Mix Dal Vegetable Soup | మాన్‌సూన్‌లో ఈ సూప్ తాగితే వచ్చే మజానే వేరు!-healthy mix dal vegetable soup to relish this monsoon season ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mix Dal Vegetable Soup | మాన్‌సూన్‌లో ఈ సూప్ తాగితే వచ్చే మజానే వేరు!

Mix Dal Vegetable Soup | మాన్‌సూన్‌లో ఈ సూప్ తాగితే వచ్చే మజానే వేరు!

HT Telugu Desk HT Telugu
Jul 19, 2022 08:16 PM IST

మిక్స్ దాల్ వెజిటెబుల్ సూప్ అనేది పప్పు, కూరగాయలు, సుగంధ దినుసుల మిశ్రమం. ఇందులో ప్రోటీన్, పొటాషియం, విటమిన్ B, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, జింక్ వంటి పోషకాలుంటాయి. ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి మంచి రక్షణ ఇస్తుంది.

<p>Mix Dal Vegetable Soup&nbsp;</p>
Mix Dal Vegetable Soup (Unsplsh)

చల్లని సాయంత్రం వేల, వర్షం కురుస్తుండగా ఆవిర్లు వచ్చే ఒక కప్పును ఆస్వాదించడాన్ని ఎవరు ఇష్టపడరు? వర్షాకాలంలో మీకు ముందుగా గుర్తుకు వచ్చేది చాయ్-పకోడీలు. అయితే ఇవే కాదు ఈ మాన్‌సూన్‌ను ఆస్వాదించటానికి ఇంకా ఎన్నో రుచికరమైన ఆప్షన్లు మీకు ఉన్నాయి.

ఈ సీజన్‌లో వర్షాలతో వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ మన శరీరం ఇతర రూపంలో నీటిని కోల్పోయి డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం కోసం తగినంత నీరు తాగాలి. కేవలం నీరు మాత్రమే కాకుండా, రుచికరమైన సూప్‌లు, వేడివేడి రసాలు, నీటి శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలు, తాజా పండ్లు, పండ్ల రసాలు తీసుకోవడం కూడా ముఖ్యం.

ఈ వర్షాకాలంలో మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, మూడ్ స్వింగ్‌లను నియంత్రించటానికి, అనారోగ్యకరమైన కోరికలను అదుపుచేయటానికి ఆరోగ్యకరమైన మిక్స్ దాల్ వెజిటెబుల్ సూప్ తీసుకోవాలని న్యూట్రిషనిస్ట్ హరిప్రియ సూచించారు. మరి ఈ టేస్టీ, హెల్తీ సూప్ రెసిపీ ఇక్కడ ఉంది. మీరు కూడా ట్రై చేయండి.

మిక్స్ దాల్ వెజిటెబుల్ సూప్ కోసం కావలసినవి

  1. మసూర్ పప్పు - 3 టేబుల్ స్పూన్లు
  2. పెసరి పప్పు - 3 టేబుల్ స్పూన్లు
  3. కంది పప్పు - 2 టేబుల్ స్పూన్లు
  4. అల్లం - 1 అంగుళం
  5. వెల్లుల్లి రెబ్బలు - 2
  6. టొమాటో, క్యారెట్, బీట్‌రూట్‌లు - 1
  7. పసుపు - ¼ స్పూన్
  8. ఉప్పు - ½ స్పూన్
  9. మిరియాల పొడి - ½ tsp
  10. కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
  11. గుమ్మడికాయ లేదా పొద్దుతిరుగుడు విత్తనాలు - 1 టేబుల్ స్పూన్
  12. నీరు - 2 కప్పులు

తయారీ విధానం

  • ఒక గిన్నెలో పైన పేర్కొన్న అన్ని పప్పు ధాన్యాలను తీసుకోండి. బాగా కడిగి 30 నిమిషాలు నానబెట్టండి.
  • ఇప్పుడు ప్రెజర్ కుక్కర్‌లో నానబెట్టిన పప్పు, టొమాటో, క్యారెట్, బీట్‌రూట్ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఉప్పు, పసుపు అన్నీ వేసి, 2 కప్పుల నీరు పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
  • ఉడికిన తర్వాత మిశ్రమాన్ని బ్లెండర్‌కు బదిలీ చేసి పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఇందులోనే ఇందులోనే ½ టీస్పూన్ మిరియాల పొడి అలాగే అవసరం మేరకు మరి కొన్ని నీళ్లు సుమారు 1½ కప్పు నీటిని పోసి బాగా బ్లెండ్ చేయండి.
  • ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సువాసన బాగా గ్రహించే వరకు మీడియం మంట మీద ఉడికించాలి.
  • తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తరిగిన కొత్తిమీర, పైన పేర్కొన్న గింజలతో అలంకరించండి.

సర్వింగ్ కప్ లోకి తీసుకొని వేడి వేడిగా తాగండి. అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

చిట్కా- కూరగాయలు వండుతున్నప్పుడు, పోషకాల నష్టాన్ని నివారించడానికి వాటిని పెద్ద పరిమాణంలో కత్తిరించాలి.

Whats_app_banner

సంబంధిత కథనం