Rudraksha Health Benefits : గుండె ఆరోగ్యం నుంచి తలనొప్పి వరకు.. రుద్రాక్షతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
Rudraksha Health Benefits : హిందూ మతంలో రుద్రాక్షను ఎంతో పవిత్రమైనదిగా చూస్తారు. అయితే దీనిని ధరించడం వలన ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి.
మెడలో రుద్రాక్ష ధరించిన శివ భక్తులను మనం తప్పక చూసి ఉంటాం. అయితే 108 పూసలతో రుద్రాక్షను ధరించడం మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉండటమే కాకుండా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. చాలా మంది మంచి ఆరోగ్యం కోసం లేదా మతపరమైన కారణాల కోసం రుద్రాక్షను ధరిస్తారు.
రుద్రాక్షకు మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇది శివుని భాగమని భావించబడుతుంది. శివుడికి రుద్రాక్ష అంటే చాలా ఇష్టమని చెబుతారు. మహాశివరాత్రి సందర్భంగా చాలా మంది రుద్రాక్షను ధరించడం చూస్తుంటాం. అయితే ఓన్లీ ఈరోజున మాత్రమే కాదు. తర్వాతి రోజుల్లో కూడా రుద్రాక్ష మాల ధరించాలి. అనేక ప్రయోజనాలు దక్కుతాయి. రుద్రాక్ష ధరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల తెలుసుకుందాం.
రుద్రాక్ష గుండెకు మంచిదని చెబుతారు. దీన్ని ధరించడం వల్ల గుండె వేగం మెరుగుపడుతుంది. ఈ కారణంగా చాలా మంది దీనిని మెడలో వేసుకుంటారు. మెడలో 108 పూసలతో రుద్రాక్షను ధరించడం ద్వారా అది హృదయాన్ని మళ్లీ మళ్లీ తాకుతుంది. ఇది గుండెను సురక్షితంగా ఉంచడానికి కూడా పనిచేస్తుందని నమ్మకం.
రుద్రాక్ష జపమాల ధరించడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. మన శరీరంలోని ప్రతి భాగం రక్త ప్రసరణ ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటుంది. రుద్రాక్ష పూసలు అయస్కాంతం వలె పనిచేసే డైనమిక్ ధ్రువణ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది శరీరంలోని ధమనులు, రక్తనాళాల అడ్డంకిని తొలగిస్తుందని చెబుతారు. రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది. దీంతో గుండెపోటు, అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది.
రుద్రాక్ష జపమాల ధరించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. గ్రంథాల ప్రకారం రకరకాల రుద్రాక్షలు వేర్వేరు విద్యుదయస్కాంత లక్షణాలను కలిగి ఉంటాయి. వాటి నుండి వెలువడే తరంగాలు మానసిక ఆరోగ్యానికి మంచివిగా పరిగణిస్తారు. ఏకముఖి రుద్రాక్ష ఆరోగ్యానికి మంచిది. 4, 6 ముఖి రుద్రాక్ష ఒక వ్యక్తిని మేధావిగా చేస్తుంది. 9 ముఖి రుద్రాక్ష జపమాల విశ్వాస స్థాయిని పెంచుతుంది. తెలివితేటలు, సహనం వల్ల మనిషి వ్యక్తిత్వం మెరుగుపడి మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవుతుంది. 11 ముఖి రుద్రాక్షను ధరించడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
రుద్రాక్షలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఆయుర్వేదాన్ని విశ్వసించే వ్యక్తులు నానబెట్టిన రుద్రాక్ష నీటిని తాగాలని సిఫార్సు చేస్తారు. దీన్ని తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది.
శివరాత్రి సందర్భంగా రుద్రాక్షను కొనుగోలు చేయండి. దానిని ధరించడం వలన ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. శివుడిని అనుగ్రహం పొందాలంటే రుద్రాక్ష మెడలో ఉండాలి. సరైన రుద్రాక్షను ఎంచుకోండి. అప్పుడే మంచి జరుగుతుంది.
రుద్రాక్ష గురించి ఓ కథ ప్రచారంలో ఉంది. రుద్ర అంటే శివ. అక్షి అంటే కళ్ళు. పౌరాణిక కథనం ప్రకారం శ్రీపురాసురుడిని చంపడానికి శివుడు ఆయుధాన్ని సృష్టిస్తాడు. ఆ సమయంలో శివుని ఆనందం కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుందట. ఈ కన్నీటి చుక్కలు భూమిపై పడడం వల్లనే రుద్రాక్షి వృక్షాలు పెరిగాయని చెబుతారు. రుద్రాక్ష శివుని చెమట నుండి సృష్టించబడిందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి.