Diwali Special Breakfast । ఈ దీపావళిని ప్రత్యేకంగా జరుపుకోండి.. ఆహా అనే రుచులను ఆస్వాదించండి!
ఈ దీపావళి పండగ వేళ బ్రేక్‌ఫాస్ట్ కూడా ప్రత్యేకంగా చేయండి. బ్రేక్‌ఫాస్ట్ చేస్తూనే నోరుని తీపిచేసుకోండి. Diwali Special Breakfast Recipe కోసం ఇక్కడ చూడండి.
Diwali Special Breakfast Recipe: బ్రేక్‌ఫాస్ట్ చేసేందుకు మనకు అనేక రకాలైన అల్పాహారాలు ఉన్నాయి. అయితే పండగవేళ ఏదైనా ప్రత్యేకంగా తింటేనే కదా అసలైన పండగలా అనిపిస్తుంది. సాధారణంగా దీపావళి పండగకు పేనీలు, సేమియా పాయసం లాంటివి చేసుకుంటారు. ఈ సందర్భంగా మీరు బ్రేక్‌ఫాస్ట్ చేయటానికి, అలాగే పండగ రోజున నోరు తీపి చేసుకోవటానికి రెండు రకాలుగా చేసుకోగలిగే రెసిపీని అందిస్తున్నాం. దీనిని వెర్మిసెల్లీతో చేసుకోవాల్సి ఉంటుంది.
వెర్మీసెల్లీతో ఉప్మా చేసుకోవచ్చు దీనినే సేమియా ఉప్మా అంటారు. అలాగే ఖీర్ లేదా పాయసం కూడా చేసుకోవచ్చు. ఈ సెమియా పాయసం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఈ టూ-ఇన్-వన్ రెసిపీని సులభంగా, రుచికరంగా ఎలా చేసుకోవాలి? కావలసిన పదార్థాలేమిటో ఇక్కడ చూడండి.
Vermicelli Semiya Upma Recipe కోసం కావలసినవి
- 2 కప్పులు వెర్మిసెల్లి సెమియా
- 2 టేబుల్ స్పూన్లు నూనె
- 1 స్పూన్ ఆవాలు
- 1 స్పూన్ జీలకర్ర గింజలు
- 1 టేబుల్ స్పూన్ మినపపప్పు
- 2 పచ్చి మిరపకాయలు
- 1 ఉల్లిపాయ
- 1/2 కప్పు బీన్స్
- 1/2 కప్పు క్యారెట్లు
- 1/2 కప్పు తాజా బఠానీలు
- 1/2 కప్పు టొమాటో ప్యూరీ
- 1/4 స్పూన్ పసుపు పొడి
- 2 టేబుల్ స్పూన్లు పల్లీలు
- కరివేపాకు
- ఉప్పు రుచికి తగినంత
వెర్మీసెల్లీ ఉప్మా తయారీ విధానం
- ముందుగా కడాయిని వేడి చేసి అందులో వెర్మిసెల్లి వేసి కొద్దిగా బంగారు రంగు వచ్చేవరకు కాల్చండి. ఆ తర్వాత ప్లేట్‌లోకి తీసుకొని, పక్కన పెట్టండి.
- ఇప్పుడు అదే కడాయిలో నూనె వేడి చేసి మినపపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు చిటపటలాడనివ్వండి. అలాగే నిలువుగా కోసిన మిరపకాయలు, కరివేపాకు వేసి వేయించండి, ఆపై ఉల్లిపాయలు వేసి వేయించండి.
- ఇప్పుడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసి 1-2 నిమిషాలు వేయించాలి.
- అనంతరం పైన పేర్కొన్న క్యారెట్, బీన్స్ వంటి వెజెటెబుల్స్ ను సన్నగా తరిగి వేయించండి. 3-4 నిమిషాలు పాటు ఉడికించండి.
- ఇప్పుడు టొమాటో ప్యూరీ, 2 1/2 కప్పుల నీరు వేసి, ఉడకబెట్టండి. ఆ మరుగులో వెర్మిసెల్లి వేసి బాగా కలపాలి. కడాయిపై మూత పెట్టి నీరు ఆరిపోయే వరకు ఉడికించాలి.
సెమియా ఉప్మా రెడీ అయినట్లే, ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లోకి మార్చి, పైనుంచి వేయించిన పల్లీలు వేసి కలిపి, వేడివేడిగా వడ్డించండి.
ఈ సేమియాతో పాయసం కూడా చేసుకోవచ్చు.
Vermicelli Semiya Kheer Recipe:
- కడాయిలో నెయ్యి వేడిచేసి, అందులో 100 గ్రాముల వెర్మిసెల్లిని వేసి 2 నిమిషాల పాటు వేయించండి.
- ఆపై అరలీటర్ కంటే కొంచెం తక్కువగా చిక్కటి పాలు పోసి మరిగించండి, అందులోనే పంచదార వేసి కలుపుతూ ఉండండి.
- ఆపై జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వంటి నట్స్, డ్రైఫ్రూట్స్ చల్లుకోండి.
- చిటికెడు ఏలకులు పొడి చల్లుకుంటే పాయసానికి మంచి ఫ్లేవర్ వస్తుంది.
అంతే, పాయసం రెడీ.. వేడిగా అయినా తినొచ్చు, చల్లగా అయినా ఆస్వాదించవచ్చు.
సంబంధిత కథనం