Stuffed Idly Recipe : ఆరోగ్యానికి మరింత మేలు చేసే స్టఫ్డ్ ఇడ్లీ.. ఇదే రెసిపీ..-healthy breakfast stuffed idly here is the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Stuffed Idly Recipe : ఆరోగ్యానికి మరింత మేలు చేసే స్టఫ్డ్ ఇడ్లీ.. ఇదే రెసిపీ..

Stuffed Idly Recipe : ఆరోగ్యానికి మరింత మేలు చేసే స్టఫ్డ్ ఇడ్లీ.. ఇదే రెసిపీ..

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 06, 2023 07:30 AM IST

Stuffed Idly Recipe : ఉడికించిన కూరగాయాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అలాగే ఇడ్లీలు కూడా ఎవరైనా తినొచ్చు. అయితే.. ఈ రెండిటీని కలిపే అద్భుతమైన రెసిపీ ఇక్కడ ఉంది. అదే స్టఫ్డ్ ఇడ్లీ.

స్టఫ్డ్ ఇడ్లీ
స్టఫ్డ్ ఇడ్లీ

Stuffed Idly Recipe : ఉదయాన్నే ఇడ్లీతో పాటు.. నట్స్, కూరగాయలతో కూడిన బ్రేక్​ఫాస్ట్ ఆరోగ్యకరమైన అల్పాహారంగా చెప్పవచ్చు. ఇది ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా.. మంచి తేలికపాటి ఆహారంగా కూడా చెప్పవచ్చు. తయారు చేయడం కూడా చాలా సులభం. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* బియ్యం - 3 కప్పులు

* మినపప్పు - 1 కప్పు

* పిస్తాలు - 1 టీస్పూన్

* జీడిపప్పు - 1 టీస్పూన్

* గ్రీన్, రెడ్ క్యాప్సికమ్ - 1 టేబుల్ స్పూన్

* ఊరగాయ మసాలా - 1 టేబుల్ స్పూన్

* కసూరి మేథి - 1 టీస్పూన్

* క్యారెట్ - 1 టేబుల్ స్పూన్

స్టఫ్డ్ ఇడ్లీ తయారీ విధానం

బియ్యం, మినపప్పును నానబెట్టి.. వాటిని పిండి చేయండి. దానిని పులియబెట్టండి. ఇప్పుడు ఇడ్లీ ట్రేకి నూనె రాయండి. అనంతరం మిగిలిన పదార్థాలన్నీ కట్ చేసి.. బాగా కలిపి.. ప్రతి ఇడ్లీ ట్రేలో ప్లేస్ చేయండి. వాటిపై ఇడ్లీ పిండిని ఉంచండి. ఇడ్లీలు ఉడికినంత వరకు ఆవిరి మీద ఉడికించాలి. అంతే వేడి వేడిగా వాటిని సర్వ్ చేసుకుని.. మీకు నచ్చిన చట్నీతో లాగించేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం