించడం సులువే. మూడు పూటలా తినే ఆహారంలో తప్పకుండా కొన్ని చేర్చుకుంటే సరిపోతుంది.
2016 లో హార్వార్డ్ యూనివర్శిటీ చేసిన పరిశోధన ప్రకారం శాకాహారం నుంచి ప్రొటీన్ తినేవాళ్లలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా తక్కువని తేలింది. సరైన జీవనశైలి లేనివాళ్లు కూడా శాకాహారం నుంచి ప్రొటీన్ అందేలా చూసుకోవడం మంచిది.
1. శనగపిండి (Chickpea Flour):
100 గ్రాముల శనగపిండి, రవ్వ కలిపి చేసిన అట్టులో 4 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.
శనగపిండినే బేసన్ అని ఎక్కువగా అంటుంటాం. ఈ పిండిలో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. శాకాహారులకు అధిక ప్రొటీన్ అందించే వాటిలో శనగపిండి కూడా ఒకటి. దీంట్లో ప్రొటీన్ తో పాటూ, పీచు కూడా ఉంటుంది. శనగపిండితో ప్యాన్ కేకులు చేసుకుని అల్పాహారంగా తీసుకోవచ్చు. కావాల్సినంత ప్రొటీన్ అందుతుంది.
2. పెసర్ల మొలకలు:
100 గ్రాముల మొలకల్లో 8 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.
వీటిని సాయంత్రం స్నాక్స్ లాగా లేదా, అల్పాహారంలో కూడా చేర్చుకోవచ్చు. వీటివల్ల ఆహారం తాజాగా అనిపించడంతో పాటూ, శరీరానికి కావాల్సిన పీచు కూడా అందుతుంది.
3. టోఫు
20 గ్రాముల టోఫులో 1 గ్రాము ప్రొటీన్ ఉంటుంది
సోయాబీన్ పాల నుంచి చేసే టోఫులో ప్రొటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీంట్లో శరీరానికి కావాల్సిన అమైనో యాసిడ్లు కూడా పుష్కలంగా ఉంటాయి.
4. పన్నీర్:
100 గ్రాముల పన్నీర్ పుట్టగొడుగుల కూరలో 7 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.
పాల నుంచి చేసే పనీర్ లో ప్రొటీన్ ఎక్కువే. ఇవి మెల్లగా జీర్ణమవుతూ అమైనో యాసిడ్లను కొద్దికొద్దిగా విడుదల చేస్తుంది.
ఈ ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలను వివిధ రకాలుగా వాడుతూ ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం సిద్దం చేసుకోవచ్చు. ఈ ఆహారం వల్ల ప్రొటీన్‌తో పాటూ శరీరానికి మేలు చేసే అమైనో యాసిడ్లు, విటమిన్లు, మినరళ్లు ఉంటాయి.
టాపిక్