Cholesterol Uses: కొలెస్ట్రాల్‌తో మంచి, చెడు.. కొలెస్ట్రాల్‌పై అపోహల్లో నిజమెంత?-good and bad with cholesterol how true are the myths about cholesterol ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cholesterol Uses: కొలెస్ట్రాల్‌తో మంచి, చెడు.. కొలెస్ట్రాల్‌పై అపోహల్లో నిజమెంత?

Cholesterol Uses: కొలెస్ట్రాల్‌తో మంచి, చెడు.. కొలెస్ట్రాల్‌పై అపోహల్లో నిజమెంత?

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 08, 2024 02:07 PM IST

Cholesterol Uses: 25ఏళ్లు దాటి 30ల్లోకి ప్రవేశించక ముందే కొలెస్ట్రాల్ ముప్పుపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు తరచూ వినిపిస్తుంటాయి. అసలు కొలెస్ట్రాల్‌ అంటే ఏమిటి, శరీరంలో అది చేసే పని ఏమిటనే దానిపై చాలామందికి అవగాహన ఉండదు. కొలస్ట్రాల్‌ శరీరానికి చేసే మేలేమిటో తెలుసుకోండి…

కొలెస్ట్రాల్‌తో శరీరానికి కలిగే ఉపయోగం ఏమిటి?
కొలెస్ట్రాల్‌తో శరీరానికి కలిగే ఉపయోగం ఏమిటి?

Cholesterol Uses: కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిందని తెలియగానే చాలామందికి గుండెదడ మొదలవుతుంది. గుండెకు ముప్పు పొంచి ఉన్నట్టేనని అనుమానిస్తారు. కొలెస్ట్రాల్ అంటే శరీరంలో మైనం రూపంలో ఉండే కొవ్వు పదార్ధం. ఇది మెదడు నుంచి శరీరం మొత్తం, అన్ని భాగాల్లో వ్యాపించి ఉంటుంది. భూమ్మీద జీవం ఉన్న ప్రాణులన్నింటిలో కొలెస్ట్రాల్ అనేది భాగమై ఉంటుంది. కొలెస్ట్రాల్ లేకుండా ఏ ప్రాణి మనుగడ సాగించలేదన్నది వాస్తవం.

శరీరంలో కణాల మధ్య అంతర్గతంగా సాగే స్పందనలో కొలెస్ట్రాల్ కీలక పాత్రపోషిస్తుంది. శరీర కణాల మనుగడకు అవసరమైన ఆక్సిజన్‌ను అందించడంతో పాటు పోషకాలను సంగ్రహించడంలో ఉపయోగపడుతుంది. అదే సమయంలో కార్బన్ డై ఆక్సైడ్‌ను, వ్యర్థాలను, మలినాలను దేహం నుంచి బయటకు పంపడంలో ఇది ఉపయోగపడుతుంది.

కొలెస్ట్రాల్ చెడ్డది ఎలా అయ్యిందంటే…

శరీర కణాలు వాపుకు గురైతే అనారోగ్యం, క్రమేణా వ్యాధులు వస్తాయని వైద్య పరిశోధనలు అభిప్రాయపడుతున్నాయి. కణాల్లో వాపు ఏర్పడటానికి, రక్తనాళాలు గట్టి పడటానికి కొలెస్ట్రాల్ కారణం అవుతంది. శరీరంలో కణాల వాపు, రక్త నాళాలు వాపుకు గురైనపుడు వాటిని కొలెస్ట్రాల్ మరమ్మతు చేసేందుకు ప్రయత్నిస్తుంది. అలా అడ్డుపడే కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు కారణమవుతుందని మెజార్టీ వైద్య వర్గాల అభిప్రాయంగా ఉంది.గుండె జబ్బులకు కొలెస్ట్రాల్‌కు సంబంధం లేదనే వాదనక కూడా ఉంది.

ఆరోగ్యానికి అవసరమైన ఏ,డి విటమిన్లు శరీరంలో శోషణం కావడానికి కొలెస్ట్రాల్ ఉపయోగపడుతుంది. ఏ విటమిన్‌ శరీరంలో కంటి చూపుకు, గుండె, ఉపిరితిత్తులు, కిడ్నీల పనితీరుకు ఉపయోగపడుతుంది.డి విటమిన్‌ శరీరంలో కాల్షియం, ఫాస్పరస్‌‌లను శోషణం చేసుకోడానికి ఉపయోగపడుతుంది.

కొలిస్ట్రాల్‌ శరీరంలో ఈస్ట్రోజన్‌; టెస్టోస్టిరాన్‌, కార్టిజాల్‌ హర్మోన్లు ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతుంది. ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ స్త్రీలలో సంతానోత్పత్తికి అవసరమైన అండాలను ఉత్పత్తి చేసి అవి పరిణతి చెందేలా చేస్తాయి.టెస్టోస్టిరాన్‌ మగవారిలో పురుషత్వానికి దోహదం చేస్తుంది.

కొలెస్ట్రాల్ ఎముకల ధృఢత్వానికి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కండరాల పెరుగుదలకు,పటుత్వానికి దోహదం చేస్తుంది.చాలా సందర్బాల్లో స్టాటిన్ మందులతో కొలెస్ట్రాల్‌ ను నియంత్రించడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి, వనరులు లభించకుండా పోతాయని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోడానికి స్టాటిన్ మందుల్ని వినియోగించడం అన్ని సందర్భాల్లో సురక్షితం

Whats_app_banner

సంబంధిత కథనం