Maha Shivaratri Wishes : ఓం నమ: శివాయ.. ఇలా మహాశివరాత్రి విషెస్ చెప్పండి
Maha Shivaratri Wishes In Telugu : భారతదేశంలో జరుపుకొనే అతిపెద్ద పండుగలలో మహాశివరాత్రి పండుగ అత్యంత ముఖ్యమైనది. ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చి 8న వచ్చింది. ఈ సందర్భంగా మీ ప్రియమైన వారికి మహాశివరాత్రి విషెస్ చెప్పండి.
శివరాత్రి అంటే పవిత్రమైన చీకటి అని అర్థం. ఈరోజు భక్తులు శివ నామాన్ని, మంత్రాలను మనస్పూర్తిగా పఠిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా శివుడు పార్వతీ సమేతంగా భూలోకానికి వస్తాడని, ఈ రోజున ఎవరైతే శివుడిని నిర్మలమైన మనస్సుతో పూజిస్తారో వారి పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. ఈ పవిత్రమైన రోజున మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు చెప్పండి. వారు జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకోండి. ఈ కింది విధంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు పంపండి.
నాగేంద్ర హరాయ త్రిలోచనాయ
భస్మాంగ రాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగమ్బరాయ
తస్మైన కారాయ నమః శివాయ
మహాశివరాత్రి శుభాకాంక్షలు
బ్రహ్మమురారి సూరార్చిత లింగం..
నిర్మలభాసితశోభిత లింగం..
జన్మజదు:ఖవినాశక లింగం..
తత్ ప్రణమామి సదాశివ లింగం..
మహాశివరాత్రి శుభాకాంక్షలు
ఓం త్ర్యమ్బకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనమ్ ఉర్వరుక మివ బంధనన్ మృత్యోర్ ముక్షీయామృతాత్.. మహాశివరాత్రి శుభాకాంక్షలు
హరహర మహాదేవ శంభోశంకర.. ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
లయకారుడు, భోళా శంకరుడు, లింగోద్భవం జరిగిన మహాశివరాత్రి పర్వదినాన.. ఆ దేవదేవుడి ఆశిస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ.. Happy Maha Shivaratri 2024
తన విశ్వాసపాత్రులైన భక్తులను ఎప్పుడూ నిరాశపరచని మహాదేవుడు.. శివుడు.. Happy Maha Shivratri 2024
శివుని శాశ్వతమైన ప్రేమ, శక్తి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.. ఆనందం, శాంతితో మీకు, మీ కుటుంబానికి శివుని ఆశీస్సులు.. మహాశివరాత్రి శుభాకాంక్షలు
ముల్లోకాల సంరక్షకుడు.. గంగను తలపై ధరించిన దేవదేవుడు.. నట్యం చేసే నాటరాజు.. ప్రపంచానికి శివుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ.. శివరాత్రి పండుగ శుభాకాంక్షలు
సూర్య, చంద్ర, అగ్ని స్వరూపుడు, నెలవంకను తలపై పెట్టుకున్న లయకారుడు, నటరాజు అందరికీ మేలు చేయుగాక శివరాత్రి పండుగ శుభాకాంక్షలు
శైవ అథవా వైష్ణో వాపి యో వశ్యదన్యపూజకః సర్వం పూజఫలం హన్తి శివరాత్రీ బహిర్ముఖః మహాశివరాత్రి శుభాకాంక్షలు
శివుని ద్వారా అన్ని చెడులు పరిష్కరం అవుతాయి. అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు
శివుడు నీకు జీవితాంతం మార్గనిర్దేశం చేస్తాడు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు
మహా శివరాత్రి సందర్భంగా, మీరు జీవితం నుండి కోరుకునే ప్రతిదాన్ని భగవంతుడు మీకు అందిస్తాడు... Happy Maha Shivaratri
శివుడు మీకు గొప్ప శ్రేయస్సు, ఆనందం, విజయాన్ని ప్రసాదిస్తాడు. ఓం నమ:శివాయ!
మీ కోరికలన్నీ నెరవేరాలని, భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మహా శివరాత్రి శుభాకాంక్షలు
మహా శివరాత్రి పవిత్రమైన రోజున భగవంతుడు మీ కోరికలన్నింటినీ తీర్చి, సంతోషకరమైన జీవితాన్ని ఇస్తాడు.. మహా శివరాత్రి శుభాకాంక్షలు!
శివుని ఆరాధన జీవితంలో వెలుగునిస్తుంది. కావున శివరాత్రి నాడు భక్తిశ్రద్ధలతో శివుని పూజించి భగవంతుని అనుగ్రహాన్ని పొందండి. జై బోలేనాథ్.. మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.
భోలేనాథ్ ఈ ప్రపంచంలోని ప్రజలందరి కోసం తనను తాను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆ పరశివుని ప్రార్థిద్దాం. శివుడు మీకు ఆనందాన్ని, శాంతిని ప్రసాదిస్తాడు.
ఓం నమః శివాయ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు శివరాత్రి శుభాకాంక్షలు..
శివుడు ప్రతి ఒక్కరికీ తన అనుగ్రహాన్ని ప్రసాదించి, జీవితంలో కష్టాలను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ శక్తిని ప్రసాదించుగాక.. మహా శివరాత్రి శుభాకాంక్షలు.