Sleeping Position : కాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటే మంచిదేనా? ప్రయోజనాలు ఉన్నాయా?-health benefits of placing a pillow between legs while sleeping ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleeping Position : కాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటే మంచిదేనా? ప్రయోజనాలు ఉన్నాయా?

Sleeping Position : కాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటే మంచిదేనా? ప్రయోజనాలు ఉన్నాయా?

HT Telugu Desk HT Telugu
Sep 05, 2023 07:45 PM IST

Sleeping Position : మనం నిద్రపోయే పొజిషన్ కూడా మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. కొన్ని విధాలుగా పడుకోవడం ఆరోగ్యానికి మంచిది. కొన్ని రకాల పొజిషన్‍లో పడుకుంటే.. కొన్ని సమస్యలు కూడా వస్తాయి.

నిద్ర చిట్కాలు
నిద్ర చిట్కాలు (unsplash)

మంచి నిద్ర కోసం.. నిద్ర విధానం సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. నిద్రించే విధానం శరీరంలోని ఏ భాగాన కూడా ఒత్తిడికి గురికాకుండా ఉండాలి. రాత్రిపూట రెండు కాళ్ల మధ్య దిండు పెట్టుకుని ఒకవైపు నిద్రపోవడం అలవాటు చేసుకుంటే.. తప్పకుండా బాగా నిద్రపడుతుంది. ఇలా పడుకోవడం వల్ల మంచి నిద్ర రావడమే కాకుండా అనేక శారీరక సమస్యలు నయమవుతాయి.

నిద్ర సరిగా రాకపోతే ప్రతి క్షణం మనసులో ఏవేవో ఆలోచనలు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే.. ఆరోగ్యంగా ఉండొచ్చు. రెండు కాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. రెండు మోకాళ్ల మధ్య దిండు పెట్టడం వల్ల మోకాలు ఒకదానికొకటి ఢీకొనవు. శరీర భంగిమ సరిగ్గా ఉంటుంది. తద్వారా కండరాలలో ఒత్తిడి ఉండదు. కండరాలు ఇప్పటికే సాగినట్లుగా అనిపిస్తే, ఈ విధంగా నిద్రపోండి. ఉదయం వరకు నొప్పి తొలగిపోతుంది.

గర్భధారణ సమయంలో ఎక్కువసేపు ఒకే భంగిమలో పడుకోవడం చాలా కష్టం. కాళ్ల మధ్య దిండు పెట్టుకుని ఒకవైపు పడుకోవడం వల్ల వెన్నుపాముపై ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా సౌకర్యవంతమైన నిద్ర ఉంటుంది. శరీరంలోని ఏ భాగంపైనా బరువు పడదు. ఎటువంటి హాని కలిగించదు.

నేటి జీవనశైలి కారణంగా, చాలా మంది వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. నిద్రపోయేటప్పుడు దిండును రెండు కాళ్ల మధ్య ఉంచి ఒకవైపు పడుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల నడుము, వెన్నెముకపై ఒత్తిడి ఉండదు. శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. నొప్పి శరీరం నుండి పోతుంది.

మనం నిద్రపోతున్నప్పుడు, రక్త ప్రసరణ ఆగిపోతుంది. దీని వెనుక కారణం కొన్నిసార్లు మన నిద్ర విధానం వల్ల గుండెకు రక్తం వెళ్లే ప్రధాన సిర ఒత్తిడికి గురవుతుంది. రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. దిండు మోకాళ్ల మధ్యన పెట్టుకుని నిద్రిస్తే.. సరైన పొజిషన్‍లో నిద్రస్తం కాబట్టి.. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. కాళ్ళ మధ్య దిండుతో నిద్రించడం ప్రారంభిస్తే ఉదయం నిద్రలేవగానే శరీరంలోని ఏ భాగంలోనైనా నొప్పి లేదా ఒత్తిడి అనిపించదు.

Whats_app_banner