Oats Breakfast | ఓట్స్ తినడం బోర్ కొట్టిందా? అయితే ఇలా ట్రై చేయండి..
రోజూ ఓట్స్ తిని మీకు బోర్ కొట్టిందా? రొటీన్ ఓట్స్‌కు బాయ్ చెప్పి.. ఆరోగ్యకరమైన దారిలో టేస్టీగా ఓట్స్ తినాలనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. మీ బ్రేక్‌ఫాస్ట్‌ను రుచిగా మార్చి.. మీకు తగినంత కేలరీలు అందిచడంలో ఇది సహాయం చేస్తుంది. దీని తయారీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Healthy Diet Recipe | ఓట్స్. బరువు తగ్గాలనుకునేవారు, ఆరోగ్యకరమైన డైట్ పాటించేవారు ఓట్స్‌ను కచ్చితంగా ఉపయోగిస్తారు. కానీ రోజూ ఒకే రకంగా ఓట్స్ తినాలంటే మనకి కాస్త విసుగు వచ్చేస్తుంది. అలా విసుగు చెందిన వారు కచ్చితంగా దీనిని ట్రై చేయండి. హెల్తీ పద్ధతిలో ఓట్స్‌ను తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి కూడా ఎటువంటి లోటు ఉండదు. ఉదయాన్నే జిమ్ నుంచి, లేదా వ్యాయామం చేసి వచ్చిన తర్వాత దీనిని తీసుకోవచ్చు. పైగా ఇది తక్షణ శక్తిని అందిస్తుంది. మీ ఉదయాన్ని మరింత ఉల్లాసంగా మారుస్తుంది. మరీ హెల్తీ ఓట్స్ రెసిపీని మీరు నేర్చేసుకుని.. చక చక లాగించేయండి..
కావాల్సిన పదార్థాలు
* ఓట్స్ - పావు కప్పు
* పాలు - ముప్పావు కప్పు
* నెయ్యి - అర టీస్పూన్
* బాదం - 5
* తేనె - 1 స్పూన్
* ఫ్రెష్ ఫ్రూట్స్ - మీకు నచ్చినవి.. (తరిగి పెట్టుకోవాలి)
తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. దానిలో నెయ్యివేసి.. బాదం ముక్కలను వేయించాలి. అవి వేగిన తర్వాత.. దానిలోనే ఓట్స్ వేసి 3 నుంచి 4 నిమిషాలు వేయించాలి. వెంటనే పాలు పోసి దానిని 5 నుంచి 6 నిమిషాలు మరిగించాలి. స్టవ్ ఆఫ్ చేసి దానిని కాస్త చల్లారనివ్వాలి. ఆ మిశ్రామని ఒక గిన్నెలో తీసుకుని తేనె, మీకు నచ్చిన పండ్లను వేసి కలుపుకోవాలి. అంతే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ.
దీనిలో మొత్తం 254 క్యాలరీలు ఉంటాయి. ప్రోటీన్ 8.9 గ్రాములు, ఫ్యాట్స్ (మంచివి) 6.7 గ్రాములు, కార్బ్స్ 40.1 గ్రాములు, ఫైబర్ 4.1 గ్రాములు కలిగి ఉంటుంది. కాబట్టి వర్క అవుట్ చేశాక దీనిని హ్యాపీగా లాగించేయవచ్చు. రొటీన్ ఓట్స్ బోర్ కొట్టినప్పుడు ఇలా ట్రై చేస్తే అస్సలు మానలేరు. పైగా హెల్త్‌కి కూడా మంచిది.
సంబంధిత కథనం