Unwanted Erection : ఎప్పుడు పడితే అప్పుడు అంగస్తంభన అవుతుందా? మరి ఏం చేయాలి?
Unwanted Erection Control : కొందరికి సమయం, సందర్భం లేకుండా అంగస్తంభన జరుగుతుంది. దీనివలన చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. దీని నుంచి బయటపడటం ఎలా?
ఏదో ముఖ్యమైన పనిలో ఉంటారు. ఆ సమయంలో అంగస్తంభన జరుగుతుంది. ఆఫీసులో సహోద్యోగితో ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంటారు. అప్పుడే అంగస్తంభన అవుతుంది. ఇలా ఏదో ముఖ్యమైన సమయంలో అంగస్తంభన జరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని వేరే వారు ఎవరైనా పరిశీలిస్తే అంతే సంగతులు. అందుకే కొన్ని చిట్కాలు పాటించాలి.
టైమ్ కానీ టైమ్‍లో అంగస్తంభన అనేది చిరాకు పుట్టిస్తుంది. పక్కవారు చూస్తారేమోనని భయం కూడా కలుగుతుంది. ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియదు. పనిలో ఉన్నా, స్కూల్‌లో ఉన్నా.. అది అలానే అవుతూ ఉంటుంది. మీకు ఆకస్మాత్తుగా స్వీయ స్పృహ కలిగిస్తుంది. నేను దీన్ని ఎలా వదిలించుకోవాలి అని ఆలోచిస్తారు. ఈ విషయాన్ని వదిలించుకోవడానికి చాలా ఉపాయాలు ఉన్నాయి. ఈ కథనంలో అనుకోని సమయంలోనూ అంగస్తంభన జరిగితే ఆపడానికి ఉత్తమ మార్గాలను చెబుతాం.
ఇలా సమయం కానీ సమయంలో అంగస్తంభన జరిగితే.. వేరేవారితో సంభాషణ, టీవీ, గదిలో దేనిపైకి అయినా మీ దృష్టి మరల్చండి. ఫైనాన్స్, రాజకీయాలు, మీ అభిరుచి ఇలా వాటి గురించి ఆలోచించాలి. మీ అంగస్తంభన లేదా ఏదైనా ఉద్రేకపరిచే ఆలోచనల నుండి మీ దృష్టిని మళ్లించే విషయాలపై దృష్టి పెట్టాలి.
అంగస్తంభన జరిగేందుకు రక్త ప్రసరణ చాలా అవసరం. అందుకోసం మీ రక్తాన్ని మరెక్కడికేనా ఎక్కువ పంపింగ్ చేయడానికి ప్రయత్నించాలి. అందులో భాగంగా చిన్న వ్యాయమాలు చేయండి. లేదంటే.. నడకకు వెళ్లండి. ఆఫీసులో కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఏదో ఒకటి చెప్పి నడకకు వెళితే ప్రయోజనం ఉంటుంది. రక్తం మీ శరీరంలోని ఇతర భాగాలకు ప్రవహిస్తుంది, మీ అంగస్తంభన తగ్గిపోతుంది.
మరో చిట్కా ఏంటంటే.. అంగస్తంభన జరిగితే.. వెళ్లి మూత్ర విసర్జన చేయడానికి ప్రయత్నించండి. మీ అంగస్తంభన ఉన్న సమయంలోనే మూత్ర విసర్జన చేయండి. మీరు పూర్తి చేసే సమయానికి, అది తగ్గిపోతుంది. పరిస్థితిని బట్టి ఏదైనా అత్యవసరం వచ్చిందని చెప్పి వెళ్లాలి. మూత్ర విసర్జన చేయలేకపోతే, మీ ముఖంపై చల్లటి నీటిని చల్లడం, కొన్ని జంపింగ్ జాక్‌లు చేయడం లేదా ఉద్రేకపరిచే ఆలోచనల నుంచి దృష్టి మరల్చడం చేయండి.
ధ్యానం చేయండి లేదా శ్వాస వ్యాయామాలు చేయడానికి ప్రయత్నించండి. విశ్రాంతి తీసుకోండి. బాత్రూమ్, బెడ్‌రూమ్ లేదా ఖాళీగా ఉన్న మీటింగ్ రూమ్ వంటి నిశ్శబ్ద ప్రదేశానికి వెళ్లండి. మీ ఊపిరిపై దృష్టి పెట్టండి. మీ అంగస్తంభనను సహజంగా తగ్గడంలో ఇది సాయపడుతుంది. ధ్యానం, శ్వాస మీ నరాలను ప్రశాంతపరుస్తుంది. అవి మీ రక్తపోటును కూడా తగ్గిస్తాయి,
వీలైనంత ఎక్కువసేపు మీ శ్వాసను పట్టుకోండి. లోతైన శ్వాస తీసుకోండి . కనీసం 30 సెకన్ల పాటు శ్వాసను ఆపండి. మీ రక్తం డీఆక్సిజనేట్ అయినప్పుడు, మీ శరీరం నార్మల్ మోడ్‌లోకి వస్తుంది. మీ ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రవాహాన్ని దారి మళ్లిస్తుంది. దీనితో మీ అంగస్తంభన తగ్గడం ప్రారంభమవుతుంది.
మీ అంగస్తంభన తగ్గించుకునేందుకు మీ ప్రసరణ వ్యవస్థను షాక్ చేయడానికి చల్లని నీటితో స్నానం చేయండి. ఆఫీసుల్లో ఉంటే ఈ పని సాధ్యం కాదు. కానీ ఇంట్లోనే ఉంటే మాత్రం.. చేయెుచ్చు. చల్లటి నీరు మీ శరీర భాగాలకు రక్త ప్రసరణ అయ్యేలా చేస్తుంది. తద్వారా అంగస్తంభన త్వరలో తగ్గిపోతుంది.
మీరు బయట ఉన్నట్లయితే, మీ అంగస్తంభనను తగ్గేందుకు తెలివిగా ట్రై చేయాలి. చల్లని వస్తువు కోసం చూడండి. ఉదాహరణకు, మీరు కూర్చుని ఉంటే మీ ఒడిలో శీతల పానీయాన్ని పట్టుకుని ప్రయత్నించండి. మీరు కూర్చొనే పొజిషన్ మార్చడం వలన కూడా ఫలితం ఉంటుంది.
అంగస్తంభన 2-4 గంటల కంటే ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. నియంత్రించలేని అంగస్తంభనను ప్రియాపిజం అంటారు.