Egg Hair Packs : గుడ్డుతో హెయిర్ ప్యాక్స్.. చేసేందుకు సింపుల్.. ప్రయోజనాలు ఫుల్-homemade egg hair packs for hair growth and thickness ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Egg Hair Packs : గుడ్డుతో హెయిర్ ప్యాక్స్.. చేసేందుకు సింపుల్.. ప్రయోజనాలు ఫుల్

Egg Hair Packs : గుడ్డుతో హెయిర్ ప్యాక్స్.. చేసేందుకు సింపుల్.. ప్రయోజనాలు ఫుల్

Anand Sai HT Telugu
Oct 29, 2023 03:30 PM IST

Egg Hair Packs In Telugu : గుడ్డును చాలా రకాలుగా జుట్టుకు ఉపయోగించుకోవచ్చు. గుడ్లలో బయోటిన్, ఫోలేట్ వంటి ప్రొటీన్లు ఉంటాయి. అవి జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

ఎగ్ హెయిర్ ప్యాక్
ఎగ్ హెయిర్ ప్యాక్ (unsplash)

మహిళలు, పురుషులు జుట్టు అందం, మెరుపును కాపాడుకోవడానికి అనేక మార్గాలను ఆశ్రయిస్తారు. వెంట్రుకలు ఒత్తుగా, దృఢంగా ఉండాలంటే వాటి సంరక్షణ చాలా ముఖ్యం. జుట్టు సంబంధిత సమస్యలన్నింటికీ గుడ్లు చాలా సహాయకారిగా ఉంటాయి. ఇందులో ఉండే ప్రొటీన్లు, ఒమేగా 3, మినరల్స్ జుట్టు పెరుగుదలకు, ఒత్తుగా ఉండేలా చేస్తాయి. మీ జుట్టును కాపాడుకోవాలంటే.. వారానికి ఒకటి లేదా రెండుసార్లు గుడ్డు హెయిర్ ప్యాక్‌ని ఉపయోగించాలి. సులభంగా తయారు చేసి ఉపయోగించగల కొన్ని ఎగ్ హెయిర్ ప్యాక్‌లు(Egg Hair Packs) ఇక్కడ ఉన్నాయి.

పొడి జుట్టు కోసం ఎగ్ హెయిర్ ప్యాక్ : ఒక గిన్నెలో 2 గుడ్ల సొనలు, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపండి. ఈ పేస్ట్‌ను జుట్టుకు బాగా పట్టించి కవర్ చేయండి. దాదాపు 20 నిమిషాల పాటు అలా వదిలేయండి. తర్వాత మీ జుట్టును చల్లటి నీటితో కడగాలి. ఇలా వారానికి కనీసం రెండు సార్లు చేయండి.

జిడ్డుగల జుట్టు కోసం ఎగ్ హెయిర్ ప్యాక్ : ఒక గిన్నెలో 2 గుడ్లలోని తెల్లసొన తీసుకోండి. తర్వాత ఉసిరి పొడిని మిక్స్ చేసి మీ జుట్టుకు అప్లై చేయండి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని వారానికి రెండు సార్లు అప్లై చేయండి.

కలబంద, గుడ్డు హెయిర్ ప్యాక్ : ఒక గిన్నెలో 2 గుడ్లలోని తెల్లసొన, 2 టీస్పూన్ల కలబంద జెల్‌ను బాగా మిక్స్ చేయాలి. మీ జుట్టుకు అప్లై చేసి ఒక గంట పాటు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో జుట్టును బాగా కడగాలి. ఇది వారానికి 1-2 సార్లు ఉపయోగించవచ్చు.

మెంతులు, గుడ్డు హెయిర్ ప్యాక్ : 2 టీస్పూన్ల మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. తర్వాత ఉదయాన్నే 1 కప్పు హెన్నా పౌడర్‌ని కొన్ని నీళ్లలో కలిపి పేస్ట్‌లా తయారు చేయండి. వీటికి 1 గుడ్డు పచ్చసొన జోడించండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టు, తలకు పట్టించి గంటసేపు అలాగే ఉంచాలి. తర్వాత మీ జుట్టును తేలికపాటి షాంపూ, చల్లని నీటితో కడగాలి.

కొబ్బరి నూనె, గుడ్డు ప్యాక్ : ఒక గిన్నెలో 1 గుడ్డు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలపండి. ఆపై మీ జుట్టుకు అప్లై చేయండి. సుమారు 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. అనంతరం మీ జుట్టును చల్లటి నీటితో కడగాలి. ఇది వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించవచ్చు.

అరటిపండు, గుడ్డు ప్యాక్ : 1 అరటిపండును గుజ్జు చేసి, దానికి మొత్తం గుడ్డు జోడించండి. తర్వాత దానికి 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపండి. ఈ హెయిర్ ప్యాక్‌ని మీ జుట్టు మరియు తలపై అప్లై చేయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. మీ జుట్టును చల్లటి నీటితో కడగాలి. ఇది వారానికి ఒకసారి ఉపయోగించవచ్చు.

Whats_app_banner