Home Remedies For Crack Heels । పాదాల పగుళ్లను ఈ చిట్కాలతో నయం చేసుకోండి!-follow these home remedies to repair your cracked heels ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Home Remedies For Crack Heels । పాదాల పగుళ్లను ఈ చిట్కాలతో నయం చేసుకోండి!

Home Remedies For Crack Heels । పాదాల పగుళ్లను ఈ చిట్కాలతో నయం చేసుకోండి!

HT Telugu Desk HT Telugu
Oct 26, 2022 02:00 PM IST

Home Remedies For Crack Heels: రాబోయేది చలికాలం, పాదాల సంరక్షణ కూడా చాలా ముఖ్యం. పాదాల పగుళ్లను తగ్గించే చిట్కాలను ఇక్కడ తెలుసుకోండి.

Home Remedies For Crack Heels:
Home Remedies For Crack Heels:

వాతావరణంలో మార్పు వచ్చింది, చాలా ప్రాంతాల్లో ఇప్పుడు చల్లగా ఉంటోంది. ఇక చలికాలం మొదలైనట్లే. అయితే సీజన్ మారుతున్న కొద్దీ శరీరంలోనూ మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఉదయం లేచి పనిచేసే వారికి, మట్టిలో దుమ్ములో తిరిగే వారికి అరి కాళ్లు పగలడం ప్రారంభమవుతుంది. చలికాలంలో ఈ సమస్య ప్రజలను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. విపరీతమైన చలి, శరీరం పొడిబారడం, గట్టి నేలపై చెప్పులు లేకుండా నడవడం, రక్తం తక్కువగా ఉండటం, దుమ్ము-ధూళి మొదలైన కారణాల వల్ల కాళ్ల మడమలలో పగుళ్లు ఏర్పడతాయి.

చీలమండల పగుళ్లు ఏర్పడినపుడు పట్టించుకోకుండా ఎక్కువగా నీటిలో, మట్టిలో తిరిగితే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. రక్తస్రావంతో పాటు, భగభగ మంట, నొప్పి ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి పగిలిన మడమలను నయం చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం వంటలకు ఉపయోగించే ఇంగువ ఈ పగిలిన మడిమలకు చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.

Home Remedies For Crack Heels- పాదాల పగుళ్లను తగ్గించే చిట్కాలు

ఒక గిన్నెలో కొంచెం ఇంగువను తీసుకొని అందులో వేపనూనెను కలపాలి. దీనిని పేస్టులాగా చేసి ఈ పేస్టును రాత్రిపూట నిద్రించే ముందు కాళ్ల పగుళ్లకు రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయానికి దాదాపు నయం అవుతుంది. ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి. ఇదే కాకుండా మరికొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూడండి.

తేనెతో మృదుత్వం

ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో అరకప్పు తేనె కలపండి. ఈ నీటిలో సుమారు 20 నిమిషాల పాటు మీ మడమలను ఉంచండి. ఆ తర్వాత కాళ్లు కడుక్కొని, కోల్డ్ క్రీమ్‌తో మసాజ్ చేయండి. ఇలా చేస్తే పగిలిన మడిమల నుంచి ఉపశమనం లభిస్తుంది.

అరటిపండు గుజ్జు

బాగా పండిన అరటిపండు గుజ్జును మెత్తగా చేసి చీలమండల పగుళ్లపై రాయండి. ఒక 20 నిమిషాల తర్వాత పాదాలను కడిగేసుకోవాలి. అయితే పాదాలు కడుక్కునేటపుడు సబ్బు ఉపయోగించకూడదు.

కొబ్బరి నూనె వాక్స్

కొబ్బరి నూనె పగిలిన మడమలను నయం చేయడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. మీరు పగిలిన మడమల నొప్పితో బాధపడుతుంటే, కొద్దిగా మైనం లేదా వేజిలెన్ తీసుకొని అందులో కొబ్బరినూనె కలిపి ఆ మిశ్రమాన్ని పగిలిన చోట పూయాలి. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమం పెట్టుకుంటూ ఉండండి.

ఆముదము

పాదాలను గోరువెచ్చని నీటితో కడిగి, ఆ తర్వాత ఆముదం రాస్తే, మడమల పగుళ్లు నయమవుతాయి.

రాబోయేది చలికాలం. మొఖం, చేతులు, పాదాలు పగలటం సర్వసాధారణం. దీనిని నివారించేందుకు హైడ్రేట్ గా ఉండటం, సరైన శ్రద్ధ తీసుకోవటం చేయాలి.

Whats_app_banner

సంబంధిత కథనం