Pineapple Benefits : వెరీ ఫైన్​గా ఉండాలంటే.. పైనాపిల్ తినాల్సిందే..-health benefits of consuming pineapple in your diet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Health Benefits Of Consuming Pineapple In Your Diet

Pineapple Benefits : వెరీ ఫైన్​గా ఉండాలంటే.. పైనాపిల్ తినాల్సిందే..

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 11, 2022 03:20 PM IST

పైనాపిల్​ను రోజూ తీసుకుంటే చాలా ఆరోగ్యప్రయోజనాలను పొందుతారని నిపుణలు తెలుపుతున్నారు. ఇది మీ బోన్స్​ను రిపైర్ చేయడమే కాకుండా.. మెరుగైన జీర్ణక్రియకు సహాయం చేస్తుంది అంటున్నారు. అంతేకాకుండా దీనితో స్కిన్, హెయిర్​కు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటున్నారు.

పైనాపిల్ వల్ల కలిగే ప్రయోజనాలు
పైనాపిల్ వల్ల కలిగే ప్రయోజనాలు

Pineapple Benefits : అత్యంత రుచికరమైన పండ్ల గురించి మీరు ఆలోచిస్తే.. ఆ జాబితాలో పైనాపిల్స్ కూడా ఉంటాయి. ఈ పండు బహుళ యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు, ఇతర సమ్మేళనాలతో నిండి ఉంటుంది. కాబట్టి దీనిని మీ డైట్​లో యాడ్​ చేసుకుంటే మెరుగైన ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనిని తినడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎముకలకు మంచిది

మీ ఎముకలు బలహీనంగా ఉన్నట్లయితే.. పైనాపిల్​ను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. పైనాపిల్ పూర్తిగా మాంగనీస్‌తో నిండి ఉంటుంది. ఇది మీ ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

అదనంగా ఇది 'విటమిన్ సి'కి గొప్ప మూలం. ఇది మొత్తం ఎముక ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. బోలు ఎముకల వ్యాధిని అభివృద్ధి చేయకుండా నిరోధిస్తుంది. పైనాపిల్స్ ఎముకలకు మంచి ఖనిజ సాంద్రతను ఇస్తాయి.

మెరుగైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది

పైనాపిల్స్‌లో బ్రోమెలైన్ - ఎంజైమ్‌ల మిశ్రమం ఉంటుంది. ఈ ఎంజైమ్‌ల సమూహం అధ్యయనాల ప్రకారం.. వాపును తగ్గించి.. మీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అందుకే దక్షిణ అమెరికా దేశాల్లో పైనాపిల్స్‌ను అనేక జీర్ణ రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తున్నారు.

బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇంటర్నేషనల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. బ్రోమెలైన్ డయేరియా చికిత్సలో, దాని లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

వ్యాధులతో పోరాడుతుంది

పైనాపిల్స్‌లో బహుళ పోషకాలు సమృద్ధిగా ఉండటమే కాకుండా యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. మధుమేహం , కొన్ని రకాల క్యాన్సర్‌లు, గుండె జబ్బులు, దీర్ఘకాలిక మంట మొదలైన వ్యాధులతో పోరాడడంలో కీలకమైన ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ సమ్మేళనాలు అనే యాంటీ ఆక్సిడెంట్‌లపై ఇవి ప్రత్యేకంగా పని చేస్తాయి.

పైనాపిల్‌లోని అనేక యాంటీఆక్సిడెంట్లు శరీరంపై దీర్ఘకాలిక సానుకూల ప్రభావాలను ఉత్పత్తి చేస్తాయని నమ్ముతారు.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

పైనాపిల్స్ తక్కువ క్యాలరీల కౌంట్‌తో పాటు మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. మీరు ఈ పండ్ల నుంచి మాత్రమే ఫైబర్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, మాంగనీస్, జింక్, రాగి వంటి పోషకాలను పొందుతారు. అదనంగా వీటిలో విటమిన్ A, B6, C, K, పొటాషియం, ఫాస్పరస్‌లను కూడా అధికంగా కలిగి ఉంటాయి.

పైనాపిల్స్‌లో రిబోఫ్లావిన్, ఫోలేట్, నియాసిన్, పాంతోతేనిక్ యాసిడ్ కూడా ఉన్నాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

మెరిసే చర్మం, ఆరోగ్యకరమైన జుట్టు కావాలంటే

ఇది మానవ శరీరానికి అవసరమైన అనేక పోషకాలను కలిగి ఉంది. పైనాపిల్స్ మీ చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా బాగా పనిచేస్తాయి. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి.. మొటిమలు, చర్మపు దద్దుర్లు, అసమాన చర్మపు టోన్ చికిత్సలో సహాయపడతాయి. అంతేకాదు, ఇందులో యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఉన్నాయి.

ఇది సోరియాసిస్ వంటి వ్యాధులను కూడా నివారిస్తుంది. మృదువైన, మెరిసే, బలమైన జుట్టును ప్రోత్సహిస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్