Eid-ul-Adha 2023 । బక్రీద్ పండగ ఎప్పుడు? ఖుర్భానీ ఎందుకు చేయాలి? ఈద్ విశేషాలు ఇవిగో!-eiduladha 2023 date in india festival history khurbani significance and all you need to know about the bakrid e ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Eid-ul-adha 2023 । బక్రీద్ పండగ ఎప్పుడు? ఖుర్భానీ ఎందుకు చేయాలి? ఈద్ విశేషాలు ఇవిగో!

Eid-ul-Adha 2023 । బక్రీద్ పండగ ఎప్పుడు? ఖుర్భానీ ఎందుకు చేయాలి? ఈద్ విశేషాలు ఇవిగో!

HT Telugu Desk HT Telugu
Jun 27, 2023 03:16 PM IST

Eid-ul-Adha 2023: త్యాగాల పండుగ బక్రీద్ పండగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజున వివిధ రకాల మాంసాహార వంటకాలతో విందు ఉంటుంది. బక్రీద్ ఎప్పుడు, ఖుర్బానీ ఎందుకు చేస్తారు వంటి విశేషాలను ఇక్కడ తెలుసుకోండి.

Eid-ul-Adha 2023
Eid-ul-Adha 2023 (istock)

Eid-ul-Adha 2023: ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే రెండవ అతి పెద్ద, ముఖ్యమైన పండుగ ఈద్-ఉల్-అధా. దీనినే బక్రా ఈద్, బక్రీద్, ఈద్ ఖుర్బాన్ లేదా ఖుర్బాన్ బయారమి అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఇది ఇస్లామిక్ క్యాలెండర్ లో పన్నెండవ నెల అయిన జుల్ హిజ్జా/ ధుల్-హిజ్జా నెలలోని పదవ రోజున జరుకుంటారు. దీనికి ఒక రోజు ముందు అంటే తొమ్మిదవ రోజును అరఫా దినంగా, అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ఈ ఏడాది భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లోని ముస్లింలు జూన్ 28వ తేదీన సాయంత్రం అరఫాత్ దినంగా జరుపుకుంటారు. హజ్ కీలక ఆచారమైన అరాఫత్ దినం తర్వాత ఈద్-ఉల్-అదాను జరుపుకుంటారు. అనగా భారతదేశంలోని ముస్లింలు జూన్ 29, 2023న గురువారం రోజున ఈద్-ఉల్-అదా/ బక్రీద్ పండుగను జరుపుకుంటారు.

త్యాగాలకు ప్రతీకగా చెప్పే బక్రీద్ పండగను ముస్లింలు భక్తి,శ్రద్ధలతో జరుపుకుంటారు. ఉదయాన్నే నమాజ్ చేసిన తర్వాత పండగ ప్రారంభమవుతుంది. ఈ రోజున వివిధ రకాల మాంసాహార వంటకాలతో విందు ఉంటుంది.

బక్రీద్ ప్రాముఖ్యత

మత గ్రంథాల ప్రకారం.. సమాజ హితం కోసం, అల్లా ఆజ్ఞ మేరకు మహ్మద్ ప్రవక్త తన కుమారుల్లో ఒకరిని త్యాగం చేయడానికి సిద్ధపడతారు. ఆ త్యాగాన్ని స్మరిస్తూ ఈద్- అల్- అదా జరుపుకుంటారు. అయితే, ముస్లిం ప్రవక్త ఇబ్రహీం తన కుమారుడిని త్యాగం చేయడానికి సిద్ధమైనప్పుడు, అల్లా జోక్యం చేసుకుంటాడు, అతని కొడుకు స్థానంలో బలి ఇవ్వడానికి ప్రత్యామ్నాయాన్ని మార్గాన్ని అందిస్తాడు. దీంతో అతని కొడుకు ప్రాణాలతో తిరిగి వస్తాడు. అల్లాపై విశ్వాసం, నమ్మకం ఉంచితే అల్లా కాపాడుతాడు అని చెప్పటానికి ఇది ప్రతీక.

ఖుర్బానీ చేయడం ఇందుకే..

ఈ నేపథ్యంలో బక్రీద్ నాడు మేకలు లేదా గొర్రెల వంటి జంతువులను బలి ఇవ్వడం ప్రతీతి. అందుకే ఇది బక్రా ఈద్ అయింది. జంతువును బలి ఇవ్వడం అనేది బక్రీద్ పండుగలో కీలకమైన అంశం. దీనినే ఖుర్బానీ చేయడం అంటారు. ఖుర్బానీ చేయడం ద్వారా ఆ త్యాగాన్ని స్మరించుకుంటారు. బలి ఇచ్చిన జంతువు నుండి మాంసాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు. అందులో ఒక వంతు తమ కోసం ఉంచుకుంటారు, రెండో వంతును బంధువులు, స్నేహితులకు పంచుతారు, ఇక మూడవ వంతును పంచుతారు. ఇలా ఖుర్బానీని దానం ఇవ్వడం దానం ఇవ్వడం ద్వారా ఈ పండుగ దాతృత్వ గుణాలను, ఇతరులపై జాలి, కరుణ, దయ వంటివి చూపించాలనే స్ఫూర్తిని చాటుతుంది.

బక్రీద్ రోజున ఖుర్బానీని పంచుకోవడం, రుచికరమైన విందు భోజనాలను చేయడం, అందరితో కలిసి ఆనందంగా వేడుక చేసుకోవటం ద్వారా అల్లా తన ప్రేమను అందరికీ పంచుతారని, తనపై విశ్వాసం ఉంచిన అందరినీ ఆనందంగా ఉంచుతారనే అర్థాన్ని సూచిస్తుంది, భక్తి భావాన్ని పెంచుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం