Health Anxiety । మీ ఆరోగ్యంపై ఎక్కువ ఆందోళన చెందుతున్నారా? అందుకు కారణాలు ఇవే!-from overthinking to not feeling safe here are a few signs of health anxiety ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Health Anxiety । మీ ఆరోగ్యంపై ఎక్కువ ఆందోళన చెందుతున్నారా? అందుకు కారణాలు ఇవే!

Health Anxiety । మీ ఆరోగ్యంపై ఎక్కువ ఆందోళన చెందుతున్నారా? అందుకు కారణాలు ఇవే!

HT Telugu Desk HT Telugu
Jul 08, 2023 08:45 AM IST

Health Anxiety: కొంతమందికి తమ ఆరోగ్యంపై ఎప్పుడూ ఆందోళన ఉంటుంది. వారి ఆరోగ్య పరిస్థితుల గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. దీనికి కొన్న కారణాలు ఉన్నాయి, ఇక్కడ తెలుసుకోండి.

Health Anxiety:
Health Anxiety: (pexels)

Health Anxiety: తమకు ఉన్న వ్యాధుల గురించి ఆందోళన చెందడం కూడా ఒక వ్యాధిలాంటిదే. ఎవరైనా వ్యక్తి తనకు ఉన్నటువంటి అనారోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందితే దానిని హైపోకాండ్రియా అని పిలుస్తారు. ఇది ఒక హెల్త్ డిజార్డర్, ఆరోగ్యంపై ఆందోళన గుగ్మత అని చెబుతున్నారు. చాలా మందికి తమ వ్యాధుల విషయంలో లోలోపల కొంత భయం, ఆందోళన ఉంటుంది. అయితే ఈ హెల్త్ యాంగ్జైటీ ఉన్న వ్యక్తుల్లో ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది. ప్రతీ చిన్న విషయానికి ఎక్కువగా ఆందోళన చెందుతారు. తమకు ఉన్న చిన్నపాటి అనారోగ్యం గురించి కూడా, తమకు ఏం జరుగుతుందోనని ఎక్కువగా టెన్షన్ పడతారు. వారి ఆందోళన కారణంగా తరచుగా వైద్యులను మారుస్తారు, వివిధ రకాల చికిత్సలను తీసుకుంటారు.

వ్యక్తుల్లో హైపోకాండ్రియా అభివృద్ధి చెందడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో కొన్నింటిని ఇక్కడ తెలుసుకోండి.

నిరంతరమైన ఆందోళనలు

ఎల్లప్పుడూ ఏదో ఒక ఆందోళనలతో సతమతమయ్యే వారు తమ అనారోగ్య పరిస్థితులను గురించి కూడా ఎక్కువగా ఆందోళన చెందుతారు. ఎవరైనా భయపెడితే వారి ఆందోళన మరింత పెరుగుతుంది.

వ్యాధి లక్షణాలు మారడం

తమకు ఏదైనా అనారోగ్యం ఉంటే వాటి లక్షణాలు ఏమిటో వారికి తెలుసు. ఒకవేళ ఆ లక్షణాలలో మార్పువస్తే లేదా లక్షణాలు కనిపించకపోతే, ఇక ఏం జరుగుతుందోనన్న భయాందోళన మొదలవుతుంది. ఇది నిరంతరం ఉంటుంది.

సురక్షితంగా లేననే భావన

వ్యక్తి తాను సురక్షితంగా లేనని, ఇక తనను ఎవరూ రక్షించలేరనే భావనలో ఉంటారు. తనకేదో తీవ్రమైన బాధ ఉన్నట్లు నిరంతరం ఆందోళన చెందుతాడు.

ఇంటర్నెట్‌లో అనారోగ్య లక్షణాలను శోధించడం

ఇంటర్నెట్‌లో అనారోగ్యం, వాటి లక్షణాల కోసం నిరంతరం శోధిస్తారు. ఏ వ్యాధి లక్షణాలు సరిపోలినా, ఆ వ్యాధులన్నీ తమకు ఉన్నాయని భావిస్తారు, ఇలా ఆందోళన చెందుతారు.

అతిగా ఆలోచించడం

అతిగా ఆలోచించడం మంచిది కాదు. అనారోగ్యంతో బాధపడుతుంటే తమకు ఏం జరుగుతుందోనని అతిగా ఆలోచిస్తూ ఉంటారు.

పరీక్ష ఫలితాలను నమ్మరు

తమ అనారోగ్య భయం కారణంగా అనేక వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితాలు చూసిన తర్వాత కూడా వారికి నమ్మకం ఉండదు, పరీక్ష ఫలితాలు నిజమో కాదో మరో చోట చెక్ చేసుకుంటారు.

WhatsApp channel

సంబంధిత కథనం