Honeymoon places: హనీమూన్ కోసం ప్లాన్ చేస్తున్నారా? కొన్ని ఉత్తమ ఆప్షన్లు ఇవే
Honeymoon places: మీ భాగస్వామితో కలిసి హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మన దేశంలో మీరు వెళ్లదగ్గ ఉత్తమమైన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూడండి.
పెళ్లి తర్వాత హనీమూన్ వెళ్లడం వల్ల భార్యాభర్తలిద్దరూ ఒకరిని ఒకరు మరింత సులువుగా అర్థం చేసుకోగలుగుతారు. ఏకాంతం దొరుకుతుంది. ఒకరి ఇష్టా ఇష్టాలు తెలుస్తాయి. మన దేశంలోనే హనీమూన్ వెళ్లదగ్గ ఉత్తమ ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. భాగస్వామితో గడపడానికి రొమాంటిక్ ప్రదేశాలివే.
కుమరకోం:
చుట్టూ పచ్చని బీచ్‌లతో ఉన్న కుమరకోం కేరళ రాష్ట్రంలో ప్రకృతి మధ్య మీ భాగస్వామితో గడపడానికి ఉత్తమమైన ప్రదేశం. ఇక్కడి హౌస్ బోట్ లో బ్యాక్ వాటర్స్ కు వెళ్లడం, పడవలో కూర్చున్నప్పుడు వినిపించే నీటి శబ్దం మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. మీరు మీ భాగస్వామితో ఏకాంత క్షణాలను గడపవచ్చు. అందమైన దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు.
గ్యాంగ్‌టక్:
మీరు రొమాంటిక్ హాలిడే ప్లాన్ చేస్తుంటే, గ్యాంగ్‌టక్ కూడా చాలా మంచి ప్రదేశం. ఇక్కడి ప్రకృతి సౌందర్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటి మధ్య మీరు చాలా రొమాంటిక్ క్షణాలను గడపవచ్చు.
డార్జిలింగ్:
భారతదేశంలోని అత్యంత రొమాంటిక్ ప్రదేశాలలో ఇదీ ఒకటి. ఈ ప్రదేశం దాని సొంత అనుభూతిని కలిగి ఉంటుంది. ఇక్కడి టాయ్ ట్రెయిన్ ప్రయాణం అస్సలు మర్చిపోకండి. చుట్టూ కొండలు, తేయాకు తోటల దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. మీ భాగస్వామితో గడపడానికి మంచి ప్రదేశం ఇది.
శ్రీ నగర్:
కాశ్మీర్ లోయ మధ్యలో ఉన్న శ్రీనగర్, దాల్ సరస్సులో అత్యంత అందమైన దృశ్యాలు.., హౌస్ బోట్‌లో బసకు ప్రసిద్ధి చెందింది. మీ భాగస్వామితో కలిసి షిఖర రైడ్ ఆస్వాదించవచ్చు. మొఘల్ గార్డెన్లను చూడొచ్చు. స్థానిక మార్కెట్లను అన్వేషించవచ్చు. అద్భుతమైన అందం, ప్రశాంతమైన వాతావరణంతో శ్రీనగర్ నిస్సందేహంగా భారతదేశంలో ఒక లగ్జరీ హనీమూన్ గమ్యస్థానం.
టాపిక్