డ్రింక్స్ లో ఉండే షుగర్స్ ఆరోగ్యానికి హానిచేస్తాయి. డ్రింక్స్ బదులు పసుపు నీటిని తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పసుపులోని ఔషధ గుణాలు మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.  

pexels

By Bandaru Satyaprasad
Feb 23, 2024

Hindustan Times
Telugu

జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది   

unsplash

పసుపు నీరు గాల్ బ్లాడర్ లో బైల్ ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది కొవ్వుల విచ్ఛిన్నానికి సహాయపడుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. 

unsplash

రోగనిరోధక శక్తిని పెంచుతుంది 

unsplash

కుర్కుమిన్ పసుపులో క్రియాశీల పదార్థం, ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి, అనారోగ్యాలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. 

pexels

అల్జీమర్స్ వ్యాధిని నివారిస్తుంది 

pexels

అల్జీమర్స్ వ్యాధికి చికిత్స లేదు, దీనిని నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పసుపు నీరు ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది, ఇవి అల్జీమర్స్ వ్యాధికి ప్రధాన కారణాలు. 

pexels

మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది- పసుపు నీరు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. స్కిన్ టోన్ మెరుగుపరచడంలో సహాయపడతుంది. 

pixabay

గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది-అధిక  కొలెస్ట్రాల్ మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. టర్మరిక్ వాటర్ తాగడం వల్ల ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి. హృదయనాళ వ్యవస్థలో మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. 

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels