Raksha Bandhan wishes: రాఖీ పండగ శుభాకాంక్షలు ఈ ఫొటోలు, మెసేజీలతో చెప్పేయండి..
Raksha Bandhan 2023 Wishes: ఈ సంవత్సరం రాఖీ పండగ ఆగస్టు 30, 31 వ తేదీల్లో జరుపుకోబోతున్నాం. ఈ రోజున మీ ఇష్టమైన వాళ్లకి శుభాకాంక్షలు ఈ ఫొటోలు, సందేశాల ద్వారా తెలియజేయండి.
రాఖీ పండగ శుభాకాంక్షల మెసేజీలు (HT Photo)
ఆగస్టు 30, 31 వ తేదీల్లో రాఖీ పండగ జరుపుకుంటున్నాం. ఈ రోజున మీ తోబుట్టువులతో మీకున్న బంధాన్ని వేడుకలా జరుపుకుంటారు. సోదరి సోదరులు రాఖీ కట్టుకుంటారు. బహుమతులు, పిండి వంటలు, స్వీట్లు, కొత్త బట్టలు.. ఇలా రాఖీ పండగ అంటేనే వేడుకలా ఉంటుంది. ఈ రోజున మీకిష్టమైన వారికి శుభాకాంక్షలు తెలపడానికి కొన్ని మంచే మెసెజీలు, ఫొటోలు మీకోసం..
రక్షాబంధన్ మెసేజీలు, సందేశాలు, ఫొటోలు:
- నా ప్రియమైన సోదరుడికి రక్షాబంధన్ శుభాకాంక్షలు. నువ్వెప్పుడూ క్షేమంగా, సంతోషంగా ఉండాలని ఈ రాఖీ సందర్భంగా ప్రత్యేకంగా కోరుకుంటున్నా.
- నీకు ఆరోగ్యం, సుఖ శాంతులు, సంతోషం ఎప్పుడూ ఉండాలని, ఈ ప్రపంచంలో ఉన్న మంచంతా నీకు జరగాలని కోరుకుంటున్నా. రాఖీ పండగ శుభాకాంక్షలు అన్నయ్య.
- నన్ను ఆపదల నుంచి రక్షించావు, నేను ఏడుస్తున్న ప్రతిసారీ ఓదార్చావు. సూపర్ హీరోలు ఉంటారనేది నిజం అయితే.. నువ్వు నా సూపర్ హీరోవే. నువ్వు నాకోసం చేసిన ప్రతి పనికీ థ్యాంక్యూ అన్నయ్య. హ్యాపీ రక్షాబంధన్.
- వెలకట్టలేని బంధాలను, వదులుకోలేని అనుబంధాలను గుర్తు చేసే మధుర బంధమే రాఖీ పండగ. నీకు రాఖీ పండగ శుభాకాంక్షలు తమ్ముడా..
- మంచి సోదరుడిగా ఉన్నందుకు థ్యాంక్యూ అన్నయ్య. నువ్వు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లా ఉన్నావ్. నేను నడిచే దారిలో అడ్డంకులు, ఆటంకాలు లేకుండా చూసుకున్నావ్. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య.
- నా జీవితంలో నువ్వు ప్రత్యేకం. నీ కోరికలన్నీ నిజం కావాలని ప్రార్థిస్తున్నా. నువ్విలాగే ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి. హ్యాపీ రక్షాబంధన్.
- నువ్ నన్ను ఏడిపిస్తావ్, నువ్వే నన్ను నవ్విస్తావ్, నన్ను ప్రేమిస్తావ్, లాలిస్తావ్.. నువ్వు నా జీవితంలో ఉండటం నా అదృష్టం. రాఖీ పండగ శుభాకాంక్షలు.
- ఈ ప్రపంచంలోనే మంచి చెల్లెలు నాకుంది. నువ్వు లేకుండా నా జీవితం లేదు. హ్యాపీ రక్షాబంధన్.
- నీ లాంటి అక్క ఉండటం నా అదృష్టం. నా కోరికలన్నీ తీర్చేది నువ్వే. ఈ సారి కూడా నువ్విచ్చే బహుమతి కోసం ఎదురుచూస్తుంటా. హ్యాపీ రక్షా బంధన్.