Avakaya Fried Rice: స్పైసీ ఆవకాయ ఫ్రైడ్ రైస్, తింటే ఫ్యాన్ అయిపోతారు-how to make spicy avakaya fried rice recipe for dinner ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Avakaya Fried Rice: స్పైసీ ఆవకాయ ఫ్రైడ్ రైస్, తింటే ఫ్యాన్ అయిపోతారు

Avakaya Fried Rice: స్పైసీ ఆవకాయ ఫ్రైడ్ రైస్, తింటే ఫ్యాన్ అయిపోతారు

Koutik Pranaya Sree HT Telugu
Oct 06, 2024 05:30 PM IST

Avakaya Fried Rice: ఆవకాయ రుచితో చేసే ఫ్రైడ్ రైస్ రెసిపీ ఇది. దీనికోసం ఆవకాయ కూడా వాడతాం. కాస్త మార్చి ఫ్రైడ్ రైస్ రుచి తీసుకువస్తాం. ఈ సింపుల్ రెసిపీ తయారీ చూసేయండి.

ఆవకాయ ఫ్రైడ్ రైస్
ఆవకాయ ఫ్రైడ్ రైస్

ఆవకాయతో ఫ్రైడ్ రైస్ ఏంటీ అనుకుంటున్నారా. మీకు ఆవకాయ రుచి నచ్చితే మాత్రం మీరు ఈ ఫ్రైడ్ రైస్ ఫ్యాన్ అయిపోతారు. అలానీ పెద్ద కష్టమైన రెసిపీ ఏం కాదిది. చాలా సులువుగా మిగిలిన అన్నంతో అయినా అల్పాహారంలోకి, సాయంత్రం డిన్నర్ లోకి చేసుకోవచ్చు. రెసిపీ ఎలాగో చూసేయండి.

ఆవకాయ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సినవి:

2 చెంచాల ఆవకాయ

2 కప్పుల అన్నం

2 చెంచాల నూనె

గుప్పెడు కొత్తిమీర తరుగు

అరచెంచా అల్లం వెల్లుల్లి ముద్ద

1 క్యాప్సికం

2 క్యారట్

పావు కప్పు క్యాబేజీ తరుగు

2 పచ్చిమిర్చి, పొడవాటి చీలికలు

సగం టీస్పూన్ మిరియాల పొడి

ఉప్పు అర చెంచా

అర చెంచా సోయా సాస్ (ఆప్షనల్)

అరచెంచా టమాటా సాస్

ఆవకాయ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం:

  1. ముందుగా పెద్ద గిన్నెలో అన్నం తీసుకుని అందులో ఆవకాయ వేసుకుని బాగా కలుపుకోవాలి. దీనికోసం అప్పుడే వండిన అన్నం వాడొచ్చు. లేదా మిగిలిన అన్నం అయినా పర్వాలేదు.
  2. ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులో నూనె వేసుకోండి. కాస్త వేడెక్కాక పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని పచ్చి వాసన పోయేదాకా వేయించండి.
  3. తర్వాత క్యారట్, క్యాబేజీ, క్యాప్సికం ముక్కలు ఒకదాని తర్వాత మరోటి వేసుకుని కలుపుకోండి. అన్నీ బాగా వేగిపోయాక అందులో ఉప్పు, మిరియాల పొడి వేసి కలపండి.
  4. కొత్తిమీర తరుగు వేసి కలియబెట్టి అందులో ఇందాక కలిపి పెట్టుకున్న ఆవకాయ అన్నం వేసుకోండి.
  5. అన్నీ బాగా కలుపుకున్నాక చివరగా మీకిష్టముంటే టమాటా సాస్, సోయా సాస్ వేసి కలపండి. వీటితో స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ రుచి వస్తుంది. అంతే.. అన్నీ బాగా కలిపేసి దింపేసుకుంటే ఆవకాయ ఫ్రైడ్ రైస్ రెడీ.

Whats_app_banner