Turmeric adulteration: మీ ఇంట్లోని పసుపు కల్తీ అయిందో లేదో సులువుగా ఈ పరీక్షల ద్వారా తెలుసుకోండి
Turmeric adulteration: ప్రతి ఇంట్లోనూ పసుపు పొడి ఉండాల్సిందే. అయితే ఈ పసుపు పొడిని కూడా కల్తీ చేస్తున్న వారు ఎంతోమంది. మీరు వాడే పసుపు పొడి కల్తీదో కాదో ఇంట్లోనే తెలుసుకోవచ్చు.
Turmeric adulteration: పసుపు వేగంగా ఏ కూర పూర్తి కాదు. మంచి రంగే కాదు, ఇది మంచి రుచిని అందిస్తుంది. చిటికెడు పసుపు పడితే చాలు కూర రుచి, రంగు ఇట్టే మారిపోతుంది. పసుపులో రోగనిరోధక శక్తిని పెంచే ఎన్నో సమ్మేళనాలు, పోషకాలు ఉన్నాయి. అయితే ఈ పసుపు పొడిని కూడా కల్తీ చేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది. మార్కెట్లో దొరికే పసుపులో సగం కల్తీవని తేలింది. మీరు ఇంట్లో వాడే పసుపు స్వచ్ఛమైనదో కాదో తెలుసుకోవాలనుకుంటే చిన్న పరీక్షను చేయండి.
పసుపులో కల్తీ
పసుపును అధికంగా వాడతారు కాబట్టి దీని ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో పసుపు అధికంగానే దొరుకుతుంది. పసుపులో కృత్రిమ రంగులు కలిపి దానికి ఆ రంగును వచ్చేలా చేస్తారు. ఇదే కల్తీ పసుపు. ఎక్కువగా పసుపులో మెటానిల్ అనే రసాయనాన్ని కలుపుతారు. మెటానిల్ అనేది నిషేధించిన ఒక సమ్మేళనం. దీన్ని వాడడం వల్ల ఆ పసుపు కల్తీ అవుతుంది. అలాగే పసుపు పొడిలో చాక్ పౌడర్ లేదా అడవి పసుపును కూడా కలిపి అమ్ముతూ ఉంటారు. ఇవన్నీ ఆరోగ్యానికి కీడు చేస్తాయి. మీరు కొన్న పసుపు కల్తీదో మంచిదో చిన్న పరీక్ష ద్వారా ఇంట్లోనే తెలుసుకోవచ్చు.
కల్తీ పసుపును కనిపెట్టడం ఎలా?
పసుపు సాధారణ రంగుతోనే ఉండాలి. అధిక పసుపు రంగుతో మిలమిలా మెరుస్తూ ఉంటే దానిలో మెటానిల్ రసాయనం కలిపారేమో అనుమానించాలి. దీనికోసం ఇంట్లోనే చిన్న పరీక్ష చేయాలి. చిన్న టెస్ట్ ట్యూబు తీసుకొని చిటికెడు పసుపును అందులో వేయాలి. ఆ పసుపులోనే కొన్ని చుక్కలు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని వేసి బాగా షేర్ చేయాలి. ఆ ద్రావణం గులాబీ రంగులోకి మారితే... అది కల్తీ పసుపు అని అర్థం. ఎందుకంటే కల్తీ పసుపులో మెటానిల్ ఉంటుంది. మెటానిల్, హైడ్రోక్లోరిక్ ఆమ్ల తో కలిసి గులాబీ రంగులోకి మారుతుంది. రంగు మారకుండా ఉంటే మాత్రం అది స్వచ్ఛమైన పసుపు పొడి అని అర్థం చేసుకోవాలి. మెటానిల్ వంటి రసాయనాలు కలిపిన పసుపు తింటే కడుపునొప్పి, వికారం, వాంతులు అయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా అనేక సమస్యలు రావచ్చు.
మరొక సింపుల్ పరీక్ష ద్వారా పసుపు కలిపిందో కాదో తెలుసుకోవచ్చు. మీ అరచేతిలో చిటికెడు పసుపును వేసి బొటనవేలుతో గట్టిగా రుద్దండి. దాదాపు 20 సెకండ్ల పాటు అలా మర్దన చేయండి. తర్వాత రెండు చేతులు దులుపుకోండి. పసుపు మరక పోకుండా అలానే ఉంటే అది స్వచ్ఛమైన పసుపు పొడి అని అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా చేతులు దులుపుకోగానే లేదా ఓసారి నీటి కింద కడుక్కో కడగగానే పోయిందంటే దానిలో మెటానిల్ అనే రసాయనం కలిపినట్టు అర్థం చేసుకోవాలి.
మరొక పరీక్ష ద్వారా కూడా పసుపు పొడి నాణ్యతను పరీక్షించవచ్చు. ఒక గాజు కూజాని తీసుకొని గోరువెచ్చటి నీటితో నింపండి. దానిలో ఒక స్పూన్ పసుపును కలపండి. దాన్ని కదపకుండా అలా వదిలేయండి. పసుపు పొడి అడుగు బాగాన చేరితే పసుపు అది స్వచ్ఛమైనది అర్థం. అలా కాకుండా నీటిలో కలిసిపోయి ముదురు పసుపు రంగులో మారితే మాత్రం అది కల్తీ అయిందని తెలుసుకోవాలి. అలాంటి పసుపును వాడడం మానేయాలి. పసుపు వాడే ముందు ఇలాంటి పరీక్షలు చేసుకుంటే కల్తీ పసుపుకు దూరంగా ఉండవచ్చు.
టాపిక్