Fatty Liver Diet : కాలేయ వ్యాధులను దూరం చేసే డ్రింక్స్ ఇవే.. హ్యాపీగా తాగేయండి..-fatty liver diet try these drinks to reduce the risk of liver ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fatty Liver Diet : కాలేయ వ్యాధులను దూరం చేసే డ్రింక్స్ ఇవే.. హ్యాపీగా తాగేయండి..

Fatty Liver Diet : కాలేయ వ్యాధులను దూరం చేసే డ్రింక్స్ ఇవే.. హ్యాపీగా తాగేయండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 25, 2023 02:30 PM IST

Fatty Liver Diet : కాలేయ వ్యాధులు చాలా ఆలస్యంగా బయటపడతాయి. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. అందుకే దానిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కొవ్వు కాలేయ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించే కొన్ని పానీయాలు ఉన్నాయని పలు అధ్యయనాలు నిరూపించాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కాలేయ ఆరోగ్యానికి ఈ డ్రింక్స్ తాగండి
కాలేయ ఆరోగ్యానికి ఈ డ్రింక్స్ తాగండి

Liver Diseases : కాలేయంలో చాలా కొవ్వు పేరుకుపోయినప్పుడు కొవ్వు కాలేయం మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. కానీ ఈ వ్యాధి లక్షణాలను అంత సులువుగా బయటపడవు. కానీ ఆ లక్షణాలు గుర్తిస్తే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే.. జీవనశైలితో పాటు.. ఆహారం, పానీయాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికోసం మీరు కొన్ని పానీయాలను మీ డైట్లో చేర్చుకోవాల్సి ఉంది. అయితే ఆ పానీయాలు ఏంటో.. వాటిని తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కాఫీ

న్యూట్రియెంట్స్ జర్నల్‌లో ఇటీవల ప్రచురించిన అనేక అధ్యయనాలతో సహా.. కాఫీ తాగడం వల్ల ఫ్యాటీ లివర్‌తో బాధపడేవారికి బెనిఫిట్స్ ఉంటాయని కనుగొన్నారు. జర్నల్ ఆఫ్ క్లినికల్ గ్యాస్ట్రోఎంటరాలజీలో ప్రచురించిన మరొక అధ్యయనం ప్రకారం.. కాఫీలో కొవ్వు కాలేయ వ్యాధి, క్యాన్సర్ మొదలైన కాలేయ వ్యాధుల నుంచి మీ కాలేయాన్ని రక్షించే.. రక్షిత సమ్మేళనాలు ఉన్నాయని పేర్కొంది.

గ్రీన్ టీ

మీరు మీ రోజును వేడి కప్పు గ్రీన్ టీతో ప్రారంభిస్తున్నారా? అవును అయితే.. అది మీ కాలేయాన్ని రక్షించుకోవడానికి మీరు సగం దూరంలో ఉన్నట్లే. న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. గ్రీన్ టీలో కాలేయానికి జరిగిన నష్టాన్ని నయం చేసే లక్షణాలు ఉన్నాయి. అయితే సమస్యలను నివారించడానికి మీరు గ్రీన్ టీని మితంగా తాగాలి.

క్యారెట్ జ్యూస్

క్యారెట్ ఎల్లప్పుడూ మీ శీతాకాలపు ఆహారంలో చేర్చడానికి ఆరోగ్యకరమైన కూరగాయలలో ఒకటిగా చెప్తారు. ప్రివెంటివ్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల మోనోశాచురేటెడ్ ఫ్యాట్యాసిడ్‌ల ఉత్పత్తిలో సహాయపడుతుంది. దీనివల్ల డోకోసాహెక్సేనోయిక్ యాసిడ్ మెరుగుపడుతుంది. ఈ రెండూ మీ కాలేయ ఆరోగ్యానికి మంచివి.

బీట్‌రూట్ జ్యూస్

కాలేయ ఆరోగ్యానికి మాత్రమే కాదు.. బీట్‌రూట్ జ్యూస్ మీ అన్ని ఆరోగ్య వ్యాధులను దూరం చేయడంలో ఒక వరంగా చెప్పవచ్చు. ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది కొవ్వు కాలేయ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది మీ కాలేయం నుంచి టాక్సిన్స్‌ను దూరంగా ఉంచుతుంది. మొత్తం కాలేయ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.

ఉసిరికాయ రసం

ఇండియన్ గూస్‌బెర్రీ అని కూడా పిలుస్తారు. ఉసిరి చాలా ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఇది యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. అంతేకాకుండా ఇది కాలేయ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ ఆరోగ్యాన్ని ప్రోత్సహించే లక్షణాలను కూడా కలిగి ఉంది. ఉసిరికాయలలో ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మీకు మరింత ఆరోగ్యాన్ని అందిస్తాయి.

Whats_app_banner

సంబంధిత కథనం