Dreams: శివరాత్రికి ముందు మీకు కలలో ఇవి కనిపించాయా? అయితే మీ జీవితం మారబోతుంది-do you know what it means if you see these in a dream before maha shivratri ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Dreams: శివరాత్రికి ముందు మీకు కలలో ఇవి కనిపించాయా? అయితే మీ జీవితం మారబోతుంది

Dreams: శివరాత్రికి ముందు మీకు కలలో ఇవి కనిపించాయా? అయితే మీ జీవితం మారబోతుంది

Gunti Soundarya HT Telugu
Mar 07, 2024 12:01 PM IST

Dreams: మహా శివరాత్రి ముందు కొన్ని విషయాలు కలలో కనిపించడం వల్ల జీవితానికి మేలు జరుగుతుందని, అందుకు సంబంధించిన సంకేతాలు కలగా వస్తాయని పండితులు చెబుతున్నారు.

శివరాత్రి ముందు మీ కలలో ఇవి కనిపించాయా?
శివరాత్రి ముందు మీ కలలో ఇవి కనిపించాయా? (pixabay)

Dreams: దేశమంతా శివనామ స్మరణతో, భక్తి భావంతో నిండిపోయింది. హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఒకటి మహాశివరాత్రి. మాఘ శుక్ల చతుర్ధశి రోజు అంటే మార్చి 8న మహా శివరాత్రి జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా భక్తులందరూ శివాలయాలను సందర్శిస్తున్నారు. శివయ్య భక్తులతో ఆలయాలు నిండిపోతున్నాయి.

కైలాసనాథుడు ఆశీస్సులు పొందడం కోసం ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపిస్తారు. సనాతన ధర్మం ప్రకారం మహా శివరాత్రి అత్యంత పవిత్రమైన రోజు. ఉపవాసం ఉండి జాగరణ చేసి భక్తి శ్రద్ధలతో శివలింగాన్ని పూజించడం వల్ల మహాదేవుడు తమ కోరికలు నెరవేరుస్తాడని భక్తుల విశ్వాసం. మహా శివరాత్రికి ముందు మీకు కలలో కొన్ని సంకేతాలు కనిపిస్తే మీ జీవితం మారబోతుందని పండితులు చెబుతున్నారు. మీ కలలో కనుక పాము, శివలింగం వంటివి కనిపిస్తే మీ జీవితంలో శుభ సమయం ఆరంభం కాబోతుందని, కష్టాలు తీరబోతున్నాయనే దానికి సంకేతాలుగా భావించాలి. ఎటువంటివి కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

నల్ల శివలింగం

మీకు శివరాత్రికి ముందు కలలో నలుపు రంగు శివలింగం కనిపిస్తే చాలా శుభప్రదం. శివలింగం శివుడికి చిహ్నంగా పరిగణిస్తారు. మహా శివరాత్రి ముందు మీకు శివలింగం కలలో దర్శనమైతే మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందబోతున్నారని సూచిస్తుంది. శివుడు లింగావతారం శివరాత్రి రోజునే జరిగిందని శివపురాణం చెబుతోంది.

బిల్వపత్రం

శివుడికి మహా ప్రీతికరమైనది బిల్వపత్రం. దీన్నే మారేడు దళం అని కూడా అంటారు. శివ పూజకి ఉపయోగించే వాటిలో బిల్వ పత్రం లేకుండా ఉండదు. మీకు కలలో బిల్వపత్రం కనిపిస్తే మీ ఆర్థిక సమస్యలు త్వరలోనే సమసిపోతాయని అర్థం. ఆర్థిక సమస్యలతో పాటు ఇతర సమస్యల నుంచి కూడా విముక్తి కలగబోతుంది అనేదానికి ఇది సంకేతం.

నంది

శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా నందీశ్వరుడిని దర్శనం చేసుకుంటారు. నంది కొమ్ములలో నుంచి శివయ్యని దర్శించుకుంటారు. మహా శివరాత్రి ముందు మీకు కలలో నంది కనిపిస్తే మీరు అదృష్టవంతులు కాబోతున్నారని అర్థం. ఇది చాలా అద్భుతమైన కల. నంది భోలేనాథుడు వాహనం. నంది లేకుండా శివుని కుటుంబం అసంపూర్తిగా భావిస్తారు. అటువంటి పవిత్రమైన నంది మీ కలలో కనిపిస్తే మీకు శివుని ఆశీర్వాదంతో విజయం లభిస్తుందని సూచన.

పాము

చాలామందికి తరచుగా కలలో పాములు కనిపిస్తాయి. కానీ మహాశివరాత్రి ముందు మీకు కలలో పాము కనిపిస్తే అది శుభసంకేతంగా పరిగణించాలి. ఇలాంటి కల వచ్చిందంటే మీ జీవితంలో ఆకస్మిక ధన ప్రవాహం జరగబోతుందని అర్థం. మీ సంపద పెరుగుతుంది.

శివలింగాన్ని ప్రతిష్టించినట్టు

మీకు కలలో శివలింగాన్ని ప్రతిష్టించినట్టు కనిపిస్తే శివుడు మిమ్మల్నిప్రసన్నం చేసుకుంటున్నాడని అర్థం. శివయ్య అనుగ్రహంతో మీ జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోయి సంతోషం వెళ్లి విరుస్తుంది.

రుద్రాక్ష

పరమశివుడికి ఎంతో ఇష్టమైనవి రుద్రాక్షలు. ఆయన కన్నీటి చుక్కలే రుద్రాక్షలుగా మారాయి అని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి పవిత్రమైన రుద్రాక్ష మహాశివరాత్రి ముందు మీకు కలలో కనిపించాలంటే కష్టాలు, రోగాలు, సమస్యలు తొలగిపోతాయని అర్థం. త్వరలోనే పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తి చేయగలుగుతారు.

WhatsApp channel