Festival Calendar: అక్టోబర్ నెల పండగల క్యాలెండర్, ఏ తేదీన ఏ పండగ రానుందంటే-festival calendar of october month know dates of festivals ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Festival Calendar: అక్టోబర్ నెల పండగల క్యాలెండర్, ఏ తేదీన ఏ పండగ రానుందంటే

Festival Calendar: అక్టోబర్ నెల పండగల క్యాలెండర్, ఏ తేదీన ఏ పండగ రానుందంటే

Koutik Pranaya Sree HT Telugu
Sep 30, 2024 07:00 PM IST

Festival Calendar: అక్టోబర్ నెలలో ఏ రోజున ఏ పండగ రానుందో తేదీలతో సహా వివరగా తెల్సుకోండి. ఈ నెలలో పెద్ద పండగలన్నీ రానున్నాయి. ఈ నెలంతా పండగలతో గడిచిపోనుంది.

అక్టోబర్ పండగల క్యాలెండర్
అక్టోబర్ పండగల క్యాలెండర్

అక్టోబర్ మాసం వచ్చేసింది, ఎన్నో రోజుల నుంచి ఎదురుచూసే పండుగలు ఎన్నో ఈ నెలలో ఉన్నాయి. దుర్గాపూజ, బతుకమ్మ, దసరా నుంచి దీపావళి వరకు ఈ ఏడాది అక్టోబర్ మాసం ఎంతో ఆనందంగా సాగనుంది.  

బతుకమ్మ సంబరాలు, దాండియా కోలాటాలు, దసరా నవరాత్రుల వేడుకలతో ఈ నెలంతా ఉత్సాహంగా గడిచిపోతుంది. కొన్ని చోట్ల దుర్గాదేవికి ప్రాధాన్యత ఇస్తూ వేడుకలు జరిగితే, తెలంగాణలో బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. తర్వాత కొద్ది రోజులకే దీపావళి కూడా ఇదే నెలలో రానుంది. ఈ పండగలు ఏ తేదీల్లో వస్తున్నాయో చూద్దాం. 

అక్టోబర్ పండల జాబితా:

అక్టోబర్ 2 - ఇదే రోజు బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 10 దాకా బతుకమ్మ వేడుకలు తెలంగాణలో జరగనున్నాయి.

- గాంధీ జయంతి కూడా ఈ రోజే.

- ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం కూడా అక్టోబర్ 2న ఏర్పడనుంది. 2

అక్టోబర్ 3 - దేవీ నవరాత్రులు అక్టోబర్ 3 న ప్రారంభమవుతాయి. ఇదే రోజు బతుకమ్మ సంబరాలూ మొదలవుతాయి.

అక్టోబర్ 11 - ఈ సంవత్సరం, అష్టమి, నవమి ఒకే రోజు వస్తోంది. అక్టోబర్ 11న మహా అష్టమి, మహా నవమి జరుపుకుంటారు.

అక్టోబర్ 12 - ఈ రోజున, దసరా పండగ.

అక్టోబర్ 20 - కర్వా చౌత్, ఇది మన తెలుగు రాష్ట్రాల్లో జరుపుకోరు. ఉత్తర భారతంలో ప్రతి స్త్రీ తమ భర్త కోసం నోచే నోము ఇది.

అక్టోబర్ 29 - ధంతేరాస్ లేదా ధన త్రయోదశి

అక్టోబర్ 30 - ఈ రోజున మాస శివరాత్రి రానుంది.

అక్టోబర్ 31 - అతిపెద్ద పండుగలలో ఒకటైన దీపావళి ఈ రోజే - ఈ సంవత్సరం అక్టోబర్ 31 న వస్తుంది. ఈ రోజున నరక చతుర్దశి కూడా జరుపుకుంటారు.

Whats_app_banner