Kidney Stones: కిడ్నీలో రాళ్లు.. ఇలాంటి పుడ్స్ ఎక్కువగా తింటే మరింత డేంజర్!-foods to avoid if you have stones in kidneys ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kidney Stones: కిడ్నీలో రాళ్లు.. ఇలాంటి పుడ్స్ ఎక్కువగా తింటే మరింత డేంజర్!

Kidney Stones: కిడ్నీలో రాళ్లు.. ఇలాంటి పుడ్స్ ఎక్కువగా తింటే మరింత డేంజర్!

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 15, 2024 10:30 AM IST

Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఉన్న వారు ఆహారం విషయంలో మరింత జాగ్రత్తలు వహించాలి. లేకపోతే కిడ్నీలు మరింత దెబ్బతింటాయి. సమస్య పెద్దదవుతుంది. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వారు ఎక్కువగా ఎలాంటి ఫుడ్స్ తినకూడదంటే..

Kidney Stones: కిడ్నీలో రాళ్లు.. ఇలాంటి పుడ్స్ ఎక్కువగా తింటే మరింత డేంజర్!
Kidney Stones: కిడ్నీలో రాళ్లు.. ఇలాంటి పుడ్స్ ఎక్కువగా తింటే మరింత డేంజర్! (unsplash)

శరీరంలో కిడ్నీలు (మూత్రపిండాలు) అత్యంత ముఖ్యమైనవి. రక్తం నుంచి వ్యర్థాలను వేరు చేస్తాయి. వ్యర్థాలు బయటికి వెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే కిడ్నీలు మెరుగ్గా పని చేస్తేనే పూర్తిస్థాయి ఆరోగ్యం బాగుంటుంది. వాటికి సంబంధిత సమస్యలు వస్తే ఇబ్బందులు తలెత్తుతాయి. ఇటీవలి కాలంలో చాలా మంది కిడ్నీలో రాళ్లతో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటి పట్ల జాగ్రత్తలు వహించకపోతే కిడ్నీల్లో సమస్య మరింత జఠిలం అవుతుంది. దీర్ఘకాలికంగా ఇబ్బంది కొనసాగుతుంది. కిడ్నీలో రాళ్లు ఉన్న వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

కిడ్నీల్లో రాళ్లతో బాధపడే వారు కొన్ని రకాల ఆహారాలు ఎక్కువగా తీసుకోకూడదు. ఇవి అతిగా తింటే యూరిక్ యాసిడ్ మరింత పెరిగి సమస్య మరింత పెరిగి.. డేంజర్‌గా మారుతుంది. అలా కిడ్నీ రాళ్లు ఉన్న వారు ఎక్కువగా తీసుకోకూడనివి ఏవంటే..

మాంసాహారం తక్కువగా..

కిడ్నీల్లో రాళ్లు ఉన్న వారు మాంసాహారం ఎక్కువగా తినకూడదు. రెడ్ మీట్, చికెన్ లాంటివి బాగా తగ్గించాలి. ఇవి ఎక్కువగా తింటే యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. మూత్రంలో సిట్రేట్ అనే కెమికల్‍ తగ్గుతుంది.

పొటాషియం ఎక్కువగా ఉండే ఇవి.. 

పొటాషియం ముఖ్యమైన పోషకం. అయితే, కిడ్నీలో రాళ్లు ఉన్న వారు ఇది ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోకూడదు. బంగాళదుంపలు, అరటి పండ్లు, టమాటాలు లాంటివి ఎక్కువగా తినకూడదు. ఇవి కిడ్నీల్లో వాపు, మంటను పెంచుతాయి. కిడ్నీ సమస్యను మరింత జఠిలమవుతుంది. యాపిల్, బెర్రీలు, పైనాపిల్, పుచ్చకాయ, ద్రాక్ష లాంటి పండ్లు, క్యాబేజీ, బ్రకోలీ, క్యాలిఫ్లవర్ లాంటి కూరగాయలు తినొచ్చు.

ఉప్పు ఎక్కువగా వద్దు

కిడ్నీలో రాళ్లు ఉన్న వారు ఆహారంలో ఉప్పును ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ తీసుకోకూడదు. దీనివల్ల శరీరంలో సోడియం ఎక్కువవుతుంది. ఇది కిడ్నీల పనితీరు, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే ఫాస్ట్ ఫుడ్‍‍లు, ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తినకూడదు. ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు అందులో సోడియం ఎంత శాతం ఉందో గమనించాలి. ఎక్కువ ఉండే తీసుకోకూడదు.

పాలకూర ఎక్కువగా వద్దు

సాధారణంగా పాలకూరలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే, కిడ్నీలో రాళ్లు ఉన్న వారు మాత్రం పాలకూర ఎక్కువగా తినకూడదు. ఇందులో ఎక్సలైట్స్ ఎక్కువగా ఉంటాయి. కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువయ్యేందుకు ఇది తోడ్పడుతుంది. దుంపలు, నట్స్ కూడా ఎక్కువగా తీసుకోకూడదు.

కూల్‍డ్రింక్స్ కూడా..

కిడ్నీలో రాళ్లు ఉన్న వారు సోడా, కార్బొనేటెడ్ బేవరేజెస్ (కూల్ డ్రింక్స్) ఎక్కువగా తాగకూడదు. వీటిలో ఉండే పాస్ఫరస్.. కిడ్నీలకు సమస్యలను పెంచుతుంది. వీటి బదులు నీరు ఎక్కువగా తాగాలి. హెర్బల్ టీలు తాగడం కూడా మేలు.

Whats_app_banner