Spices - Viral Infections । వైరల్ ఇన్ఫెక్షన్లకు ఇంట్లోనే పరిష్కారం.. ఈ 4 మసాలాలు చాలు!
Spices To Cure Viral Infections: శీతాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కలుగుతాయి. వీటిని ఎదుర్కోవడంలో ఇంట్లో ఉపయోగించే ఓ 4 సుగంధ ద్రవ్యాలు కూడా ఔషధాలుగా పనిచేస్తాయి, అవేంటో చూడండి.
మన భారతీయ వంటల్లో విరివిగా ఉపయోగించే కొన్ని మూలికలు, సుగంధ ద్రవ్యాలను శతాబ్దాలుగా అనేక అనారోగ్య సమస్యలకు సహజ నివారణలుగా ఉపయోగిస్తున్నాము. ఆయుర్వేద వైద్య చికిత్సలలో వీటి వినియోగం ఉంటుంది. ఈ పదార్థాలలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ల్పమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలతో శక్తివంతమైన సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఇవి వైరస్‌లతో పోరాడటానికి సహాయపడతాయి. ఇందులో కొన్ని మసాలా దినుసులు యాంటీవైరల్ ప్రభావాలను కలిగి ఉన్నాయని కొన్ని పరిశోధనల ద్వారా ఋజువైంది.
మీరు ఈ శీతాకాలంలో వైరల్ ఫీవర్, జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం పొందడానికి కొన్ని సుగంధ ద్రవ్యాలను ఉపయోగించవచ్చు. ఇవి మీ శరీరంలో నొప్పులు, మంటలను తగ్గించడం, మీ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మొదలైన
ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అంతేకాదు, ఈ శక్తివంతమైన సూపర్‌ఫుడ్‌లను మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు, వ్యాధులను దూరం చేసుకోవచ్చు.
Spices To Cure Viral Infections- వైరల్ సంక్రమణలను నయం చేసే సుగంధ ద్రవ్యాలు
మీ వైరల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడే నాలుగు యాంటీవైరల్ మసాలా దినుసులను ఇక్కడ తెలుసుకోండి.
దాల్చిన చెక్క
దాల్చినచెక్కలో అధిక స్థాయిలో పాలీఫెనాల్స్, ప్రోయాంతోసైనిడిన్‌లు ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్ గుణాలు, రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాయి. అదనంగా, ఇది బలమైన యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది.
వాము
వాము లేదా క్యారమ్ గింజలను, సాధారణంగా సాంప్రదాయ భారతీయ వైద్యంలో జలుబు, దగ్గుకు ఇంటి నివారణగా ఉపయోగిస్తారు. ఇందులో థైమోల్ వంటి సమ్మేళనాలు ఉంటాయి, ఇవి శోథ నిరోధక, యాంటీమైక్రోబయల్ గుణాలను కలిగి ఉంటాయి. జలుబు,ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. వాము విత్తనాలు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలకు కూడా మంచి మూలం.
అల్లం
ఒక కప్పు అల్లం టీ చలికాలంలో వచ్చే జలుబు, ఫ్లూ, దగ్గును నియంత్రించే రెసిపీగా ఉంటుంది. అల్లంలో జింజెరాల్ సమ్మేళనం ఉంటుంది, ఇది శరీరాన్ని లోపల నుండి వెచ్చదనం కలిపించడంలో, తక్షణ ఉపశమనాన్ని కలిగించడంలో సహాయ పడుతుంది. అదనంగా, అల్లం తీసుకోవడం జీర్ణ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది, ఇది ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది.
నల్ల మిరియాలు
నల్ల మిరియాలలో అధిక స్థాయిలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లకు ఉంటాయి. ఈ సమ్మేళనాల ఉనికి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇది జలుబు ఫ్లూ వంటి సాధారణ శీతాకాల వ్యాధులకు మరింత నిరోధకతను కలిగిస్తుంది. ఇంకా, నల్ల మిరియాలలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు హానికరమైన సూక్ష్మజీవులతో పోరాడటానికి సహాయపడుతుంది, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నల్ల మిరియాల గరిష్ట ప్రయోజనాలను పొందటానికి ప్రభావవంతమైన మార్గం ఏమిటంటే, ఉదయాన్నే ఒక కప్పు పెప్పర్ టీని కాచి తాగడం లేదా మిరియాల పొడిని తేనెతో కలిపి తీసుకోవడం చేయవచ్చు.
వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతున్నప్పుడు వైద్య సహాయం పొందుతూనే మరోవైపు ఇక్కడ పేర్కొన్న సుగంధ దినుసులను ఉపయోగిస్తే వేగవంతమైన ఉపశమనం లభిస్తుంది.
సంబంధిత కథనం