Bakra Eid Mubarak । ఈద్ ముబారక్.. విభిన్న భాషల్లో బక్రీద్ శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!
Bakra Eid Mubarak: బక్రీద్ పవిత్రమైన రోజున మీరు మీ ముస్లిం స్నేహితులకు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. పండగ శుభాకాంక్షలు ఎలా చెప్తారో ఈ కింద చూడండి.
Bakra Eid Mubarak: ముస్లింలు ఘనంగా జరుపుకునే మరొక పండగ ఈద్- అల్- అదా. ఇది రంజాన్ తర్వాత రెండవ అతి ముఖ్యమైన ఇస్లామిక్ పండుగ, దీనినే బక్రా ఈద్, బక్రీద్, బఖ్రీద్, ఈద్ అల్-అధా, ఈద్ ఖుర్బాన్, ఖుర్బాన్ బయారమి, త్యాగాల విందు వంటి వివిధ పేర్లతో కూడా పిలుస్తారు. ఈరోజు సౌదీ అరేబియాలోని ముస్లింలు బక్రీద్ జరుపుకుంటున్నారు. కాగా, భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మొదలైన దక్షిణాసియా దేశాలలోని ముస్లింలు జూన్ 29, గురువారం నాడు బక్రీద్ జరుపుకుంటున్నారు.
త్యాగాలకు ప్రతీకగా చెప్పే బక్రీద్ పండగను ముస్లింలు అల్లాహ్ పై ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఉదయాన్నే నమాజ్ చేసిన తర్వాత పండగ ప్రారంభమవుతుంది. ఈరోజున వివిధ రకాల మాంసాహార వంటకాలతో ఖుర్బానీ విందు ఉంటుంది.
ఈద్-అల్-అదా లేదా బక్రీద్ పవిత్రమైన రోజున మీరు మీ ముస్లిం స్నేహితులకు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. బక్రీద్ వేడుకల సందర్భంగా మీరు ఎవరికైనా శుభాకాంక్షలు తెలియజేయటానికి గౌరవప్రదంగా "ఈద్ ముబారక్" అని మీ శుభాభినందనలు తెలియజేయవచ్చు. లేదా " బ్లెస్డ్ ఈద్" లేదా "హ్యాపీ ఈద్" అంటూ కూడా చెప్పవచ్చు.
ముస్లింలకి సంబంధించిన ఈద్ వేడుకల సందర్భంగా "ఈద్ ముబారక్" అనేది విస్తృతంగా తెలియజేసే గ్రీటింగ్ అయినప్పటికీ, ఇది వివిధ భాషలు, సంస్కృతులలో వివిధ రకాలుగా వ్యక్తీకరించవచ్చు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన విభిన్న భాషలలో పండగ శుభాకాంక్షలు ఎలా చెప్తారో ఈ కింద చూడండి.
- అరబిక్: ఈద్ ముబారక్" (عيد مبارك)
- బెంగాలీ: ఈద్ ముబారక్" (ঈদ মুবারক)
- ఉర్దూ: ఈద్ ముబారక్ (عید مبارک)
- టర్కిష్: బైరామినిజ్ కుట్లు ఒల్సున్
- ఇండోనేషియన్: "సెలమత్ హరి రాయ" లేదా "సెలమత్ ఇదుల్ ఫిత్రి"
- మలేయ్: "సెలమత్ హరి రాయ" లేదా "సెలమత్ హరి రాయ ఐడిల్ఫిత్రి"
- పర్షియన్/ఫార్సీ: "ఈద్-ఇ షోమా మొబారక్" (عید شما مبارک)
- స్వాహిలి: "హెరీ యా ఈద్"
- స్పానిష్: "ఫెలిజ్ ఈద్"
- ఫ్రెంచ్: "బోన్ ఫేట్ డి ఎల్'ఈడ్"
- జర్మన్: "ఫ్రోహెస్ ఈడ్ఫెస్ట్"
- కొరియన్: “ఈద్ ముబాలాకీ” (ఈద్ 무바라크)
భాష ఏదైతేనేం.. భావం ముఖ్యం. మీరు కూడా మీకు నచ్చిన భాషలో 'ఈద్-ఉల్-అధా ముబారక్' శుభాకాంక్షలను సాంప్రదాయంగా తెలియజేయవచ్చు. మీ సందేశాన్ని పంపవచ్చు, అల్లా మీపై దయ చూపాలని ఆశీర్వదించవచ్చు, పండగలో పాల్గొని సంతోషాలను పంచవచ్చు.
Bakra Eid Mubarak Greetings: ఈద్ ముబారక్.. బక్రీద్ శుభాకాంక్షలు!
Eid Mubarak.. ఈద్ ముబారక్.. బక్రీద్ శుభాకాంక్షలు!
Eid Mubarak.. ఈద్ ముబారక్.. బక్రీద్ శుభాకాంక్షలు!
Eid Mubarak.. ఈద్ ముబారక్.. బక్రీద్ శుభాకాంక్షలు!
సంబంధిత కథనం
టాపిక్