Fried Rice tips: ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి, స్ట్రీట్ స్టైల్ రుచి వస్తుంది-follow these tips to make fried rice to get street style taste ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fried Rice Tips: ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి, స్ట్రీట్ స్టైల్ రుచి వస్తుంది

Fried Rice tips: ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి, స్ట్రీట్ స్టైల్ రుచి వస్తుంది

Koutik Pranaya Sree HT Telugu
Oct 15, 2024 11:30 AM IST

Fried Rice tips:ఫ్రైడ్ రైస్ ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. కానీ రెస్టారెంట్ లాంటి రుచి రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

ఫ్రైడ్ రైస్
ఫ్రైడ్ రైస్ (Shutterstock)

వేడివేడి ఫ్రైడ్ రైస్ తినడం ఎవరికైనా ఇష్టమే. ఉదయం పూట అన్నం మిగిలిపోయినా, లేదా స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తే ఫ్రైడ్ రైస్ గుర్తొస్తుంది. కానీ ఇంట్లో చేసే ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్ లాగా అనిపించదు. రెస్టారెంట్ లాగా నోరూరించేలా ఫ్రైడ్ రైస్ చేయాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు.

ఫ్రైడ్ రైస్ టిప్స్:

1) ఫ్రైడ్ రైస్ రుచిని పెంచడానికి అందులో ఏవేవో సాసులు, మసాలాలు దట్టించేస్తారు. అవి రుచిని పాడు చేస్తాయి. కాస్త సోయా సాస్ వేస్తే సరిపోతుంది. మరింకేం అక్కర్లేదు. ఇక రుచి కోసం అల్లం, వెల్లుల్లి ముద్ద వేస్తే చాలు. దాంతో పాటే గుడ్లు, పన్నీర్, బోలెడు కూరగాయల ముక్కలు వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి.

2) ఫ్రైడ్ రైస్ తయారీ కోసం ఉదయం పూట మిగిలిపోయిన అన్నం లేదా కాసేపు ముందుగా తయారుచేసిన అన్నం వాడండి. అప్పుడే వండిన అన్నం చాలా మెత్తగా ఉంటుంది. కాస్త తడి ఉండటం వల్ల ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు అది అడుగున అతుక్కుపోతుంది.

3) ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి ఎప్పుడూ కాస్త వెడల్పుగా ఉన్న పెద్ద పాన్ ఉపయోగించండి. ఇది ఫ్రైడ్ రైస్ ను ఎక్కువగా ఉడికిపోకుండా కాపాడుతుంది. అలాగే పెద్ద పాన్ వాడితే అది పదార్థాలను అన్నింటినీ సమానంగా వేడి చేస్తుంది. అన్నింటినీ బాగా కలపడానికీ సులవవుతుంది.

4) ఫ్రైడ్ రైస్ తయారు చేసేటప్పుడు పెట్టిన కూరగాయ ముక్కల తాలింపు బాగా వేడవ్వాలి. ఆ తర్వాతే అన్నం వేసి కలుపుకోండి. ఇలా చేస్తేనే అన్నీ త్వరగా ఉడికిపోతాయి. మాడిపోకుండా, ఎక్కువగా ఉడికిపోకుండా క్రంచీ టేస్ట్ వస్తుంది.

5) ఫ్రైడ్ రైస్ తయారు చేసేటప్పుడు గ్యాస్ మంట మీడియం లేదా హై మంట మీద ఉండేలా చూసుకోవాలి. అధిక మంటపై ఫ్రైడ్ రైస్ తయారు చేయడం ద్వారా, కూరగాయలన్నీ ఆవిరి కోల్పోకుండా వేగిపోతాయి. ఇది ఫ్రైడ్ రైస్‌కు క్రిస్పీ రుచిని ఇస్తుంది.

Whats_app_banner