ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వైట్ సాస్ పాస్తా.. తయారు చేసుకోండిలా!-how to make the perfect white sauce pasta know here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  How To Make The Perfect White Sauce Pasta Know Here

ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వైట్ సాస్ పాస్తా.. తయారు చేసుకోండిలా!

HT Telugu Desk HT Telugu
Aug 07, 2022 08:16 AM IST

White Sauce Pasta: ఆరోగ్యంగా ఉండాలంటే సరియైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే చాలా మంది ఆహారం రుచికరంగా ఉంటుందని ఎక్కువగా రెస్టారెంట్లలో ఫుడ్‌‌కు ప్లాన్ చేస్తుంటారు. బయట ఆహారం తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఇంట్లోనే రుచికరమైన రెస్టారెంట్ వైట్ సాస్ పాస్తా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం

White Sauce Pasta
White Sauce Pasta

ఆరోగ్యకరమైన,రుచి కరమైన వైట్ సాస్ పాస్తాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కింది ఇంగ్రేడ్ప్ వేసి తయారు చేసుకోవడం వల్ల పాస్తా చాలా రుచిగా ఉంటుంది. మొక్కజొన్న, ఆలివ్, రెడ్ క్యాప్సికమ్ ద్వారా దీని రుచి పెరుగుతుంది. ఈ పర్ఫెక్ట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

వైట్ సాస్ పాస్తాకు కావలసినవి:

2 కప్పులు పాస్తా (ఉడికించిన)

పిండి 2 టేబుల్ స్పూన్లు

2 కప్పుల పాలు

వెన్న 2 టేబుల్ స్పూన్లు

ఒకటిన్నర టీస్పూన్ ఎండిన మూలికలు

1/2 కప్పు చీజ్ (తురిమిన)

2 స్పూన్ వెల్లుల్లి (సన్నగా తరిగిన)

1/4 కప్పు ఆకుపచ్చ క్యాప్సికమ్ (సన్నని ముక్కలుగా కట్)

1/4 పసుపు క్యాప్సికమ్ (సన్నని ముక్కలుగా కట్)

1/4 ఎరుపు క్యాప్సికమ్ (సన్నని ముక్కలుగా కట్)

1/4 కప్పు బ్రోకలీ (తరిగిన)

1 స్పూన్ మిరప రేకులు

2 చిటికెడు నల్ల మిరియాలు రుచికి ఉప్పు

వైట్ సాస్ పాస్తాను తయారు చేసుకునే విదానం:

ముందుగా ఒక గిన్నెలో పాలు, మైదా, ఉప్పు వేసి బాగా కలిపి మిశ్రమం సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ లో వెన్న వేసి వేడి చేయండి.

తర్వాత అందులో వెల్లుల్లిపాయలు వేసి కాసేపు వేయించాలి.

ఇప్పుడు అందులో మూడు రకాల క్యాప్సికమ్‌లను వేసి మీడియం మంట మీద 2-3 నిమిషాలు ఉడికించాలి.

తర్వాత అందులో బ్రకోలీ వేసి మరికొంత సేపు ఉడికించాలి.

ఇప్పుడు దానికి సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని అలాగే మిరపకాయలు, మిక్స్డ్ హెర్బ్స్, చీజ్, ఉప్పు వేసి బాగా కలిపి 2-3 నిమిషాలు ఉడికించాలి.

ఇప్పుడు అందులో ఉడికించిన పాస్తా వేసి మీడియం మంట మీద 2-3 నిమిషాలు ఉడికించాలి.

వైట్ సాస్ పాస్తా రెడీ. సర్వింగ్ ప్లేట్ లో తీసి పైన ఎండుమిర్చి చల్లి సర్వ్ చేయాలి.

WhatsApp channel