Idli Pasta Recipe : ఈ వీకెండ్‌కి కొత్త స్నాక్ ట్రై చేయాలనుకుంటే.. ఇడ్లీ పాస్తా వండేయండి..
Fusion Snack Idli Pasta Recipe : ఉదయం వండిన ఇడ్లీలు మిగిలిపోయాయా? వాటిని చల్లారాక తినలేము. వాటితో ఇడ్లీ ఉప్మా చేసుకుని కొందరు తింటారు. అయితే ఇడ్లీతో పాస్తా చేస్తే.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హ్యాపీగా లాగించేయవచ్చు అంటున్నారు నిపుణులు. మరి ఈ టేస్టీ ఐటమ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Fusion Snack Idli Pasta Recipe : ఇడ్లీ పాస్తా మీరు తినే రుచికరమైన వంటలలో కచ్చితంగా బెస్ట్ అవుతుంది. కొందరు డైలీ ఇడ్లీలు తినేందుకు కాస్త ఇబ్బంది పడతారు. అలాంటివారు ఇడ్లీతో మంచి పాస్తా తయారు చేసుకుంటే.. అస్సలు దానిని వదలలేరు. ఇడ్లీతో పాస్తా ఏంటి అనుకుంటున్నారా? అవును మరి.. రోటీన్ ఇడ్లీలకు బాయ్ చెప్పాలన్నా.. లేదంటే టేస్టీ స్నాక్ తినాలన్నా.. మీరు ఇడ్లీ పాస్తా ట్రై చేయవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలి.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* ఇడ్లీలు - 12
* ఉల్లిపాయ - 1 కప్పు (తరిగినవి)
* క్యాప్సికమ్ - 1 కప్పు
* టమోటాలు - 1 కప్పు
* నూనె - 1 టేబుల్ స్పూన్
* ఇంగువ - చిటికెడు
* జీరా - 1 టీస్పూన్
* ఉప్పు - తగినంత
* కారం - అర టీ స్పూన్
* చిల్లీ సాస్ - 1 స్పూన్
* సోయా సాస్ - 2 స్పూన్లు
* పాస్తా సాస్ - 2 స్పూన్లు
* వెనిగర్ - కొంచెం
* కొత్తిమీర - కొంచెం
తయారీ విధానం
ముందుగా ఇడ్లీలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు డీప్ వోక్‌లో నూనె తీసుకుని.. దానిలో ఇంగువ, జీరా వేయండి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, టొమాటోలు, క్యాప్సికమ్‌తో పాటు ఉప్పు, కారం వేసి బాగా కలపండి. వాటిని బాగా వేయించాలి. అనంతరం తరిగిన పచ్చిమిర్చి, వెనిగర్, పాస్తా సాస్, సోయా సాస్, చిల్లీ సాస్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిక్స్‌లో ఇడ్లీలను వేసి కలిపి వేయించాలి. మసాలాలు ఇడ్లీలతో బాగా కలిసేలా తిప్పాలి. వడ్డించే ముందు తరిగిన కొత్తిమీరతో దానిని అలంకరిస్తే సరి. టేస్టీ టేస్టీ ఇడ్లీ పాస్తా రెడీ.
సంబంధిత కథనం