జుట్టుకు కరివేపాకు ఎన్ని రకాలుగా మేలు చేస్తుందో తెలుసా?

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Oct 28, 2023

Hindustan Times
Telugu

కరివేపాకు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అలాగే, కరివేపాకు వల్ల జుట్టు (వెంట్రుకలకు)కు కూడా ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే.. 

Photo: Pexels

కరివేపాకులో బీటా-కొరొటిన్, ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి తింటే వెంట్రుకల కుదుళ్లు మరింత బలంగా మారతాయి. జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. 

Photo: Pexels

వెంట్రుకల దృఢత్వాన్ని మెరుగుపడేందుకు అవసరమైన విటమిన్లు, మినరల్స్ కరివేపాకులో ఉంటాయి. అందుకే కరివేపాకు తింటే జుట్టు బలంగా మారి, రాలడం తగ్గుతుంది.  

Photo: Pexels

కరివేపాకుల్లో యాంటి ఇన్‍ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉంటాయి. అందుకే ఇవి తీసుకుంటే డాండ్రఫ్ సమస్య కూడా తగ్గుతుంది. 

Photo: Flickr

కరివేపాకులో పిగ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడడాన్ని కూడా నివారించేందుకు ఉపయోగపడుతుంది. 

Photo: Pexels

కరివేపాకుల్లో సహజసిద్ధమైన ఆయిల్స్ ఉంటాయి. అందుకే కరివేపాకులు తింటే జుట్టు చిక్కులు పడడం కూడా తగ్గుతుంది. 

Photo: Pexels

రోజువారీ ఆరోగ్యానికి పాలు ఎంత మేలు చేస్తాయో తెలిసిందే. పిల్లల ఆరోగ్యానికి పాలు కూడా చాలా ముఖ్యమైనవి.

Unsplash